బానిసలకు సంబంధించిన నియమములు

1. నీవు యిస్రాయేలీయులకు నిర్ణయింప వలసిన విధులివి.

2. ”ఎవడైనను ఒక హెబ్రీయుని దాసునిగా కొనినచో, వాడు ఆరేండ్ల వరకే దాసుడుగా ఉండును. ఏడవయేట నష్టపరిహారము చెల్లింపకయే అతడు స్వతంత్రుడగును.

3. ఆ దాసుడు ఏకాకిగా వచ్చినచో తిరిగి ఏకాకిగనే వెళ్ళును. వివాహితుడుగా వచ్చినచో అతనితోపాటు అతని భార్యయు వెళ్ళి పోవును.

4. యజమానుడు ఒక పిల్లను తెచ్చి దాసునకు పెండ్లిచేసిన యెడల, ఆ పిల్ల కుమారులను, కుమార్తె లను అతనికి కనినయెడల, ఆ కుమారులు కుమార్తెలు, ఆమెయు యజమానుని వశమగుదురు. దాసుడు ఒంటరిగనే యాజమానుని వీడివెళ్ళవలెను.

5. కాని దాసుడు ‘నేను నా యాజమానుని, నా భార్యను, బిడ్డలను ప్రేమించుచున్నాను. స్వతంత్రుడనగుట నాకు ఇష్టములేదు’ అని చాినచో అప్పుడు ఆ యజమానుడు అతనిని దేవునియొద్దకు కొనిపోవలయును.

6. అతనిని తలుపునొద్దకో, ద్వారబంధము కడకో తీసికొని పోయి వాని చెవిని కదురుతో కుట్టవలయును. ఇక ఆ దాసుడు బ్రతికినన్నాళ్ళు ఆ యజమానుని కొలువు ననే ఉండును.

7. ఒకడు తన కుమార్తెను బానిసగా విక్రయించిన, ఆమె మగబానిసల మాదిరిగా వెలు పలకు వెళ్ళజాలదు.

8. ఆమె తనను పొందిన యజమానుని సంతోషపెట్టలేకపోయినచో అతడు ఆమెను విడుదల చేయవచ్చును. కాని ఆమెను విదేశీ యులకు అమ్ము అధికారము అతనికిలేదు. అటుల చేయుట అన్యాయము.

9. యజమానుడు ఆమెను తన కుమారునికొరకు ఉద్ధేశించినచో తన కుమార్తెపట్ల ఎట్లు వ్యవహరింపునో అట్లే ఆమెపట్లను వ్యవహరింప వలయును.

10. ఎవ్వడైనను మారుపెండ్లామును చేర్చుకొనినచో ఆమె కూికి, గుడ్డకు, దాంపత్యధర్మ మునకు లోటు లేకుండ చేయవలయును.

11. ఈ మూడింట అతడు ఆమెను మోసగించిన, ఆమె ఎి్ట సొమ్మును చెల్లింపకయే అతనిని వీడిపోవచ్చును.

నర వధ

12. మనుష్యుని క్టొి చంపినవానికి మరణమే శిక్ష.

13. కాని ఎవ్వడైనను బుద్ధిపూర్వకముగాగాక దైవవశమున హత్య చేసినయెడల, వాడు పారిపోదగిన చోటును నీకు చూపుదును.

14. కాని ఒకానొకడు ద్రోహబుద్ధితో సాివానిని చంపినచో, వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను, వానిని ఈడ్చుకొని పోయి చంపవలయును.

15. తల్లినిగాని తండ్రినిగాని క్టొినవానికి మరణదండనమే శిక్ష.

16. ఒకడు మరియొకనిని బలాత్కారముగాకొనిపోయి అమ్మినను, తన వశమున ఉంచుకొనినను వానికి మరణదండనమే శిక్ష.

17. తల్లినైనను, తండ్రినైనను శపించువానికి మరణ దండనమే శిక్ష.

దెబ్బలు – గాయములు

18. మనుష్యులు కలహించుకొనినప్పుడు, ఒకడు మరియొకనిని రాతితోనైన, పిడికితోనైన క్టొినచో, దెబ్బలు తిన్నవాడు చావక మంచముప్టి, కొన్నాళ్ళకు లేచి చేతికఱ్ఱతో అటునిటు తిరుగుచుండినయెడల, ఆ క్టొినవానికి శిక్షలేదు.

19. కాని దెబ్బలు తిన్న వాడు పనిచేయలేని రోజులకు అతడు నష్టపరిహారము చెల్లింపవలయును. వాడు పూర్తిగా కోలుకొనునట్లు చూడవలయును.

20. ఒకడు తన దాసునిగాని, దాసినిగాని చావ మోదినయెడల అతడు దండనమునకు పాత్రుడు.

21. కాని ఒకి రెండురోజులవరకు ఆ బానిస బ్రతికినచో క్టొినవానికి దండనము లేదు. వాడు  కొనిన బానిస అతని సొత్తేకదా!

22. మనుష్యులు దెబ్బలాటకు దిగినప్పుడు, ఒకడు ఒకానొక గర్భవతిని క్టొినచో, ఆమెకు ప్రాణహాని లేకపోయినను గర్భస్రావము జరిగిన యెడల, హానికలిగించినవాడు ఆమెభర్త కోరిన నష్టపరి హారమును చెల్లింపవలయును. న్యాయాధిపతుల తీర్పు ప్రకారముగా అతడు సొమ్ము చెల్లింపవలయును.

23-25. కాని హాని జరిగినయెడల ప్రాణము నకు ప్రాణము, కింకి కన్ను, పింకి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ శిక్షగా నిర్ణయింపవలయును.

26. ఒకడు తన దాసుని కింమీదగాని, దాసి కిం మీదగాని క్టొి కన్ను పోగ్టొినయెడల, కింకి నష్టపరిహారముగా వారిని స్వతంత్రులనుచేసి వెళ్ళి పోనీయవలయును.

27. అతడు తన దాసుని పింని గాని, దాసి పింనిగాని ఊడగ్టొిన యెడల పింకి నష్టపరిహారముగా వారిని స్వతంత్రులను జేసి పోనీయ వలయును.

యజమానుల విధులు

28. ఎద్దు పురుషునిగాని, స్త్రీనిగాని చావక్రుమ్మిన యెడల దానిని రాళ్ళతో చావగొట్టవలయును. దాని మాంసమును తినరాదు. ఎద్దుగల ఆసామి మాత్రము దోషి కాజాలడు.

29. కాని అది మొదినుండి పోట్లఎద్దుగానుండినయెడల, ఎంత హెచ్చరించినను యజమానుడు దానిని అదుపున పెట్టనియెడల అది పురుషునిగాని, స్త్రీనిగాని చావపొడిచినచో ఎద్దును రాళ్ళతో చావగొట్టవలయును. దాని యజమానుని కూడా చంపివేయవలయును.

30. కాని యజమానుడు తన ప్రాణమునకు బదులు ధనము చెల్లించుట పొసగునేని అడిగినంత చెల్లింపవలయును.

31. ఎద్దు బాలునిగాని బాలికనుగాని చావక్రుమ్మినచో, దాని యజమానుడు పై నియమమునే పాింపవలయును.

32. ఎద్దు దాసునిగాని, దాసిని గాని చావపొడిచినచో దాని ఆసామి వారి యజమానునకు ముప్పది వెండి నాణెములను చెల్లింపవలెను. ఎద్దును రాళ్ళతో చావ గొట్టవలయును.

33. ఒకడు నూతిమీది కప్పును తొలగించుట వలననో లేక నుయ్యిని త్రవ్వి దానిని కప్పకపోవుట వలననో, దానిలో ఎద్దయినను, గాడిదయినను పడి చచ్చినయెడల, 34. నుయ్యి స్వంతదారుడు నష్టము చెల్లింపవలయును. అతడు జంతువు యజమానునకు సొమ్ము చెల్లింపవలయును. అప్పుడు చచ్చిన జంతువు సొమ్ము చెల్లించినవానిది అగును.

35. ఒకని ఎద్దు మరియొకని ఎద్దును చావబొడిచినయెడల యజమాను లిద్దరు బ్రతికిన ఎద్దును అమ్మి, వచ్చిన సొమ్మును సమముగా పంచుకొనవలయును. చచ్చిన ఎద్దును కూడ ఇద్దరును పంచుకొనవలయును.

36. కాని, ఎద్దు మొదినుండి పోట్లగొడ్డు అని తెలిసియు, యజమానుడు దానిని అదుపున పెట్టనియెడల అతడు ఎద్దుకు ఎద్దును ఈయవలయును. అప్పుడు చచ్చిన ఎద్దు అతనిదే అగును.

Previous                                                                                                                                                                                                   Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము