మోవాబీయులు
యూదాలో ఆశ్రయమును బడయుట
16 1. ఎడారిలోని ‘సెల’ నగరము నుండి
ప్రజలు యెరూషలేమున రాజ్యముచేయు
రాజునకు గొఱ్ఱెపిల్లను కానుకగా
పంపుచున్నారు.
2. ఆర్నోను రేవువద్ద మోవాబు స్త్రీలు
గూి నుండి ఎగురగొట్టబడిన పకక్షులవలె
అటునిటు తిరుగాడుచున్నారు.
3. ”మీరు మాకు సలహానిండు,
మాకు నిర్ణయములు చేసిపెట్టుడు,
మధ్యాహ్నమున చల్లని నీడనొసగు చెట్టువలె
మీరు మమ్ము సంరక్షింపుడు,
మేము కాందిశీకులము.
కాన శత్రువుల కంటబడనీకుండ
మమ్ము దాచియుంచుడు.
4. మేము మోవాబు నుండి పారిపోయివచ్చితిమి.
ఇపుడు మీ చెంత వసింతుము.
మమ్ము చంపగోరు వారినుండి మీరు
మమ్ము కాపాడుడు” అని
మోవాబీయులు యూదీయులను అడుగుదురు.
శత్రువులిక దేశమును పీడింపరు,
నాశనముచేయరు.
దేశమును ధ్వంసముచేయువారు గతింతురు.
5. అప్పుడు దావీదు వంశజుడొకడు రాజగును.
అతడు సత్యసంపన్నుడై కరుణతో,
ప్రజలను పాలించును.
న్యాయమును జరిగించుటకై బహుజాగ్రత్తగా
పరిశీలించుచు ధర్మముకొరకు తపించిపోవును.
మోవాబును గూర్చి విలాపగీతము
6. మేము మోవాబీయులు గర్వాత్ములని వింమి.
వారు అహంకారపూరితులని తెలిసికొింమి.
కాని వారి పొగరుబోతుతనము ఎందుకు
పనికిరాదని యూదీయులు పలుకుదురు.
7. కావున మోవాబీయులెల్లరును గూడి
తమదేశము కొరకు శోకింపవలెను.
వారు కీర్హరేసెతున తాము భుజించుచువచ్చిన
ద్రాక్షపండ్ల మోదకములను తలంచుకొని
నిరాశతో విలపింతురు.
8. హెష్బోను, సిబ్మా ద్రాక్షతోటలు నాశనమైనవి.
పూర్వము అన్య జాతులరాజులు
ద్రాక్షరసము త్రాగి మత్తెక్కి యుండెడివారు.
పూర్వము ఆ ద్రాక్షలు యాసేరు నగరమువరకును,
ఎడారివరకును గూడ వ్యాపించియుండెడివి.
వాని తీగెలు విశాలముగా వ్యాపించి
సముద్రమును దాటెను.
9. కనుక నేను యాసేరుకొరకు శోకించినట్లే
సిబ్మా ద్రాక్షల కొరకు కూడ శోకింతును.
హెష్బోను, ఎలాలేలను నా కన్నీళ్ళతో
తడుపుదును. వానిలో పంట ఏమియు పండదు. కనుక ప్రజలు ఆనందముతో కేకలిడరు.
10. సారవంతమైన తోటలలోనుండి సంతోషము
సమసిపోయెను.
తోటలలో ఆనందముతో కేకలిడువాడుగాని,
పాటలు పాడువాడుగాని లేడు.
ద్రాక్షగెలలను త్రొక్కి రసముతీయువారు లేరు.
సంతోషనాదములు అడుగింనవి.
11. కావున మోవాబు కొరకు
నా గుండె కొట్టుకొనుచున్నది,
కీర్హరేసు కొరకు నేను తంత్రీవాద్యమువలె
నిలువెల్ల కంపించిపోవుచున్నాను.
12. మోవాబు ప్రజలు ఆయాసముతో
ఉన్నతస్థలమునకు ఎక్కిపోయినను,
దేవళములలో ప్రవేశించి ప్రార్థనలు చేసినను
ప్రయోజనమేమియు ఉండబోదు.
13. పూర్వము ప్రభువు మోవాబును గూర్చి పలికిన సందేశమ్టిది.
14. కాని ఇప్పుడు ”నియమిత కాలము మూడేండ్లలోనే మోవాబు గొప్పసంపదలన్నియు నాశనమగును. ఆ దేశపు మహాప్రజలలో కొద్దిమంది మాత్రమే మిగులుదురు. వారును బలహీనులగుదురు” అని ప్రభువు పలుకుచున్నాడు.