దేవాలయము మీద కోరిక

ప్రధానగాయకునికి

కోర కుమారులు రచించిన గిత్తీత్‌ అనెడి రాగముమీద పాడదగిన కీర్తన

84 1.      సైన్యములకధిపతియైన ప్రభూ!

                              నీ నివాసము ఎంత రమ్యము!

2.           నేను యావే మందిరావరణములను

               దర్శింపవలెనని ఉవ్విళ్ళూరుచున్నాను,

               తపించిపోవుచున్నాను.   

               పూర్ణహృదయముతోను, ఆనందముతోను

               నేను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును.

3.           నా దేవుడవును, నా రాజువును,

               సైన్యములకధిపతియైన ప్రభూ!

               నీ బలిపీఠమువద్ద పిచ్చుకలు గూడు కట్టుకొన్నవి.     వానకోయిలలుకూడ

               పిల్లలు చేయుటకు గూడు పెట్టుకొన్నవి.

4.           నీ మందిరమున వసించుచు,

               ఎల్లవేళల నిన్ను స్తుతించువారు ధన్యులు.

5.           నీ వలన బలముపొంది నీ దేవాలయమునకు

               యాత్ర చేయగోరువారు ధన్యులు.

6.           వారు ఎండిన లోయగుండ పయనముచేసి

               దానిని చెలమల తావుగా మార్చుదురు.

               తొలకరివానలు దానిని మడుగులతో నింపును.

7.            వారు పయనించిన కొలది

               అధికబలమును బడయుదురు.

               సియోను దేవాధిదేవుని దర్శింతురు.

8.           సైన్యములకధిపతియైన ప్రభూ!

               నా వేడుకోలును ఆలింపుము.

               యాకోబు దేవా! నా మొర వినుము.

9.           మాకు రక్షకుడవైన దేవా!

               మాపై నీ దృష్టి నిలుపుము.

               నీవు అభిషేకించిన అతనిని కాక్షింపుము.

10.         అన్యుల ఇండ్లలో వేయినాళ్ళు

               గడపినదానికంటె నీ మందిరమున

               ఒక్కరోజు వసించుటమేలు.

               దుష్టుల ఇండ్లలో నివసించుటకంటె,

               నా దేవుని మందిరమున

               ద్వారపాలకుడనుగా ఉండుటమెరుగు.

11.           ప్రభువు మనకు సూర్యుడు, కవచము వింవాడు

               ఆయన మనకు కృపను, కీర్తిని దయచేయును.

               ధర్మవర్తనులుగా మనువారిక

               అతడు ఎి్ట శుభములను నిరాకరింపడు.

12.          సైన్యములకధిపతియైన ప్రభూ!

               నిన్ను నమ్మువారు ధన్యులు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము