తొలికాన్పు పిల్లలు

1-2. ప్రభువు మోషేతో ”యిస్రాయేలీయు లలో ప్టుిన తొలిచూలు సంతతినెల్ల నాకు అంకితము చేయుము. మానవసంతతియైననేమి, పశుసంతాన మైననేమి మొదట ప్టుినది నాదే అగును” అనెను.

పొంగని రొట్టెల పండుగ

3. మోషే యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పెను: ”మీరు దాస్యనిలయమైన ఐగుప్తుదేశమునుండి తరలి వచ్చిన ఈ దినమును గుర్తుపెట్టుకొనుడు. యావే తన బాహుబలముతో మిమ్ము ఇచినుండి నడిపించుకొని వచ్చెను. మీరు పొంగినరొట్టెలు తినరాదు.

4. అబీబు1 మాసములో ఈ రోజుననే మీరు ఐగుప్తుదేశమును వీడితిరిగదా!

5. మీ పితరులకు మాటయిచ్చినట్లుగా యావేదేవుడు కనానీయులు, హిత్తీయులు, అమోరీ యులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించు దేశమునకు, పాలుతేనెలుజాలువారు దేశమునకు మిమ్ము కొనివచ్చినపుడు ఈ నెలలోనే మీరు ఈ ఆచారమును పాింపవలయును.

6. ఏడురోజుల పాటు మీరు పొంగనిరొట్టెలు తినవలయును. ఏడవ నాడు యావే పేరిట పండుగ జరుపుకొనవలయును.

7. ఈ ఏడురోజులలో పొంగనిరొట్టెలనే తినవల యును. పిండిని పులియజేయు పదార్థముగాని, పొంగినరొట్టెలుగాని మీ దేశమునందు ఎక్కడ కనబడ కూడదు.

8. ఆ రోజున మీరు మీ కుమారులకు ‘మేము ఐగుప్తుదేశమును వీడివచ్చినపుడు యావే మాకు చేసిన మేలునకు స్మ ృతి చిహ్నమిది’ అని చెప్పుడు.

9. ఈ ఆచారము మీ చేతిమీద గుర్తువలెను, మీ నొసిపై బాసికమువలెను మీకు జ్ఞాపకార్ధముగా నుండును. ఈ విధముగా మీరు ఎల్లప్పుడును ప్రభు నిబంధనము గూర్చి చెప్పుకొనగలుగుదురు. యావే తన బాహుబలముతో మిమ్ము ఐగుప్తుదేశమునుండి తరలించుకొని వచ్చెనుగదా!

10. ప్రతి సంవత్సరము నియమితకాలమున మీరు ఈ విధిని పాింప వలయును.

తొలిచూలు పిల్లలు

11. మీ తండ్రులకును, మీకును మాట ఇచ్చి నట్లుగా యావే మిమ్ము కనానీయుల దేశమునకు కొని వచ్చి దానిని మీకు ఇచ్చినపుడు, 12. మీ తొలిచూలు మగబిడ్డలను ఆయనకు అంకితము చేయవలయును. మీ పశువుల తొలిచూలు పిల్లలలో మగవి యావేకు చెందును.

13. గాడిదకు ప్టుిన తొలిపిల్లకు బదులుగా గొఱ్ఱెపిల్లను దేవునికి అర్పింపవలెను. అటులకానిచో దాని మెడవిరిచి చంపివేయవలయును. మీ తొలి మగబిడ్డలను అందరిని, వెలయిచ్చి విడిపింపవల యును.

14. మీ కుమారుడు ‘ఇది యేమి?’ అని మిమ్ము అడిగినచో ‘యావే తన బాహుబలముతో మమ్ము దాస్యనిలయమయిన ఐగుప్తుదేశమునుండి కొనివచ్చెను.

15. ఫరోరాజు మొండిపట్టుతో మమ్ము ఐగుప్తుదేశమును వదలి వెళ్ళనీయనపుడు, యావే ఆ దేశములో నరులకు, పశువులకు కలిగిన తొలిచూలు పిల్లలనెల్ల చంపివేసెను. ఈ కారణముచే పశువులకు కలిగిన తొలిచూలు పిల్లలను ప్రభువైన దేవునికి సమర్పింతుము. మా కుమారులలో తొలిబిడ్డలను మాత్రము వెలయిచ్చి విడిపింతుము’ అని అతనితో చెప్పుడు.

16. మీ చేతిమీది గుర్తువలెను, మీ నొసి యందలి జ్ఞాపకచిహ్నమువలెను, ఈ ఆచారము మీకు ప్రయోజనకారి అగును. యావే తన బాహుబలముతో మనలను ఐగుప్తుదేశమునుండి తరలించుకొని వచ్చెనుగదా!”

4. రెల్లు సముద్రమును దాటుట యిస్రాయేలీయుల నిర్గమనము

17. ఫరోరాజు యిస్రాయేలీయులు వెళ్ళిపోవు టకు అంగీకరించినపుడు, దగ్గరిత్రోవ అయినప్పికి దేవుడు వారిని ఫిలిస్తీయులదేశము మీదుగా పోవు దారిన పోనీయలేదు. ఫిలిస్తీయులతో యుద్ధము సంభ వించినచో యిస్రాయేలీయులు గుండెచెదరి తిరిగి ఐగుప్తుదేశమునకే పోవుదురని దేవుడు తలంచెను.

18. ఈ కారణముచే ప్రభువు చుట్టుదారి అయి నప్పికి రెల్లుసముద్రమునకు1 పోవు ఎడారిబాటన వారిని నడిపించెను. యిస్రాయేలీయులు సర్వాయుధము లను ధరించియే ఐగుప్తుదేశమును వీడిరి.

19. అప్పుడు యిస్రాయేలీయులను ప్రమాణబద్ధులుగా చేసిన యోసేపుని అస్థికలను మోషే తనవెంట తీసుకొని పోయెను. ”దేవుడు తప్పక మీ కడకు వచ్చును. ఆ రోజున ఇక్కడినుండి నా అస్థికలను మీవెంటకొని పొండు” అని యోసేపు యిస్రాయేలీయులకు చెప్పియుండెను.

20. యిస్రాయేలీయులు సుక్కోతునుండి ఏతాము నకు వెళ్ళి, ఎడారి అంచున విడుదులు చేసిరి.

21. పగలు దారిచూపు మేఘస్తంభముగా, రాత్రి వెలుగు నిచ్చు అగ్నిస్తంభముగా ప్రభువు యిస్రాయేలీయుల ముందు నడచెను. ఆ విధముగా వారు పగలు రేయి ప్రయాణము చేసిరి.

22. పగలు మేఘస్తంభము గాని, రాత్రి అగ్నిస్తంభముగాని యిస్రాయేలీయుల ముందు కదలిపోవుట మానలేదు.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము