41 1. ఆ యేడు ఏడవనెలలో యిష్మాయేలు పదిమంది అనుచరులను తీసికొని మిస్ఫాయందున్న  గెదల్యాచెంతకు వచ్చెను. యిష్మాయేలు నెతన్యా కుమా రుడు, ఎలీషామా మనుమడు. రాజవంశమునకు చెందినవాడు. రాజు ముఖ్యాధికారులలో ఒకడు. వారెల్లరును భోజనమునకు కూర్చుండిరి.

2. అపుడు యిష్మాయేలును, అతని పదిమంది అనుచరులును కత్తులుదూసి, బబులోనియా రాజు దేశమునకు అధికారినిగా నియమించిన గెదల్యాను ఖడ్గముచే వధించిరి.

3. గెదల్యాతోపాటు మిస్ఫావద్దనున్న యిస్రాయేలీయులను, అచటనున్న బబులోనియా సైనికులనుగూడ యిష్మాయేలు మట్టుపెట్టెను.

 4. గెదల్యా హత్యను గూర్చి ఇంకను ఎవరికిని తెలియదు.

5. ఆ మరుసి దినమున షెకెము, షిలో, సమరియాల నుండి ఎనుబదిమంది వచ్చిరి. వారు గడ్డములు గొరిగించుకొని, బట్టలుచించుకొని, ఒడలు గాయ పరచుకొని ఉండిరి. దేవాలయమున అర్పించుటకు గాను ధాన్యమును, సాంబ్రాణిని కొనిపోవుచుండిరి.

6. యిష్మాయేలు మిస్ఫానుండి ఏడ్చుచు వారికి ఎదురు పోయెను. వారిని కలిసికొని వారితో ”అహీకాము కుమారుడు గెదల్యాను చూచుటకు నగరములోనికి రండు” అనెను.

7. వారు పట్టణములోనికి రాగానే యిస్మాయేలు, అతని అనుచరులు వారిని వధించి బావిలో పడవేసిరి.

8. కాని వారిలో పదిమంది యిష్మాయేలుతో ”అయ్యా! మమ్ము చంపకుము. మేము గోధుమలను, యవలను, ఓలిపుతైలమును, తేనెను పొలమున దాచియుంచితిమి” అని చెప్పిరి. కనుక అతడు వారిని వదిలిపెట్టెను.

9. యిష్మాయేలు శవములను పడవేసినగుంట చాలపెద్దది. యిస్రాయేలు రాజగు బాషా తనపై దండెత్తినపుడు ఆసారాజు భయపడి దానిని త్రవ్వించెను. యిష్మాయేలు దానిని పీనుగులతో నింపెను.

10. తరువాత అతడు మిస్ఫాలో నున్న రాజపుత్రికలను, ప్రజలెల్లరిని బందీలను చేసెను. అంగరక్షకుల అధిపతియైన నెబూజరదాను వారినంద రిని, గెదల్యా అధీనమునుంచియుండెను. యిష్మాయేలు ఆ బందీలను వెంటబెట్టుకొని అమ్మోను దేశము వైపుగా వెళ్ళిపోవుచుండెను.

11. కారెయా కుమారుడైన యోహానాను అతనితోనున్న సైన్యాధిపతులు యిష్మాయేలు చేసిన దుండగములను గూర్చి వినిరి.

12. కనుక వారు తమ అనుచరులతో అతని వెంటబడిరి. గిబ్యోను పెద్ద మడుగునొద్ద అతనిని కలిసికొనిరి.

13. యిష్మాయేలు మిస్ఫానుండి చెరగొనిపోవు జనులు యోహానానును, అతని వెంటనున్న సైన్యాధిపతులను చూచి పరమా నందము చెందిరి.

14. వారు వెనుకకు తిరిగి అతనిచెంతకు పరుగెత్తిరి.

15. కాని యిష్మాయేలును, అతని అనుచరులలో ఎనిమిదిమందియు యోహానాను నుండి తప్పించుకొని అమ్మోను దేశమునకు పారి పోయిరి.

16. అంతట యోహానాను, అతనితోనున్న సేనాధిపతులును గెదల్యా వధానంతరము యిష్మాయేలు మిస్ఫానుండి చెరగొనివచ్చిన వారినెల్లరిని ప్రోగు జేసిరి. వారిలో సైనికులును, స్త్రీలును, పిల్లలును, నపుంసకులును ఉండిరి. వారినందరిని గిబ్యోనునుండి తిరిగి తెచ్చిరి.

17-18. బబులోనియా రాజు దేశము నకు అధికారినిగా నియమించిన గెదల్యాను, యిష్మాయేలు వధించెను. కనుక వారు బబులోనీయులకు జడిసిరి. కావున వారు బబులోనీయులనుండి తప్పించుకొను టకుగాను ఐగుప్తునకు పయనము క్టిరి. దారిలో బేత్లెహేము చెంతనున్న కింహామునొద్ద విడిదిచేసిరి.