ఉపోద్ఘాతము:
పేరు: హీబ్రూ భాషలో కీర్తనల గ్రంథమును ”సెఫెర్ తెహిల్లిమ్ (ఐలిచీనీలిజీ ఊలినీరిజిజిరిళీ)”అని పిలుస్తారు. దీనిని సెప్తువజింత్ కీర్తనల గ్రంథము (ఆరీబిజిళీళిరి) అని, లతీనులో ”గేయాల సంకలనము” (ఆరీబిజిశిలిజీరితిళీ) అని అంారు. ఇది వివిధ భావాలు, అంశములతో కూడివున్న కీర్తనలు, పాటలు లేదా గేయాల మాలిక.
కాలము: క్రీ.పూ. 1000 దావీదు కాలము నుండి సమీకరించిన కీర్తనలను క్రీ.పూ.2వ శతాబ్దములో ‘కీర్తనలు’ గ్రంథముగా కూర్పు చేశారు.
రచయిత: వివిధ రచయితలు: దావీదు, సొలోమోను, కోరా పుత్రులు, ఆసాపు, ఎస్రాహీయుడైన ఏతాము, హిజ్కియా, హేమాను మొదలగువారు.
చారిత్రక నేపథ్యము: కీర్తనలు ప్రత్యేకముగా చారిత్రక వృత్తాంతముల వర్ణన కొరకు ఉద్దేశింపబడినవి కావు. అయితే వాి ప్రాతిపదిక మాత్రము యిస్రాయేలీయుల చరిత్రతో ముడిపడి ఉండును. ఉదా: దావీదు, సౌలు గాథలు. వీితోపాటు యిస్రాయేలీయుల పండుగలు, ఆరాధనలు, ఆచారాల ప్రస్తావనలు పుష్కలంగా వుండును. శతాబ్దాల కాలమునాి సాహిత్య ప్రక్రియ ఈ గ్రంథములో మనకు కనిపిస్తుంది. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మనము చేసే ప్రార్థనల ప్టికయే ఈ కీర్తన గ్రంథావళి.
ముఖ్యాంశములు: దేవుడికి, దైవప్రజలకు మధ్య జరిగే సంభాషణలు, భక్తుల పరితాపాలు, విజ్ఞాపనలు ఈ గ్రంథములో ప్రధాన అంశములు. వీిలో ప్రజల నిత్యానుభావాలైన: ప్రేమ, దుఃఖము, సంతోషము, సంశయము, నమ్మకము, బాధ, పాపఅనుతాపము, ఊరట, నిరాశ, నిరీక్షణ, క్రోధము, సంతుష్టి, ప్రతీకారేచ్ఛ, క్షమాగుణము మొదలైనవన్నియు ఉండును. ఇవన్నీగూడ విశ్వాసికి ప్రార్థనానుభూతిని కలిగిస్తాయి, ప్రేరేపిస్తాయి, ప్రోత్సహిస్తాయి, సేదదీరుస్తాయి. ఈ కీర్తనలను పది ప్రధానభాగములుగా విభజించవచ్చును. అవి: 1. స్తుతి కీర్తనలు, 2. వ్యాకుల కీర్తనలు, 3. కృతజ్ఞతా కీర్తనలు, 4. ఆరాధనార్చన కీర్తనలు, 5. వివేక కీర్తనలు, 6. రాజకీర్తనలు, 7. సియోను / యెరూషలేము కీర్తనలు, 8. ఆధ్యాత్మిక కీర్తనలు, 9. ఓదార్పు కీర్తనలు, 10. చరిత్ర స్మృతుల కీర్తనలు.
కీర్తనలతో ప్రార్థన: ప్రార్థన పవిత్రాత్మ వరము. ప్రార్థన ఒక హృదయాలాపన (రోమీ. 8:26). ప్రార్థన ఒక నిర్దిష్టమైన పద్ధతిలో దేవునితోచేసే సంభాషణ. ఆలాిం ప్రార్థనల సమాహారమైన కీర్తనల గ్రంథములో మానవ రక్షణచరిత్ర, హృదయస్పందన వినిపిస్తుంది. కావున అర్థవంతమైన ప్రార్థనా జీవితానికి కీర్తనలు నిత్య సహాయకాలుగా నిలుస్తాయి.
క్రీస్తుకు అన్వయము: క్రీస్తు ప్రభువు కీర్తనలతో ప్రార్థించినట్లు పవిత్రగ్రంథము చెబుతుంది (కీర్త.113-118; మత్త. 26:30). క్రీస్తు తన జీవితము ద్వారా నూతన నిబంధనను ఏర్పరచారు. క్రీస్తును మెస్సయాగా ప్రకించే కీర్తనలు అక్కడక్కడ వున్నాయి. వాిల్లో కొన్ని: 1. మెస్సయ (34:20), 2. ప్రవక్త (22), 3. దావీదు రాజసం (2,45,72), 4. పునాదిరాయి (118:22; మత్త. 21:42). వీితోపాటు కీర్తనలలో క్రీస్తుని ప్రతిబింబించేవి చాలా కనబడతాయి. ఉదా: కీర్తన. 2:7= మత్త. 3:17; కీర్తన 8:6= హెబ్రీ 2:7-8; కీర్తన 16:10= మార్కు 16:6-7; కీర్తన 34:20= యోహాను 19:32-36.