దైవదర్శనము

9 1. అయితే, వేదనలోనున్న వారికి ఇంక్టిె విచారముండబోదు. ప్రభువు పూర్వము సెబూలూను, నఫ్తాలిమండలములను అవమానమున ముంచెను. ఆయన తదుపరి దినములలో ఈ ప్రాంతములకు కీర్తినితెచ్చును. సముద్రము ప్రాంతమును,  యోర్దానుకు ఆవలి ప్రాంతమును, అన్యజాతివారు వసించు గలిలేయ ప్రాంతము వరకును గల ప్రదేశము కీర్తిని బడయును.

2.           చీకిలో నడుచు జనులు

               గొప్పవెలుగును చూచిరి.

               గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు

               ప్రజలమీద జ్యోతిప్రకాశించెను.

3.           ప్రభూ! నీ జాతిని విస్తరింపజేసితివి.

               వారిని సంతోషచిత్తులను గావించితివి.

               కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా,

               కొల్లసొమ్ము పంచుకొనువారు

               ప్రమోదము చెందినట్లుగా,

               ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. 

4.           నీవు వారి మెడమీది కాడిని విరుగగ్టొితివి.

               వారి భుజములమీది

               దండమును ముక్కలుచేసితివి.

               నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా,

               ఆ ప్రజలను పీడించువారిని ఓడించితివి.

5.           వారిమీదికి దాడిచేయు

               శత్రుసైన్యముల పాదరక్షలు,

               నెత్తురులో తడిసిన దుస్తులు

               అగ్నిలో భస్మమగును.

6.           ఏలయన, మనకొక శిశువు జన్మించెను.

               మనమొక కుమారుని బడసితిమి.

               అతడు రాజ్యభారము వహించును.

               ”ఆశ్చర్యకరుడు, సలహాదారుడు,

               బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు,

               శాంతికరుడైన రాజు” అని అతడికి పేరిడుదురు.

7.            అతని రాజ్యాధికారము విస్తరిల్లును.

               అతని రాజ్యమున సదా శాంతినెలకొనును.

               అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి,

               నీతిన్యాయములతో అధికారము నెరపుచు

               నేినుండి కలకాలమువరకును

               పరిపాలనచేయును.

               సైన్యములకధిపతియైన ప్రభువు

               ఈ కార్యమును నెరవేర్చుటకు

               కృతనిశ్చయుడయ్యెను.

ప్రభువు యిస్రాయేలును శిక్షించును

8.           ప్రభువు యాకోబు వంశజుల మీదికి

               తన వాక్కు పంపెను.

               అది యిస్రాయేలీయుల మీదికి  దిగివచ్చెను.

9.           యిస్రాయేలీయులెల్లరును,

               సమరియా పౌరులెల్లరును

               ఈ సంగతిని యెరిగియేయున్నారు.

               వారు పొగరుతోను, కండకావరముతోను ఇట్లనిరి:

10.         ”ఇటుకల ఇండ్లు పడిపోయినవి,

               కాని వానికి బదులుగా

               మేము చెక్కిన రాతిఇండ్లు కట్టుదుము.

               అంజూరములను నరికివేసిరి.

               కాని వానికి బదులుగా 

               మేము  దేవదారులను పెంచుదుము.”

11.           కాని ప్రభువు శత్రువులను

               వారిమీదికి పురికొల్పెను.

               వారు దాడిచేయుటకు సంసిద్ధులు అగుచున్నారు.

12.          తూర్పున సిరియా, పడమరన ఫిలిస్తీయులు

               కోరలువిప్పి యిస్రాయేలును

               మ్రింగివేయజూచుచున్నారు.

               అయినను ప్రభువు కోపము ఇంకను

               ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకు

               చాపిన బాహువును దించలేదు.

13.          సైన్యములకధిపతియగు ప్రభువు

               యిస్రాయేలు ప్రజలను శిక్షించినను వారు

               పశ్చాత్తాపపడి ఆయనచెంతకు తిరిగిరారైరి.

14.          కనుక  ప్రభువు  ఒక్క రోజులోనే

               యిస్రాయేలు  తలను , తోకను,  తాి కొమ్మను, 

               రెల్లును  కూడ నాశనము చేయును.

15.          పెద్దలు ఘనులు ఆ తల.

               కల్లలాడు ప్రవక్తలు ఆ తోక.

16.          ప్రజానాయకులు జనులను తప్పుత్రోవ ప్టించిరి,

               వారు నడిపించిన ఆ జనులు నాశనమైరి.

17.          కనుక ప్రభువు వారి యువకులను బ్రతకనీయడు.

               వారి వితంతువులను, అనాథశిశువులను కరుణింపడు. ప్రజలెల్లరు దుష్టులై

               పాపకార్యములకు పాల్పడిరి.

               వారు పలికెడు పలుకులెల్ల దుర్భాషలే.

               అయినను ప్రభుని కోపము ఇంకను

               ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకు

               చాపిన బాహువును దించలేదు.

18.          ప్రజలపాపములు అగ్నివలె మండి

               ముండ్ల పొదలనెల్ల తగులబెట్టును.

               అడవిలోని కారు చిచ్చువలె

               రగుల్కొని పొగలు వెడలగ్రక్కును.           

19.          సైన్యములకధిపతియైన ప్రభువు

               కోపాగ్ని దేశమునెల్ల కాల్చివేయును.

               ప్రజలెల్లరు ఆ అగ్నికి ఆహుతి అగుదురు.

               ఎవడు తోడివానిని ప్టించుకొనడు.

20.        వారు కుడిప్రక్కన ఉన్న దానిని పట్టుకొందురు.

               కాని ఇంకను ఆకలిగొందురు.

               ఎడమప్రక్కన ఉన్నదానిని తిందురు.

               కాని ఇంకను తృప్తి పొందరు.

               తమ స్వమాంసమునే భక్షింతురు.

21.          మనష్షే ఎఫ్రాయీమును,

               ఎఫ్రాయీము మనష్షేను భక్షించును.

               వీరు ఇరువురు కలిసి యూదాతో కలహింతురు.

               అయినను  ప్రభువు కోపము ఇంకను

               ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకుగాను

               చాపిన బాహువును ఇంకను దించలేదు.