ఉపోద్ఘాతము:

పేరు: ఈ గ్రంథము పేరును హీబ్రూ భాషలో ‘కొహెలెత్‌’ (గళినీలిజిలిశినీ) అందురు. ఇది వ్యక్తి పేరు కాదు, ఇది ‘ఉపదేశకుడు’ అను అర్థమును స్పురించును. ఉపదేశాన్ని బోధించే ఉపదేశకునిగా సూచించును. (1:1,2,12,7:27,12:8,9). ప్రధాన ఉపదేశకుడు సొలోమోనురాజు.  సెప్తువజింత్‌ ఈ పేరును జూబీబీజిలిరీరిబిరీశిలిరీ గా సూచిస్తుంది. దాని అర్ధము కూడా ఉపదేశకుడే.

కాలము: క్రీ.పూ. 3వ శతాబ్ధము. ఇది క్రీ.పూ. 150 నుండి వెలుగుచూసినది.

రచయిత:  సొలోమోనురాజునకు ఆపాదించబడినది. (1:1,12). ఒక అజ్ఞాత యూద జ్ఞానియని మరికొందరి అభిప్రాయము (1:16).

చారిత్రక నేపథ్యము: యూదుల ఆరాధనార్చన కార్యక్రమములలోని ఐదు పవిత్ర రచన గ్రంథములలో ఈ గ్రంథము మూడవ గ్రంథముగా పేరు పొందినది. యూదులు పండుగల సమయాల్లో ఈ గ్రంథములోని పఠనాలను విరివిగా చదివేవారు. ముఖ్యంగా ”మందసపెట్టె” పండుగలలో ఎక్కువగా పఠించేవారు. గ్రంథకర్త దేవునికి దూరంగా జీవించినవాని వ్యక్తిగత జీవితముపై సమీక్ష చేస్తాడు. దానికి ప్రధాన ఆధారము ”వ్యర్థము, ఆడంబరము” అనే పదముల వినియోగము. ఈ గ్రంథము ప్రాముఖ్యతను నాి మత, సాంస్క ృతిక నేపథ్యమున చూడాలి. ఐగుప్తు దేశాన్ని  పాలిస్తున్న గ్రీకుపాలకుల వలన గ్రీకు సంస్కృతి యూదా సంస్కృతికి గొడ్డలిపెట్టుగా మారుతున్న తరుణములో ఈ గ్రంథరచయిత యిస్రాయేలీయులను తమ పారంపర్య యూదా సంస్క ృతిని పరిరక్షించుకొని, తమదైన గుర్తింపునకై పాటుపడాలని బోధించాడు.

ముఖ్య అంశములు: ప్రతికూల పరిస్థితుల్లో దేవునిపట్ల విశ్వాసంతో ఉండాలని బోధించడము ఈ గ్రంథములో ప్రధానాంశము. దేవునికి దూరం చేసే ప్రతి పని కూడ వ్యర్థమని, నిరూపయోగమని సూచిస్తుంది. సత్యాణ్వేషణలో దేవుని వాక్కుకు స్థానము లేకుంటే  అన్ని ప్రయత్నాలు నిష్ప్రయోజనము. జీవితము అంటే ఏమిో తెలుసుకోవడానికి చేసే అన్వేషణే ఈ గ్రంథము ప్రాతిపదిక. మానవుని అనుభవములో జీవితము పరస్పర వైరుధ్యాలతో నిండినదనియు, అగోచరమైనదనియు తేల్చి చెప్పును. మానవ దైనందిన జీవితములో మంచిచెడుల ఫలితము గురించిన సంఘర్షణను ఈ గ్రంథములో చూడగలరు. ఈ గ్రంథము ‘మానవుని శ్రమంతా వృథా’ అని నొక్కివక్కాణించినను, మానవుణ్ణి నిరాశాజీవిగానే వదలిపెట్టదు. కష్టార్జితాన్ని అనుభవించడము దేవుని అనుగ్రహము (5:19), బుద్ధిహీనతకంటే జ్ఞానము మేలు (2:13-16), దేవుని తీర్పు అనివార్యము (3:17; 12:14), దానిపట్ల శ్రద్ధవహించడము  (12:14; 3:17) అను అంశములు ఈ గ్రంథములో చోటుచేసుకొనును.

క్రీస్తుకు అన్వయము: ఈ గ్రంథములోని ఉపదేశకుని జ్ఞాననిధి  క్రీస్తు ఉపదేశానికి ప్రతిబింబము. క్రీస్తు దేవుని సంపూర్ణ జ్ఞానము (1 కొరి. 1:24-30). దేవునితో సంబంధం లేని జీవితం శూన్యము. జ్ఞానమునకును, విశ్వకాలగతులకు పునాది క్రీస్తే (3:11). మానవుని సంపూర్ణ ఉన్నతి క్రీస్తుకాపరియందే దొరుకును (12:11). క్రీస్తు స్వర్గద్వారము, నిత్యజీవము (యోహాను 10:9-10).

Previous                                                                                                                                                                                              Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము