అస్సిరియా రాజు సన్హెరీబు దాడి

32 1. హిజ్కియా పైరీతిగా ప్రభువునకు విశ్వస నీయమైన సేవలు చేసిన తరువాత అస్సిరియా రాజైన సన్హెరీబు యూదామీదికి దండెత్తివచ్చెను. అతడు యూదాలోని ప్రాకారములు గల రక్షితపట్టణములను ముట్టడించి వానిని శీఘ్రగతిని వశము చేసికోవలెనని  తమ సైనికులకు ఆజ్ఞ ఇచ్చెను.

2. ఆ రాజు యెరూషలేమునుగూడ వశము చేసికోగోరెనని హిజ్కియా గ్రహించెను.

3. కనుక అతడును, అతని ఉద్యోగులును, వీరులును యెరూషలేమునకు వెలుపల నున్న చెలమనుండి పారెడు నీిని ఆపివేయవలెనని సంకల్పించుకొనిరి. అస్సిరియనులు పట్టణము దగ్గరికి వచ్చినప్పుడు వారికి నీరు దొరకకూడదు అనుకొనిరి.

4. కనుక రాజోద్యోగులు చాలమంది ప్రజలను తీసి కొనిపోయి చెలమనుపూడ్చి పొలముగుండ పారు నీి కాలువను ఆపివేసిరి.

5. హిజ్కియా పట్టణములోని కోటలను బలపరచెను. ప్రాకారమును మరమ్మతు చేయించి దానిమీద బురుజులు నిర్మించెను. నగరము నకు వెలుపలగూడ ప్రాకారము నిర్మించెను. నగరము నకు తూర్పువైపున పల్లమునుపూడ్చిన తావున నిర్మింపబడిన మిల్లో దుర్గములను బలపరచెను. ఈటెలను డాళ్ళను విస్తారముగా చేయించెను.

6. అతడు పట్టణ ప్రజలందరికిని సైన్యాధిపతులను నియమించెను.ఆ జనులందరిని నగరద్వారము చెంతనున్న మైదానమున ప్రోగుచేయించి వారికి ధైర్యము కలిగించుటకు ఇట్లు చెప్పెను.

7. ”మీరు ధైర్యస్థైర్యములు అలవరచుకొనుడు. అస్సిరియా రాజును అతని దండునుచూచి భయపడకుడు. దిగులు చెందకుడు. అతనికంటె మనకే ఎక్కువ బలముకలదు.

8. అతనికి మానుషబలమున్నది. కాని మనకు మన దేవుడైన ప్రభువున్నాడు. ఆ ప్రభువు మన పక్షమున యుద్ధముచేసి మనకు సాయపడును.” ఆ రాజు మాటలు విని ప్రజలు ధైర్యము తెచ్చుకొనిరి.

సన్హెరీబు బెదరింపులు

9. సన్హెరీబు అతని సైన్యములు లాకీషు చెంత మకాము చేయుచుండెను. అతడు అచినుండి హిజ్కియాకును, యెరూషలేమున వసించు యూదీయు లకును తన దూతలద్వారా ఈ క్రింది వార్తపంపెను: 10. ”అస్సిరియా ప్రభువైన సన్హెరీబు వార్తయిది. నేను యెరూషలేమును ముట్టడింపబోవుచుండగా ఈ నగర మును విడనాడకుండుటకు మీకు ధైర్యమెట్లు కలిగి నది?

11. మీ దేవుడైన ప్రభువు మిమ్ము మా దాడి నుండి కాపాడునని హిజ్కియా మీతో చెప్పుచున్నాడు. కాని మీరు ఆకలిదప్పులకు చిక్కి చచ్చుటతథ్యము.

12. ఈ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠము ఎదుటనే నమస్కరించి దానిమీద ధూపము వేయవలెనని యూదీయులను, యెరూషలేము పౌరులను నిర్బంధించి, ఇతర ఉన్నతస్థలములలోని యావే బలిపీఠములను పడగ్టొించినవాడుకాడా?

13. మా పూర్వులును, నేనును ఇతర జాతులకు ఏమి చేసితిమో మీరెరుగరా? ఏ జాతి దేవతలైన తమ ప్రజను నా బారినుండి కాపాడగలిగిరా?

14. మా పూర్వులు నాశనము చేసిన జాతులలో ఏ జాతి దేవతలైన తమ ప్రజను నేడు నా దాడినుండి రక్షింపగలిగిరా? మరి మీ దేవుడు మాత్రము మిమ్ము నా దాడినుండి ఎట్లు కాపాడ గలుగును?

15. కనుక ఇప్పుడు హిజ్కియా ఈ రీతిగా మిమ్ము మోసపుచ్చి అపమార్గము ప్టించుచుండగా మీరు ఊరకుండరాదు. అసలు మీరతనిని నమ్మవలదు. ఏ జాతి దేవుడైనను ఏ దేశపు దేవుడైనను తన ప్రజను మా పితరుల దాడి నుండిగాని, నా దాడి నుండిగాని రక్షింపజాలడు. కనుక మీ దేవుడుకూడ మిమ్ము నా బారినుండి కాపాడజాలడు.”

16. సన్హెరీబు దూతలు దేవుడైన ప్రభువునకును, ఆయన సేవకుడైన హిజ్కియాకును వ్యతిరేకముగా ఇంకా పెక్కుదుర్భాష లాడిరి.

17. అతడు ప్రభువును అవమానించుచు ఈ క్రింది లేఖ కూడ వ్రాసెను: ”ఇతర దేశములలోని జాతుల దేవతలు తమ ప్రజను నా బారినుండి కాపాడ జాలరైరి. అటులనే హిజ్కియా సేవించు దేవుడుకూడా తన ప్రజను నా ముట్టడినుండి కాపాడలేడు.”

18. ఆ రాజోద్యోగులు పురప్రాకారముమీద కూర్చుండి యున్న యెరూషలేము పౌరులవైపు తిరిగి గొంతెత్తి హీబ్రూ భాషలో ఈ సంగతులెల్ల చెప్పిరి. ప్రజలను కలవరప్టిె భయప్టిె పట్టణమును స్వాధీనము చేసి కొనవలెనని వారి పన్నాగము.

19. వారు నర మాత్రులు చేసిన విగ్రహములగు ఇతర జాతుల దేవత లను గూర్చి పలికిన దూషణలను యెరూషలేము దేవునిమీద కూడ పలికిరి.

ప్రభువు హిజ్కియా మనవిని ఆలించుట

20. ఇి్ట పరిస్థితులలో హిజ్కియా రాజును, ఆమోసు కుమారుడైన యెషయా అను ప్రవక్తయు ప్రభువును ప్రార్థించి తమకు సహాయము చేయుమని మొరపెట్టుకొనిరి.

21. అప్పుడు ప్రభువు ఒక దేవదూతను పంపగా అతడు అస్సిరియా సైన్యాధి పతులను, సైనికులను హతము చేసెను. అస్సిరియా రాజు అవమానముతో తన దేశమునకు తిరిగిపోయెను. అచట అతడు ఒకనాడు తన దేవుని మందిరములోనికి వెళ్ళగా అతని సొంతకుమారులే అతనిని కత్తితో నరికివేసిరి.

22. ఈ రీతిగా ప్రభువు హిజ్కియాను యెరూషలేము పౌరులను అస్సిరియా రాజు సన్హెరీబు దాడినుండియు, ఇతర శత్రువుల బారినుండియు కాపాడెను. వారికెల్ల దిక్కులందు శాంతిలభించెను.

23. అప్పినుండి ఎల్లజాతులు హిజ్కియాను గౌరవముతో చూచెను. చాలమంది యెరూషలేము నకు వచ్చి ప్రభువునకు కానుకలను, హిజ్కియాకు బహుమతులను అర్పించిరి.

24. ఈ సంఘటన జరిగిన కాలముననే హిజ్కియా తీవ్రముగా జబ్బుపడి చనిపోవు స్థితికి వచ్చెను. అతడు ప్రభువునకు మొరపెట్టగా దేవుడు అతని వేడుకోలునాలించెను. అతని వ్యాధి నయమగు ననుటకు నిదర్శనముగా ఒక గుర్తును చూపించెను.

25. కాని రాజు గర్వభావముతో ప్రభువునకు వందన ములు చెల్లింపడయ్యెను. కనుక అతనితోపాటు యూదా రాజ్యము, యెరూషలేము నగరముకూడ ప్రభువు ఆగ్రహమునకు గురియయ్యెను.

26. చివరకు హిజ్కియాయు, యెరూషలేము పౌరులును దేవుని ముందట తలవంచిరి. కనుక ఆ రాజు జీవించి యున్నంతకాలము ప్రభువు ఆ ప్రజలను శిక్షింపలేదు.

27. ఆ రాజునకు విస్తార సంపదలు, గౌరవము దక్కెను. అతడు తన వెండి బంగారములను, రత్నము లను, సుగంధ ద్రవ్యములను, డాళ్ళను, విలువగల ఇతర వస్తువులను భద్రపరచుటకు కొట్లను క్టించెను.

28. తన ధాన్యమును ద్రాక్షసారాయమును ఓలివు తైలమును పదిలపరచుటకు కొట్లను క్టించెను. తన పశువులకు కొట్టములను, గొఱ్ఱెలమందలకు దొడ్లను నిర్మించెను.

29. అతనికి పశువులమందలు, గొఱ్ఱెల మందలు సమృద్ధిగా నుండెడివి. ప్రభువు ఆ  రాజు నకు చాలసంపదలు దయచేసెను. కనుక అతడు నగరములు నిర్మించెను.

పరిపాలనాంతము

30. హిజ్కియా గిహోను చెలమనుండి వెలువడు నీిపాయను ఆపుచేయించి ఈ నీిని పడమివైపుగా దావీదునగరమునకు మరలించెను. అతడు తాను చేప్టిన కార్యములందెల్ల విజయము సాధించెను.  

31. అతని రాజ్యమున జరిగిన ఆ అద్భుతవృద్ధిని గూర్చి విచారించుటకు బబులోనియా అధిపతులు రాయబారులను పంపినపుడుగూడ ప్రభువు అతనిని తన ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తింపనిచ్చెను. అతని శీలమును పరీక్షించుటకే దేవుడట్లు చేసెను.

32. హిజ్కియా చేసిన ఇతర కార్యములు, అతని సేవాకృత్యములు ఆమోసు కుమారుడైన యెషయా ప్రవక్త దర్శనములు అను గ్రంథమునను, యూదా యిస్రాయేలురాజుల చరితమునను లిఖింపబడియే యున్నవి.

33. అంతట హిజ్కియా తన పితరులతో నిద్రించగా జనులు అతనిని రాజసమాధులలో పై భాగమున పాతిప్టిెరి. ఆ రాజు చనిపోయినపుడు యూదీయులు యెరూషలేము పౌరులు అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అటుతరువాత అతని కుమారుడు మనష్షే రాజయ్యెను.