తూర్పు ద్వారము

44 1. అతడు నన్ను పవిత్రస్థలమునకు తూర్పున నున్న లోపలి ఆవరణపు వెలుపలి గుమ్మమునొద్దకు మరల కొనివచ్చెను. అది మూసివేయబడియుండెను.

2. ప్రభువు నాతో ”ఈ ద్వారము మూసివేయబడి యుండునే గాని మరల తెరువబడదు. దీనిగుండ ఎవ రును పోజాలరు. యిస్రాయేలు దేవుడను ప్రభుడనైన నేను దీనిగుండ ప్రవేశించితిని గనుక ఇది ఇకమీదట సదా మూయబడియుండును.

3. అయినను పరిపాల నముచేయు రాజు తన ఆధిపత్యమునుబ్టి దీనియందు కూర్చుని నా సన్నిధిలో అతని ఆహారమును భుజింప వచ్చును. అతడు వసారాగుండ ప్రవేశించి అదేమార్గ మున బయికి వెళ్ళివలయును” అని చెప్పెను.

దేవాలయ ప్రవేశమును గూర్చిన నియమము

4. తరువాత అతడు నన్ను ఉత్తరద్వారము గుండ దేవాలయము ముందికి కొనిపోయెను. నేనటు పార చూడగా మందిరము ప్రభువు తేజస్సుతో నిండి యుండెను. నేను నేలపై బోరగిలబడితిని.

5. ప్రభువు నాతో ఇట్లనెను: ”నరపుత్రుడా! నీవు చూచుదానిని, వినుదానిని జాగ్రత్తగా గమనింపుము. నేను నీకు దేవాలయ నియమములను ఎరిగింతును. ఎవరు దేవళములోనికి ప్రవేశించి బయికి వెళ్ళిపోవచ్చునో, ఎవరట్లు చేయరాదో శ్రద్ధగా గ్రహింపుము.

6. ఆ తిరుగుబాటుదారులైన యిస్రాయేలు ప్రజలతో యావే ప్రభుడనైన నేను వారి హేయమైన కార్యములను సహింపనని చెప్పుము.

7. వారు బలి పశువులనెత్తుిని, కొవ్వును నాకు అర్పించునపుడు శరీరమున సున్నతిపొందని పరజాతివారిని నా దేవళములోనికి కొనివచ్చి దానిని అపవిత్రము చేసిరి. నా ప్రజలు హేయమైన కార్యములతో నా నిబంధన మును ఉల్లంఘించిరి.

8. వారు స్వయముగా దేవళ మున పరిచర్య చేయుటకు మారుగా అన్యజాతి వారికి ఆ పనిని అప్పగించిరి.

9. హృదయసున్నతియు మరియు శరీరసున్నతియు నొందని అన్యజాతివాడు ఎవడును, అతడు యిస్రాయే లీయుల నడుమ వసించుచున్నను, నా దేవాలయమును ప్రవేశింపరాదని ప్రభుడనైన నేను ఆజ్ఞాపించుచున్నాను.

లేవీయులు యాజకులు కారాదు

10. ఇతర యిస్రాయేలీయులతోపాటు నన్ను విడనాడి విగ్రహములను సేవించిన లేవీయులను నేను శిక్షింతును. 11. అయితే వారు దేవళమున ఊడిగము చేయుటకును, ద్వారపాలకులుగా ఉండుటకును, నా మందిరమున సేవచేయుటకును జనుల సమక్షమున నియమింపబడినవారు. ప్రజలు బలులను, దహన బలులను అర్పించుటకు కొనివచ్చిన పశువులను ప్రజలతరుపున వారు వధింపవచ్చును. ప్రజలకు సేవలు చేయవచ్చును. 12. కాని ఆ లేవీయులు యిస్రాయేలు ప్రజలు విగ్రహములను కొలిచినపుడు వారికి అర్చకులుగా పనిచేసి వారిని పాపమునకు ప్రేరేపించిరి. కనుక వారిని దండించి తీరుదునని యావేప్రభుడనైన నేను శపథము చేయుచున్నాను. 13. వారు నా సన్నిధికి వచ్చి నాకు యాజకులుగా పని చేయరాదు. నా పవిత్ర వస్తువులనుగాని, పరమపవిత్ర వస్తువులనుగాని ముట్టరాదు. వారు చేసిన హేయమైన కార్యములకు ఇది శిక్ష.

14. దేవళమున జరుగు పనులన్నింని నిర్వహించుచు దానిని కాపాడు వారినిగ నేను వారిని నియమించుచున్నాను.

యాజకులు

15. ఇతర యిస్రాయేలీయులు నన్ను విడనాడి నప్పుడు కూడ లేవీతెగకు చెందిన సాదోకు వంశజు లగు యాజకులు నా దేవళమున నన్ను భక్తితో కొలిచిరి. కావున ఇప్పుడు వారే నా సన్నిధిలోనికి వచ్చి నన్ను సేవింతురు. నాకు బలిపశువుల క్రొవ్వును, నెత్తుిని అర్పింతురు.

16. వారు మాత్రమే నా దేవళమున ప్రవేశించి నా బలిపీఠమును సమీపించి, నా ఆరాధనమును నిర్వహింపవచ్చును.

17. వారు దేవళమున అందలి లోపలి ఆవరణ ద్వారమును ప్రవేశింపగానే నారబట్ట ధరింపవలెను. లోపలి ఆవర ణమున గాని, దేవాలయమునగాని పరిచర్య చేయు నపుడు వారు ఉన్నిబట్టలను తాల్పరాదు.

18. అవిసె నార పాగాలను ధరించి, నడుములకు జనుప నార వస్త్రములను కట్టుకొనవలయును. చెమటను ప్టుించు ఏ వస్త్రములను వారు ధరింపరాదు.

19. వారు జనులు ప్రోగగు వెలుపలి ఆవరణములోనికి పోవుటకు ముందే నివేదితవస్త్రములను తీయకపోవుటచేత ప్రజలకు శాపము తెప్పింపకుండునట్లు, తాము దేవాలయమున పరిచర్య చేయునపుడు తాల్చిన ఆ నివేదితవస్త్రములను తొలగించి వానిని పవిత్రమైన గదులలో ప్టిె, సామాన్యదుస్తులను ధరించి బయికి వెళ్ళవలెను.

20. యాజకులు తల బోడి చేయించుకోరాదు. జుట్టు పొడవుగా పెంచుకోరాదు. దానిని తగుమాత్ర ముగా ఉంచుకోవలెను.

21. వారు లోపలి ఆవరణము లోనికి పోవునపుడు మద్యమును సేవింపరాదు.

22. వారు వితంతువునుగాని, విడాకులు పొందిన ఉవిదను గాని పెండ్లియాడరాదు. యిస్రాయేలు కన్యలను, యాజకుల వితంతువులను మాత్రమే పరిణయమాడ వచ్చును.

23. ఏది నివేదితమైనదో ఏది నివేదితమైనది కాదో, ఏది పవిత్రమైనదో ఏది పవిత్రముకానిదో యాజకులు నా ప్రజలకు బోధింపవలెను.

24. ప్రజలకు తగాదాలు వచ్చినపుడు వారు నా నియమము లను అనుసరించి తీర్పుచెప్పవలెను. నా నియమముల ప్రకారము ఉత్సవములు జరుపవలెను. విశ్రాంతి దినమును పవిత్రముగా గడపవలెను.

25. యాజకులు శవములను తాకి అశుద్ధులు కారాదు. తల్లిదండ్రుల, తనయుల, సోదరుల, అవి వాహితులైన సోదరీల శవములను మాత్రము తాక వచ్చును.

26. వారు మైలనుండి శుద్ధినిపొందుటకు ఏడునాళ్ళు ఆగవలెను.

27. అటుపిమ్మట దేవాలయమందలి లోపి ఆవరణములోనికి పోయి పాపపరిహారబలిని అర్పింప వలెను. అటుతరువాత వారు  దేవాలయమున ఆరాధ నమును నిర్వహింపవచ్చును. ఇదియే యావేప్రభుడనైన నా వాక్కు.

28. ప్రభుడనైన నేనే యాజకులకు వారసత్వము. యాజకుల వారసత్వము ఇదియే. యిస్రాయేలీయులలో వారికి ఎంతమాత్రమును ఆస్తిని ఇవ్వరాదు. నేనే వారికి ఆస్తి.

29. వారు ధాన్యబలులను, పాపపరిహార బలిమాంసమును, ప్రాయశ్చిత్తబలి మాంసములను భుజింతురు. యిస్రాయేలీయులు నా కొరకు నివేదించిన వస్తువులెల్ల వారివే అగును.

30. ఆ ప్రజలు ప్రథమఫలములుగా నాకు అర్పించు వానిలో శ్రేష్ఠమైనవియు, వారు అర్పించు ఇతర పదార్థములును యాజకులవే అగును. ప్రజలు రొట్టెలు కాల్చుకొను నపుడెల్ల మొదిదానిని యాజకులకు అర్పింపవలెను. అప్పుడు ఆ ప్రజల కుటుంబములకు నా దీవెనలు లభించును.

31. యాజకులు పకక్షులలోనేమి, పశువుల లోనేమి వానియంతట అవియే చనిపోయిన వానిని లేక ఇతర జంతువులు చంపినవానిని భుజింపరాదు.”