1. రూతు – నవోమి

1 1. న్యాయాధిపతులు పరిపాలనచేయు కాలమున దేశమున పెద్ద కరువు వచ్చెను. కనుక యూదా రాజ్యమునందలి బేత్లెహేములో నివసించునొకడు తన భార్యను, తన ఇద్దరు కుమారులను తీసికొని మోవాబు దేశమునకు వలసపోయెను.

2. అతనిపేరు ఎలీమెలెకు.  అతని భార్య పేరు నవోమి. కొడుకుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు ఎఫ్రాతా తెగవారు. వారు మోవాబు దేశమున వసించుచుండగా 3. ఎలీమెలెకు చని పోయెను. ఇక నవోమికి మిగిలినది ఇద్దరు కుమారులు మాత్రమే.

4. ఆ ఇరువురు మోవాబు యువతులను పెండ్లాడిరి. వారి పేర్లు ఓర్పా, రూతు. వారు ఆ దేశ మున పదియేండ్లపాటు జీవించిరి.

5. ఆ పిమ్మట ఆ ఇద్దరు కుమారులు కూడ మరణించిరి. ఆ విధముగ భర్త, పుత్రులు గతింపగా నవోమి ఒంటరిగా మిగిలి పోయెను.

6. ప్రభువు యిస్రాయేలు ప్రజలను కరుణించి వారి దేశమున పంటలు పండించెనని విని ఆమెయు, ఆమె కోడండ్రును మోవాబు నుండి వెళ్ళగోరిరి.

7. కనుక ఆమెయు, ఆమె కోడండ్రులు పయనమై వారితో పయనమై యూదా రాజ్యమునకు పోవు బాటను ప్టిరి.

8. త్రోవలో ఆమె ఇద్దరు కోడండ్రతో ”అమ్మలార! మీరిక తిరిగి మీ ప్టుినిండ్లు చేరుకొనుడు. మీరు నాయెడల, ఆ గతించిన వారియెడల మిగుల దయ చూపిరి. ప్రభువు కూడ మిమ్ము  కరుణతో చూచును గాక!

9. యావే అనుగ్రహము వలన మీరు మరల పెండ్లియాడి మీ కుటుంబములను నిలబెట్టుకొందురు గాక!” అని పలికి వీడ్కోలు సూచనగా వారిని ముద్దుపెట్టుకొనెను.

10. కాని ఆ కోడండ్రు పెద్దగా ఏడ్చుచు ”మేమును నీతో పాటు మీ జనము వద్దకు వత్తుము” అనిరి.

11. కాని నవోమి వారితో ”అమ్మ లారా! మీరు నావెంటరానేల? మిమ్ము మరల పెండ్లి యాడుటకు నాకింకను కుమారులున్నారు గనుకనా?

12. మీరిక తిరిగిపొండు. మరల వివాహమాడుటకు నేనా ప్రాయముచెల్లినదానను. ఒక వేళ నేను ఇంకను ఆశ కలదులే అనుకొని పెండ్లిచేసికొని ఈ రేయినే పెనిమినికూడి గర్భముతాల్చి కుమారులను కనినను, 13. ఆ పుత్రులు పెరిగి పెద్దవారగు వరకును పెండ్లి యాడకుండ కనిపెట్టుకొని ఉందురా? నాకు కలుగ బోవు సుతులను నమ్ముకొని మీరు మరల వివాహ మాడకుందురా? అట్లు జరుగరాదు. బిడ్డలారా! మిమ్ము చూడగా నా కడుపుతరుగుకొని పోవుచున్నది. ప్రభువు నన్నిట్లు శిక్షించెను. నేనేమి చేయుదును?” అని పలికెను.

14. ఆ మాటలకు వారు మరల వెక్కివెక్కి ఏడ్చిరి. అంతట ఓర్పా వీడ్కోలు సూచనగా అత్తను ముద్దుపెట్టుకొని వెళ్ళిపోయెను. కాని రూతు మాత్రము నవోమిని వదలిపెట్టదయ్యెను.  

15. నవోమి కోడలిని ”అమ్మా! నీ తోడి కోడలు తన బంధువుల యొద్దకు వెళ్ళిపోయినది. ఆమె తన జాతిజనులదేవుని కొలుచును. మరి నీవుకూడ వెళ్ళి పోరాదా?” అని అడిగెను.

16-17. కాని రూతు అత్తతో, ”నీవు నన్ను వెళ్ళిపొమ్మని నిర్బంధపెట్ట వలదు. నేనును నీ వెంటవత్తును.

               నీవు వెళ్ళుచోటునకే నేనును వత్తును.

               నీవు వసించుచోటనే నేనును వసింతును.

               నీ బంధువులు నా బంధువులగుదురు.

               నీ దేవుడు నా దేవుడగును.

               నీవు మరణించు చోటుననే నేనును మరణింతును.

               నిన్ను పాతిపెట్టు చోటుననే నన్నును పాతిపెట్టుదురు.

               మృత్యువుతప్ప మరియొకి

               మనలను వేరుపరచినచో

               ప్రభువు నాకు ఎంతి కీడైనను చేయునుగాక!”

అని పలికెను.

18. నవోమి కోడలు తనతోవచ్చుటకు నిశ్చయించుకొన్నదని గ్రహించి ఆమెను వారింప దయ్యెను.

19. ఆ మీదట వారిరువురును ప్రయాణము సాగించి బేత్లెహేము చేరుకొనిరి. నవోమి తిరిగి వచ్చినదని విని ఆ నగరవాసులందరు వారి సంగతులే చెప్పుకొనిరి. ఆ ఊరిస్త్రీలు నవోమిని చూచి ”ఈమె నిజముగా నవోమియేనా?” అని విస్తుపోయిరి.

20-21. ఆమె ”నన్ను నవోమి అనవలదు, మారా1 అని పిలువుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు నన్ను దారుణ ముగా శిక్షించెను.

నేనిచట నుండి పిల్లజల్లలతో వెడలిపోతిని.

కాని ప్రభువు నన్ను ఏకాకిని చేసి

యిటకు మరల్చుకొనివచ్చెను.

యావే నన్ను దోషినిగా నిర్ణయించి

ఆపదలపాలుచేయగా

మీరిపుడు నన్ను నవోమి అని పిలువనేల?”

అనెను.

22. నవోమి, ఆమెకోడలు మోవాబీయుల ఆడపడుచునగు రూతు, తిరిగివచ్చిన వైనమిది. వారు యవపంట కోతకు వచ్చు కాలమున బేత్లెహేము చేరుకొనిరి.

Previous                                                                                                                                                                                                   Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము