దీనా మానభంగము
1. లేయా యాకోబుల కూతురు దీనా. ఆమె ఒకనాడు ఆ దేశస్త్రీలను చూచుటకు వెళ్ళెను.
2. హివ్వీయుడును ఆ దేశ యువరాజు అయిన హామోరు కుమారుడగు షెకెము దీనాను చూచెను. అతడు ఆమెను చెరప్టి మానభంగము చేసెను.
3. కాని అతడు యాకోబు కూతురు దీనాను మనసార ప్రేమించెను. ఆమెకు ఓదార్పుమాటలు చెప్పెను.
4. కావున షెకెము ఆ పిల్లను నాకు పెండ్లిచేయుము అని తండ్రి హామోరును అడిగెను.
5. యాకోబు తనకూతురు దీనాను షెకెము చెరిచెననివినెను. అపుడతని కొడుకులందరు పొలములో మందలదగ్గర ఉండిరి. వారు ఇంికి వచ్చువరకు అతడు నోరెత్తలేదు.
6. ఇంతలో షెకెము తండ్రి హామోరు యాకోబుతో మ్లాడవచ్చెను.
7. అంతలో యాకోబు కుమారులు పొలము నుండి వచ్చిరి. వారికి జరిగినదంతయు తెలిసెను. షెకెము దీనాతో శయనించి యిస్రాయేలు ప్రజలను అవమానపరిచెనని యాకోబు కుమారులు ఎంతో నొచ్చుకొనిరి. అగ్గిమీద గుగ్గిలము వేసినట్లు భగ్గున మండిపడిరి. షెకెము చేసినపని చేయగూడనిదిగదా!
8. హామోరు యాకోబుతో అతని కుమారులతో ”నా కుమారుడు షెకెము మీ కుమార్తెను ప్రేమించెను. ఆమెనతనికిచ్చి పెండ్లిచేయుడని మిమ్ము వేడుకొను చున్నాను.
9. మనము వియ్యమొంది పొత్తు కలియు దము. మీరు మీ కుమార్తెలను మా వారికిచ్చి పెండ్లి చేయుడు. అట్లే మేమును మా కుమార్తెలను మీ వారి కిచ్చి పెండ్లిచేయుదుము.
10. ఈ దేశమున మీకు ఎదురులేదు. ఇక్కడ మాతోఉండుడు. ఈ నేలపై స్వేచ్ఛగాతిరుగుడు. వ్యాపారముచేసుకొని పొలము పుట్ర గడింపుడు” అనెను.
11. షెకెము వారితో ”నా మనవి ఆలింపుడు. మీరేదికోరిన అది చేయుదును.
12. మీరు పెండ్లికానుకల నెన్నియైన కోరుడు. మీరు కోరినవన్ని ఇత్తును ఆ బాలికను నా భార్యగనిండు” అనెను.
13. షెకెము తమ సోదరి దీనాను చెరుచుటచే యాకోబు కుమారులొక పన్నాగముపన్నిరి. వారతనికి, అతని తండ్రి హామోరునకు జవాబు చెప్పుచు, 14. ”మేము ఈ పని చేయజాలము. సున్నతి చేసికొనని వానికి మా సోదరినిచ్చి పెండ్లిచేయుట మాకు అవ మానకరము.
15. మేము ఒకషరతు మీద ఒప్పు కొందుము. మావలె మీలో ప్రతిపురుషుడు సున్నతి చేసికొనిన, 16. మా కుమార్తెలను మీకిత్తుము, మీ పిల్లలను మేము పెండ్లిచేసికొందుము. అప్పుడు మీమధ్య మేము నివసింతుము. మనమందరము ఏకజాతి కాగలము.
17. మీరు మామాట పెడ చెవినిబ్టెి సున్నతి చేసికొననియెడల మేము మా సోదరిని తీసికొని వెళ్ళిపోయెదము” అనిరి.
18. వారిమాటలు హామోరునకు, అతని కుమారుడు షెకెమునకు నచ్చెను.
19. తండ్రి ఇంిలో అందరికంటె ప్రముఖుడయిన ఆ పడుచువాడు యాకోబు కుమార్తెపై మోహము కలిగియున్నందున వెంటనే యాకోబు కుమారులు చెప్పినట్టు చేసెను.
20. హామోరు, షెకెము నగరద్వారము దగ్గరకు తిరిగివెళ్ళి తమవారితో 21. ”ఈ ప్రజలు మన మిత్రులు. వారిని ఈ దేశములో స్థిరపడనిండు. స్వేచ్ఛగా తిరుగనిండు. ఈ నేలమీద వారికిని కావలసి నంత చోటున్నదిగదా! మనము వారి పిల్లలను పెండ్లి చేసికొందము. మనపిల్లలను వారికిచ్చి పెండ్లి చేయుదము.
22. ఇదిగో! ఈ ఒక్క షరతు మీద మాత్రమే వారు మనతో కలిసిమెలిసి బ్రతుకుచు ఏకజాతి అగుటకు ఒప్పుకొందురు. వారివలె మనలో ప్రతి పురుషుడును సున్నతి చేసికొనవలయును.
23. ఇట్లయిన వారిమందలు, పశువులు, ఆస్తిపాస్తులన్ని మనకే దక్కునుగదా! మనము వారిమాట ఒప్పుకొన్న చాలును. వారు ఏ ఆటంకము లేకుండ మనతో కలిసి బ్రతుకుదురు” అనిరి.
24. నగరద్వారము వద్దకు వెళ్ళిన వారందరు హామోరు, షెకెము చెప్పిన మాటలకు ఒప్పుకొనిరి. ఆ పురుషులందరును సున్నతి చేయించుకొనిరి.
ప్రతీకారము
25. మూడవనాడు సున్నతివలన పురప్రజ లింకను మహాబాధననుభవించుచుండ, యాకోబు కుమారులు, దీనా సోదరులైన షిమ్యోను, లేవి అనువారు కత్తులుచేప్టి తమగుట్టు బయికి పొక్కనీయకుండ నగరమున ప్రవేశించి, ప్రతి పురుషుని మట్టుప్టిెరి.
26. వారు హామోరును, షెకెమును కండతుండెములు చేసిరి. షెకెము ఇంినుండి దీనాను విడిపించుకొని వెళ్ళిపోయిరి.
27. యాకోబు కుమారులలో మిగిలిన వారుగూడ సోదరికి జరిగిన పరాభవమునకు ప్రతీకారము చేయుటకై నగరమును దోచుకొనిరి.
28. పొలములో ఉన్న గొఱ్ఱెలను, పశువులను, గాడిదలను పట్టణములోనున్న సర్వస్వ మును వశముచేసికొనిరి.
29. ఆ దేశస్థుల సంపద నంతా దోచుకొనిరి. వారి పిల్లలను స్త్రీలను చెరప్టిరి. ఇండ్లలో ఉన్నదంతయు దోచుకొనిరి.
30. యాకోబు షిమ్యోనుతో, లేవితో ”మీరు నా మెడకు ఉరిత్రాడు తెచ్చితిరి. ఈ దేశీయులగు కనానీయులు పెరిస్సీయులు నాపై పగపూనునట్టు చేసితిరి. నాకున్న బలగము తక్కువ. వారు మందిని కూడగట్టుకొని నా మీదపడిన, నేనును నా ఇంి వారును నాశనమగుదుముగదా!” అనెను.
31. దానికి వారు ”వాడు మాసోదరిని వేశ్యగా భావించి ప్రవర్తించుట తగునా?” అనిరి.