ప్రభువు సమూవేలును పిలచుట

3 1. బాలుడైన సమూవేలు ఏలీ పర్యవేక్షణము క్రింద యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ రోజు లలో యావే వాక్కు చాల అరుదుగా విన్పించెడిది. ప్రభువు సాధారణముగా సాక్షాత్కారమయ్యెడివాడు కాడు.

2. ఒకనాి రాత్రి ఏలీ పరుండియుండెను. అతని కన్నులకు మసకలు క్రమ్మియుండుటచే చూపాన దయ్యెను.

3. ప్రభువుముందట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సమూవేలు కూడ  దైవమంద సము ఉన్న యావేమందిరములో పండుకొని నిద్రించు చుండెను.

4-5. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గబాలున ఏలీ యొద్దకు పరిగెత్తుకొనిపోయి ”నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో! వచ్చితిని” అనెను. ఏలీ ”నేను నిన్ను పిలువలేదు. వెళ్ళిపడుకొమ్ము” అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను.

6. యావే సమూవేలును మరల పిలిచెను. అతడు లేచి ఏలీచెంతకుపోయి ”నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో! వచ్చితిని” అనెను. ఏలీ ”నాయనా! నేను నిన్ను పిలువలేదు. వెళ్ళి పడుకొమ్ము” అని అనెను.

7. సమూవేలునకు యావే గూర్చి ఇంకను తెలియదు. యావే వాక్కు అతనికి ఇంకను ప్రత్యక్షము కాలేదు.

8. ప్రభువు సమూవేలును మూడవ సారి కూడ పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి ”నీవు నన్ను పిలిచితివికదా, ఇదిగో! వచ్చితిని” అనెను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను.

9. అతడు సమూవేలుతో ”వెళ్ళి పడుకొమ్ము. నిన్నెవ్వరైన పిలిచినచో ‘ప్రభూ! ఆనతి యిమ్ము. నీ దాసుడు ఆలించుచునేయున్నాడు’ అని పలుకుము” అని చెప్పెను. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను.

10. అంతట ప్రభువు ప్రత్యక్షమై నిలిచి వెనుకి మాదిరిగా ”సమూవేలూ!” అని పిలిచెను. అతడు ”ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునేయున్నాడు” అనెను.

11. యావే ”యిస్రాయేలు జనులయెదుట నేనొక కార్యము చేసెదను. దానిని గూర్చి వినినవారి రెండు చెవులు గింగురుమనును.

12. ఆ దినమున, ఏలీ కుటుంబమునకు నేను చేసెదనన్న కార్యము చేసితీరెదను. నా పని పూర్తిచేసెదను.

13. నేను ఏలీ కుటుంబమును చాలకాలమువరకు శపించితినని తెలియజేయుము. తన కుమారులిద్దరును దేవుని నిందించుచున్నారని ఎరిగియు అతడు మందలింప డయ్యెను.

14. ఇదిగో! నేను శపథము చేసి చెప్పు చున్నాను వినుము. బలులుగాని, కానుకలుకాని ఏలీ తనయుల పాపములకు ఇక ప్రాయశ్చిత్తము చేయ జాలవు” అని పలికెను.

15. సమూవేలు తెల్లవారువరకు పరుండెను. పిమ్మట దేవాలయ తలుపులు తెరచెను. అతడు ప్రభు దర్శనమును ఏలీకి ఎరిగింపవెరచెను.

16. ఏలీ ”నాయనా” అని సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనెను.

17. ఏలీ ”ఆయన నీతో ఏమి చెప్పెను? నా వద్ద ఏమియు దాచవలదు. ఆయన చెప్పిన మాటలలో ఏదియైన దాచెదవేని ప్రభువు నీకెంతి కీడైన చేయునుగాక!” అనెను.

18. అంత సమూవేలు ఏలీకి అంతయు తెలియజెప్పెను. ఏలీ ”సెలవిచ్చిన వాడు యావే. ఆయన చేయదలచుకొన్న కార్యము చేయునుగాక!” అనెను.

19. సమూవేలు పెరిగిపెద్దవాడయ్యెను. ప్రభువు అతనికి తోడుగానుండెను. కావున అతడు పలికిన పలుకొక్కియు వ్యర్థముగాలేదు.

20. దాను నగరమునుండి బేర్షెబా వరకు గల యిస్రాయేలు ప్రజలందరు సమూవేలు యావేప్రవక్త అయ్యెనని తెలిసికొనిరి.

21. షిలో వద్ద ప్రభువు సమూవేలుకు పలుమార్లు సాక్షాత్కరించెను. అచట అతనికి ప్రభుదర్శనము లభించుచుండెను.

Previous                                                                                                                                                                                                Next