జారిపోయిన గొడ్డలి మరల దొరకుట
6 1. ఒకనాడు ప్రవక్తల సమాజములోని శిష్యులు ఎలీషాతో ”అయ్యా! మనము వసించు ఈ తావు చాల ఇరుకుగా ఉన్నది.
2. నీవు అనుమతి ఇచ్చినచో మేము యోర్దాను నదికివెళ్ళి కఱ్ఱ నరుకుకొనివచ్చి క్రొత్త ఇండ్లు కట్టుకొందుము” అనిరి. అతడు ‘అట్లే పొండు’ అనెను.
3. వారిలో ఒకడు ఎలీషాను కూడ తమతో రమ్మని బతిమాలగా అతడు అంగీకరించెను.
4. వారందరును కలిసివెళ్ళి యోర్దాను చేరుకొని అచట కఱ్ఱ నరకుచుండిరి.
5. అపుడు ప్రవక్త ఒకడు చెట్టును నరకుచుండగా అతని ఇనుపగొడ్డలి జారి క్రింది నీిలో పడెను. అతడు ఎలీషాతో ”అయ్యా! ఇది ఎరవు గొడ్డలి. నేనిక ఏమి చేయుదును!” అనుచు సంతాప పడెను.
6. ఎలీషా అది ఎక్కడ పడినదో చూపుమనెను. అతడు గొడ్డలిపడిన తావును చూపెను. ఎలీషా ఒక కొమ్మ నరికి ఆ తావున పడవేయగా ఇనుపగొడ్డలి నీిపై తేలియాడెను.
7. అతడు గొడ్డలిని తీసికొమ్మ నగా చెట్టు క్టొినవాడు చేయిచాచి దానిని వెలుపలికి తీసెను.
ఎలీషా సిరియాదండును పట్టుకొనుట
8. సిరియారాజు యిస్రాయేలుపైదండెత్త, అతడు తన ఉద్యోగులతో సంప్రతించి ఒకానొక అనువైన తావున శిబిరము పన్నెదమని చెప్పెను.
9. కాని దైవజనుడు ఎలీషా ”అచట సిరియనులు పొంచి ఉన్నారు. కనుక నీవు ఆ తావునకు వెళ్ళవలదు” అని యిస్రాయేలు రాజునకు కబురంపెను.
10. కనుక యిస్రాయేలురాజు ఆ శిబిరము ప్రాంతమున వసించు తనప్రజలను ముందుగనే హెచ్చరింపగా వారు అపా యమునుండి తప్పించుకొనిరి. ఇట్లు చాలాసార్లు జరిగెను.
11. కడకు సిరియారాజు విసిగిపోయి తన సైనికోద్యోగులను పిలిపించి ”మీలో ఎవడో మనగుట్టు యిస్రాయేలు రాజునకు ఎరిగించుచున్నాడు, అతడు ఎవడు?” అని ప్రశ్నించెను.
12. వారిలో ఒకడు ”ప్రభూ! మన వారెవ్వరు ఇక్కడి రహస్యములను పొక్కనీయరు. కాని ప్రవక్త ఎలీషా నీవు పడకగదిలో రహస్యముగా పలికిన మాటలుకూడ గ్రహించి యిస్రాయేలు రాజునకు తెలియజేయుచున్నాడు” అని చెప్పెను.
13. రాజు ”మీరు వెళ్ళి అతని జాడతెలిసి కొనిరండు. నేనతనినిప్టి తెప్పింతును” అనెను. అప్పుడు ఎలీషా దోతానున వసించుచున్నాడని తెలియ వచ్చెను.
14. కనుక రాజు రథములతో, గుఱ్ఱములతో మహా సైన్యమును అచికి పంపెను. ఆ పాలము రాత్రివేళవచ్చి నగరమును ముట్టడించెను.
15. ఎలీషా సేవకుడు వేకువనే నిద్రలేచి ఇంినుండి వెలుపలికి వచ్చిచూడగా రథములతో, గుఱ్ఱములతో సిరియాదండు నగరమును చుట్టుమ్టుియుండెను. అతడు ఎలీషాతో ”అయ్యా! మనకు చావుమూడినది. ఇక ఏమిచేయుదము?” అనెను.
16. కాని ఎలీషా అతనితో ”నీవు భయపడకుము. వారి వైపున పోరాడు వారికంటె మనవైపున పోరాడువారే ఎక్కువమంది యున్నారు” అనెను.
17. అతడు దేవుని ప్రార్థించి ”ప్రభూ! ఇతనికి దృష్టి దయచేయుము” అని మనవి చేసెను. ప్రభువు ఆ సేవకునకు చూపునొసగగా అతడు కొండ అంతయు అగ్నిరథములతోను గుఱ్ఱములతోను నిండియుండుటను చూచెను. అవన్నియు ఎలీషా చుట్టునున్నట్లుగా కూడ కన్పించెను.
18. అంతట సిరియనులు తన సమీపమునకు వచ్చుట చూచి ఎలీషా ”ప్రభూ! వీరికి కనుచూపు పోవునట్లు చేయుము” అని ప్రార్థించెను. అతడు మనవిచేసినట్లే ప్రభువు సిరియా సైనికులను గ్రుడ్డివారిని చేసెను.
19. ఎలీషా ఆ సైనికులచెంతకు వెళ్ళి ”నాయనలార! మీరు త్రోవతప్పితిరి. మీరు ముట్టడింప గోరిన నగరము ఇదికాదు. మీరు పట్టుకోగోరినవాని చెంతకు నేను మిమ్ము తోడ్కొనిపోయెదను, నా వెంట రండు” అనెను. కాని అతడు వారిని సమరియా నగరమునకు నడిపించుకొనిపోయెను.
20. ఆ దండు నగరము ప్రవేశింపగనే ఎలీషా ”ప్రభూ! వీరికి చూపు దయచేయుము” అని ప్రార్థించెను. అతడు కోరినట్లే ప్రభువు సైనికులకు దృష్టి ప్రసాదింపగా వారు తాము సమరియా నగరమున ఉన్నట్లు గుర్తించిరి.
21. యిస్రాయేలురాజు సిరియా సైన్యమును చూచి ”అయ్యా! వీరిని సంహరింపమందువా?” అని అడిగెను.
22. ప్రవక్త ”వలదు వలదు నీ కత్తి, బాణము సహాయమున ఖైదీలను నిర్భందించి వారిని నీవు చంపుదువా? వారు భుజించుటకు రొట్టెలను, త్రాగుటకు నీిని ఒసగుము. అటుపిమ్మట వారు తమ రాజునొద్దకు వెడలిపోవుదురు” అనెను.
23. కనుక యిస్రాయేలు రాజు వారికి గొప్పవిందు చేసెను. వారు అన్న పానీయములు సేవించి తమ రాజునొద్దకు మరలిపోయిరి. అటుతరువాత సిరియా దండులు యిస్రాయేలు దేశము మీద మరల దాడిచేసి ఎరుగవు.
సమరియా ముట్టడి – కరువు
24. అటుపిమ్మట సిరియా రాజు బెన్హెదదు సర్వ సైన్యముతో యిస్రాయేలు మీదికి దండెత్తి వచ్చి సమరియాను ముట్టడించెను.
25. ఈ ముట్టడి ఫలితముగా పట్టణమున ఆహారపదార్థములు కొరత పడి పెద్ద కరువురాగా, ఒక్క గాడిద తల ఎనుబది వెండినాణెములు, అరపావు పావురపురెట్ట2 ఐదు వెండి నాణెములకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.
26. ఒకనాడు యిస్రాయేలురాజు పట్టణ ప్రాకా రముపై తిరుగుచుండగా ఒకానొక స్త్రీ ”ప్రభూ! నన్ను రక్షింపుము” అని కేక వేసెను.
27. రాజు ”అమ్మా! ప్రభువే నిన్ను రక్షించనపుడు నేనెట్లు రక్షింపగలను? నా ఇంట గోధుమలు, ద్రాక్షసారాయము ఉన్నవి కనుకనా? అయినను నీ బెడదయేమి?” అని అడిగెను.
28. ఆ స్త్రీ ”ఇదిగో ఈమె ‘నేడు నీ బిడ్డను తిందము, రేపికి నా బిడ్డను తిందము’ అనెను.
29. అట్లే నా బిడ్డను వండి తింమి. మరునాడు ఆమె బిడ్డను తిందమని అడుగగా తాను వానినెక్కడనో దాచినది” అని చెప్పెను.
30. ఆ మాటలాలించి రాజు విచారముతో బట్టలుచించుకొనెను. అప్పుడు రాజు ప్రాకారముపై నుండెనుకదా! అక్కడి జనులు అతడు వెలుపలి దుస్తుల మాటున గోనె తొడుగుకొని ఉండుటను గమనించిరి.
31. అతడు కోపముతో మండిపడుచు ”నేడు ఎలీషా తల తీయింపనేని ప్రభువు నన్ను శిక్షించుగాక!” అని పలికెను.
ఎలీషా అపాయము వెంటనే తొలగిపోవునని చెప్పుట
32. అప్పుడు ఎలీషా కొందరు పెద్దలతో తన ఇంట కూర్చుండి ఉండెను. రాజు ఎలీషాను ప్టి తెచ్చుటకై దూతనంపెను. కాని ఆ దూత తన ఇల్లు చేరక మునుపే ఎలీషా పెద్దలతో ”చూచితిరా! ఈ నరహంతకుని కుమారుడు నా తల నరకుకొని పోవు టకు దూతనంపుచున్నాడు. ఆ బంటు ఇచికి వచ్చి నపుడు మీరు తలుపుమూయుడు. వానిని లోనికి రానీయకుడు. వాని వెనుకనే వాని యజమానుని అడుగులచప్పుడు వినబడునుగదా!” అని చెప్పుచుండ గనే 33. రాజు వచ్చి ”ప్రభువే మనకు ఈ కీడు వాిల్లునట్లు చేసెను. నేనింకను అతనిని నమ్ముకొని కూర్చుండనేల?” అని పలికెను.