ఉపసంహారము
26 1. మీరు విగ్రహములను చేయకుడు. చెక్కిన శిలలనుగాని ఆరాధనస్తంభములనుగాని నెలకొల్పకుడు. వానికి పూజలు చేయకుడు. నేను మీ ప్రభుడనైన దేవుడను. 2. మీరు నా విశ్రాంతిదినములను పాింపుడు. నా మందిరమును గౌరవింపుడు. నేను ప్రభుడను.
విధేయులకు దీవెనలు
3-4. మీరు నా ఆజ్ఞలను పాించి నా చట్టము లకు విధేయులగుదురేని, నేను మీకు సకాలమున వానలు కురియింతును. ఫలితముగా మీ పొలములు చక్కగాపండును, మీ చెట్లుకాయును.
5. మీ భూములు ఎంతసమృద్ధిగా ఫలించుననగా, ద్రాక్షపండ్లు కోతకువచ్చు కాలమువరకు మీరు కళ్ళములలో ధాన్యము త్రొక్కించుచునేయుందురు. విత్తనములు వెదజల్లుకాలము వచ్చువరకు ద్రాక్ష పండ్లను కోయు చునేయుందురు. మీరు బాగుగా భుజించి మీ దేశమున చీకుచింతలేకుండ జీవింతురు.
6. నేను మీదేశమున శాంతినెలకొల్పగా మీరు భయమనునది యెరుగక సుఖముగా నిద్రింతురు. నేను వన్యమృగముల నెల్ల రూపుమాపుదును. ఇక మీ భూమిమీద యుద్ధములు జరుగవు.
7. మీరు శత్రువులను వెన్నాడగా వారు మీ కత్తికి బలియగుదురు.
8. మీవారు ఐదుగురు వంద మంది శత్రువులను, వందమంది పదివేలమంది శత్రు వులను తరుముదురు. మీ పగవారు మీ కండ్లముందు కత్తిదెబ్బకు కూలిపోవుదురు.
9. నేను మిమ్ము దీవింతును. మీకు సంతానము నొసగి మిమ్ము వృద్ధిచేయుదును. నేను మీతో చేసికొనిన నిబంధనము కొనసాగింతును.
10. మీరు పాతపంటను శుష్టుగా భుజింతురు. మీరు క్రొత్తపంట చేతికి వచ్చినను పాతపంట మీకు మిగిలియుండును. మీరు కొత్తపంటకు వలయు స్థలమును కలిగించుటకు గాను పాతపంటను పారవేయవలసియుండును.
11. నేను మీ నడుమవసింతును. మిమ్ము చేయి విడువను.
12. మీకు బాసటయైయుందును. నేను మీకు దేవుడను కాగా మీరు నా ప్రజలగుదురు.
13. మీ దేవుడనైన నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి మీ బానిసత్వమును తొలగించితిని. మిమ్ములను మీ కాడిబంధములను త్రెంచి, మిమ్ములను విముక్తులను చేసి, మీరు మరల తలఎత్తుకొని తిరుగునట్లు చేసితిని.
అవిధేయులకు శాపములు
14-16. కాని మీరు నామాటలను పెడచెవినిబ్టెి నా ఆజ్ఞలు పాింపరేని, నా విధులను, చట్టములను అనాదరముచేసి నా నిబంధనమును మీరుదురేని, నేను మిమ్మును తప్పక శిక్షింతును. జ్వరములతో, కుదరని రోగములతో మిమ్ము పీడింతును. వానివలన మీరు గ్రుడ్డివారగుదురు. నవిసిపోవుదురు. మీరు పొలమున విత్తనము వేయుదురుగాని శత్రువులు వచ్చి ఆ పంటను కోసికొని పోవుదురు.
17. నేను మిమ్ము అణగద్రొక్కగా శత్రువులు వచ్చి మిమ్ము అవలీలగా జయింతురు. మీ పగవారు మిమ్ము ఏలుదురు. ఎవ రును మిమ్ము వెన్నాడకున్నను, మీరు పిరికితనముతో పారిపోయెదరు.
18. ఇంత జరిగిన పిదపగూడ మీరు నామాట వినరేని, నేను మీ దోషములకు గాను మిమ్ము ఏడంతలు మరల శిక్షింతును.
19. మీ పొగరు అణిగింతును. ఆకాశము ఇనుమువలెను, భూమి ఇత్తడివలెను గ్టిపడునట్లు చేసెదను.
20. మీరు ప్రేగులు త్రెంచుకొన్నను మీ పొలముపండదు, మీ చెట్లుకాయవు.
21. ఇంత జరిగినను మీరు నామాట వినరేని నేను మీ దోషములకుగాను మిమ్మింకను ఏడురెట్లు మరల శిక్షింతును.
22. వన్యమృగములను మీ మీదికి ఉసికొల్పుదును. అవి మీసంతానమును, మీ పశువులను ఎత్తుకొని పోవును. మీసంఖ్య పూర్తిగా తగ్గిపోగా, మీ త్రోవలవెంట నడచుటకు జనమే ఉండరు.
23-24. ఇంత జరిగినను మీరు బుద్ధి తెచ్చు కొనక నన్నెదిరింతురేని, నేను మిమ్మెదిరించి మీ అపరాధములకు మిమ్ము ఏడురెట్లు శిక్షింతును.
25. నేను మీ నేలమీద యుద్ధములు జరిపించి నా నిబంధ నము మీరినందులకుగాను మిమ్ము దండింతును. మీరు పారిపోయి మీ నగరములలో దాగుకొనినచో, నేను మీ మీదికి అంటురోగములు పంపింతును. మిమ్ము శత్రువుల వశముగావింతును.
26. నేను మీ నోికూడు పడగొట్టుదును. కాగా పది కుటుంబముల స్త్రీలు రొట్టెలు కాల్చుకొనుటకు ఒక్క పొయ్యి సరి పోవును. వారు ఆ రొట్టెను మీకు తూచి ఇచ్చెదరు. మీరు దానిని తిందురుగాని తృప్తిచెందరు.
27-28. ఇంత జరిగినను మీరు నామాట వినక నాకెదురుతిరుగుదురేని, నేనును మీకు ఎదురు తిరిగి కోపముతో మిమ్ము ఏడంతలు అదనముగా శిక్షింతును.
29. మీరు ఆకలిబాధతో మీ కుమారుల, కుమార్తెల మాంసమునే తిందురు.
30. నేను పర్వతములపై మీరు నిర్మించిన మందిరములను, మీరు సాంబ్రాణిపొగ వేసిన పీఠములను కూలద్రోయు దును. మీ శవములను ఆ కూలిపోయిన విగ్రహము లపై పడవేయుదును. నేను మిమ్ము అసహ్యించు కొందును.
31. మీ పట్టణములను దేవాలయములను నేలమట్టము చేయుదును. మీ బలుల సువాసనను ఆఘ్రాణింపను.
32. మీ దేశమును ఎంతగా నాశనము చేయుదుననగా, మీ భూమిని ఆక్రమించుకొనిన శత్రువులుకూడ ఆ వినాశమును చూచి ఆశ్చర్యపడు దురు.
33. మీరు అన్యజాతుల మధ్య చెల్లా చెదరగు దురు. మీ దేశము బీడువడును. మీ నగరములు పాడువడును.
34. అప్పుడు మీ దేశము పాడైయున్న దినములలో నిజముగనే దానికి విశ్రాంతిదినములు లభించును. మీరు అచట మీ శత్రువుల దేశములో చిక్కి మూల్గుచుండగా ఇచట మీ దేశము పూర్ణ విశ్రాంతిని అనుభవించును.
35. అటుల పాడు పడి పోయిన మీ దేశము, మీరట వసించినపుడు విశ్రాంతి దినములయందు పొందని విశ్రాంతిని పొందును.
36. ప్రవాసముననున్నవారిని నేను భయముతో కంపించిపోవునట్లు చేయుదును. మీరు గాలికి రాలి పోవు ఆకుసవ్వడికికూడ, యుద్ధమున శత్రువులను చూచి పారిపోవువారివలె పరుగుతీయుదురు. శత్రు వులు మీదపడకున్నను మీరు కూలిపోవుదురు.
37. పగవారు వెన్నాడకున్నను మీరు ఒకరినొకరు తట్టుకొని పడిపోవుదురు. అసలు మీరు శత్రువులను ఎదిరింప జాలరు.
38. మీరు ఆ ప్రవాసముననే చత్తురు. శత్రువులదేశము మిమ్మును మ్రింగివేయును.
39. అచట చావక మిగిలియున్నకొద్దిమందిగూడ తమ యొక్కయు, తమ పూర్వులయొక్కయు పాపములకు గాను క్షీణించిపోవుదురు.
40. అప్పుడు వారు తామును, తమ పూర్వులును నాకు ఎదురుతిరిగితిమనియు, నామీద తిరుగుబాటుసల్పి తప్పుచేసితిమనియు ఒప్పు కొనినయెడల 41. నాకు కోపము రప్పించి నా వలన ప్రవాసము పాలైతిమని చెప్పుకొనినయెడల, సున్నతి పొందని వారి హృదయములులొంగి, వారి దోషము లను సరిచేసుకొనినయెడల 42. అప్పుడు యాకోబు, ఈసాకు, అబ్రహాములతో పూర్వము నేను చేసికొనిన నిబంధనమును జ్ఞప్తికితెచ్చుకొని, ఆ దేశమును జ్ఞాపకము చేసుకొందును.
43. కాని మొదట ఆ జనము నా భూమిమీదినుండి వెళ్ళిపోవలయును. వారిచే విడవబడినపుడే ఆ నేల పూర్ణవిశ్రాంతిని అను భవింపవలయును. నా ఆజ్ఞలను, చట్టములను అస హ్యించుకొని మీరినందులకుగాను ఆ జనులు శిక్షను అనుభవింపవలయును.
44. కాని వారు ప్రవాసముననున్నపుడు నేను వారిని పూర్తిగాపరిత్యజింపను, ద్వేషింపను. వారిని సర్వనాశనము చేయను. వారితో చేసికొనిన నిబంధన మును విడనాడను. నేను వారి ప్రభుడనైన దేవుడను. 45. నేను వారి పూర్వులతో చేసికొనిన నిబంధన మును గుర్తుకు తెచ్చుకొందును. ఎల్లజాతులు చూచు చుండగా నేను ఆ ప్రజను ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి వారికి దేవుడనైతిని. నేను ప్రభుడను.”
46. ప్రభువు సీనాయి కొండమీద మోషే ద్వారా యిస్రాయేలీయులకు ప్రసాదించిన ఆజ్ఞలు, చట్టములు ఇవియే.