ఉపోద్ఘాతము:

పేరు, కాలము, రచయిత: రాజుల దినచర్య మొది గ్రంథము చూడుము.

చారిత్రక నేపథ్యము: ఈ గ్రంథములో రచయిత, సొలోమోను పరిపాలన ప్రారంభమైన క్రీ.పూ. 970 నుండి, బబులోను రాజు యెరూషలేమును, దేవాలయమును నాశనము చేసి, యిస్రాయేలీయులను బబులోనునకు బానిసలుగ తీసికొనిపోయిన క్రీ.పూ. 587 వరకు జరిగిన సంఘటనలు వ్రాయబడినవి.

ముఖ్యాంశములు:  ఈ గ్రంథమునందు యాజకవర్గమునకు, దావీదు వంశానికీ మధ్యగల అనుబంధము, ప్రాముఖ్యతను గురించి ప్రధానంగా వర్ణించబడినది. ఈ యాజకత్వపుసేవ దక్షణరాజ్యమైన యూదాకు లభించినది. అందువలననే ఉత్తరరాజ్యమైన యిస్రాయేలు, దాని రాజులు గురించి ప్రస్తావించబడలేదు. సొలోమోనురాజు చేప్టిన యెరూషలేము దేవాలయ నిర్మాణము, దేవాలయపు మహిమ, అక్కడి ఆరాధనావిధానమును వివరించును. దావీదు మరియు సీయోను సాంప్రదాయములను ప్రముఖముగ ప్రస్తావించును.

క్రీస్తుకు అన్వయము: దావీదు వంశావళి క్రమముగా క్రీస్తు వంశావళిగా రూపొందడము ప్రధానాంశము. క్రీస్తు తన శరీరమును దేవాలయముతో పోల్చడాన్ని (యోహాను 2:19) పరిగణలోనికి తీసుకొనినచో, యెరూషలేము దేవాలయాన్ని క్రీస్తుకు ప్రతీకగా గుర్తించగలము. యూదా పతనథలో కూడా ఆయా రాజులద్వారా మతసంస్కరణలు జరగడము క్రీస్తు సంస్కరణలతో పోల్చవచ్చు.