దావీదు యుద్ధములు

18  1. అటు తరువాత దావీదు ఫిలిస్తీయులతో పోరాడి వారిని ఓడించెను. గాతు నగరమును, దాని పరిసరగ్రామములను వారినుండి స్వాధీనము చేసి కొనెను.

2. అతడు మోవాబీయులనుగూడ జయించెను. వారతనికి దాసులై కప్పములు క్టిరి.

3. సోబా రాజు హదదెసెరు యూఫ్రీసు నది కెగువనున్న మండలమును ఆక్రమించుకొనబోవు చుండగా దావీదు అతనిని హమాతు వద్ద ఎదిరించి ఓడించెను.

4. అతని రథములను వేయిిింని, ఆశ్వి కులను ఏడువేలమందిని, కాలిబంటులను ఇరువది వేలమందిని పట్టుకొనెను. అతడు నూరురథములకు చాలినన్ని అశ్వములను మాత్రము ఉంచుకొని మిగిలిన వానికన్నికి గుదికాలినరములు తెగగ్టొించెను.

5. సోబారాజు అయిన హదదెసెరునకు సహాయము చేయుటకై దమస్కునకు చెందిన సిరియనులు రాగా వారిలో ఇరువది రెండువేలమందిని దావీదు మట్టు పెట్టెను.

6. అతడు అరామీయుల మీద అధికారులను నియమింపగా వారతనికి లొంగి కప్పముక్టిరి. ప్రతి దండయాత్రయందును ప్రభువు దావీదునకు విజయము ప్రసాదించెను.

7. అతడు హదదెసెరు బంటులనుండి బంగారుడాళ్ళను గైకొని వాిని యెరూషలేమునకు కొనివచ్చెను.

8. ఆ రాజునకు చెందిన తిబ్బాతు, కూను నగరములనుండి చాల కంచును గూడ కొని వచ్చెను. సొలోమోను నీిసంద్రమను త్టొిని, స్తంభములు, పాత్రములను ఆ కంచుతో చేయించెను.

9. హమాతురాజు తోవూ, దావీదు హదదెసెరు సైన్యమునంతిని జయించెనని వినెను. సోబా రాజైన హదదెసెరు అతనికి శత్రువు.

10. కనుక ఆ రాజు దావీదును అభినందించుటకు తన కుమారుడు హదోరమును పంపెను.  హదోరము  దావీదునకు కంచు, వెండి, బంగారములతో చేయబడిన బహుమ తులు కొనివచ్చెను.

11. దావీదు ఆ వస్తువులనెల్ల దేవాలయమునకు అర్పించెను. అతడు తాను జయించిన ఎదోము, మోవాబు, అమ్మోను, ఫిలిస్తి, అమాలెకు దేశములనుండి కొనివచ్చిన వెండి, బంగారములను కూడ అట్లే దేవాలయమునకు అర్పించెను.

12. సెరూయా కుమారుడైన అబీషయి ఉప్పు లోయలో ఎదోమీయులను జయించి, వారి సైనికులను పదునెనిమది వేలమందిని మట్టుపెట్టెను. 

13. అతడు ఎదోమీయుల మీద కావలిదండును నియ మింపగా వారు దావీదునకు లొంగిపోయిరి. ప్రతి దండయాత్రయందును ప్రభువు దావీదునకు విజయము ప్రసాదించెను.

దావీదు సైన్యాధిపతుల వీరకార్యములు

14. దావీదు యిస్రాయేలీయులనందరిని న్యాయ ముతోను, ధర్మముతోను పరిపాలించెను. సెరూయా పుత్రుడైన యోవాబు సైన్యాధిపతి.

15. అహీలూదు కుమారుడైన యెహోషాఫాత్తు రాజకార్యముల దస్తావేజులు భద్రపరచువాడు.

16. అహీటూబు కుమారుడైన సాదోకు, అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు యాజకులు. షవషా కార్యదర్శి.

17. యెహోయాదా కుమారుడైన బెనాయా, దావీదు అంగరక్షకులైన కెరెతీయులకును, పెలెతీయులకును అధిపతి. దావీదుయొక్క కుమారులు అతని కొలువులో ప్రముఖ స్థానములను ఆక్రమించుకొనిరి.