యోసేపుగిన్నె బెన్యామీను గోనెలో కనబడుట

1. యోసేపు తన గృహనిర్వాహకుని ఇట్లు ఆజ్ఞాపించెను: ”ఆ మనుష్యులు తీసికొని పోగలిగినన్ని ఆహారపదార్థములతో వారి గోనెసంచులను నింపుము. ఎవరిరూకలు వారి సంచిమూతిదగ్గర పెట్టుము.

2. ధాన్యముకొనుటకు తెచ్చిన సొమ్ముతోపాటు నా గిన్నెను, వెండిగిన్నెను కడగొట్టుతమ్ముని గోనె సంచి మూతికడ ఉంచుము.” వాడు యోసేపు చెప్పినట్లే చేసెను.

3. తెల్లవారిన తరువాత వారు ప్రయాణమై గాడిదలను తోలుకొనిపోయిరి.

4. వారు నగరము నుండి ఎంతోదూరము వెళ్ళకమునుపే యోసేపు గృహనిర్వాహకునితో ”వెంటనే వెళ్ళి వారిని కలిసి కొనుము. ‘చేసిన మేలునకు బదులుగా కీడు చేయు దురా? నా వెండిగిన్నెను అపహరించితిరేల? 5. ఇది మా దొర పానీయము సేవించుటకు, శకునములు చూచుటకు ఉపయోగించు గిన్నెగదా? మీరెంత పాడు పని చేసితిరి’ అని అనుము” అని చెప్పెను.

6. అతడు వారిని కలిసికొని యోసేపు చెప్పుమనిన మాట లన్నియు వారివద్ద వల్లించెను.

7. అంతట వారు ”ఎంతమాట సెలవిచ్చితిరి! కలలోనైన మేము ఇటువిం పనిని తలపెట్టకుందు ముగాక!

8. మా గోనెసంచుల మూతులదగ్గర డబ్బు కనబడినదికదా! వానిని మీకిచ్చివేయుటకు కనాను నుండి తెచ్చితిమి. మీ యజమానుని ఇంినుండి వెండిగాని, బంగారముగాని దొంగిలింపవలసిన అక్కరమాకేమున్నది?

9. మాలో ఎవ్వరిదగ్గరనైన మీ గిన్నె ఉన్న వానితల తీయుడు. పైగా మేమందరము బానిసలమగుదుము” అనిరి. 10. ”అటులయిన మంచిది. మీరు చెప్పునది ఒప్పుకొందును. గిన్నె కలవాడు నాకు బానిసగును. మిగిలినవారు వెళ్ళి పోవచ్చును” అని అతడనెను.

11. వెంటనే వారిలో ప్రతివాడు తన గోనెసంచిని నేలమీదికి దింపి దాని మూతివిప్పెను.

12. గృహనిర్వాహకుడు పెద్దవాని గోనెసంచి మొదలు చిన్నవాని గోనెసంచి వరకు అన్నింని వెదకెను. చివరకు బెన్యామీను గోనెసంచిలో గిన్నె కనబడెను.

13. ఇదిచూచి వారు దుస్తులు చించుకొనిరి. గాడిదలపైకి గోతాలెత్తించు కొని నగరమునకు తిరిగివచ్చిరి.

14. యూదా సోదరులతోపాటు వచ్చుసరికి యోసేపు ఇంివద్దనే ఉండెను. వారు అతని ముందు సాగిలబడిరి. 15. అంతట యోసేపు ”మీరిటువిం పనినెట్లు చేసితిరి? నావింవాడు శకునములు చూచి జరిగిన కార్యము గుర్తింపకుండునా?” అనెను.

16. అప్పుడు యూదా ”ప్రభూ! మేమేమి చెప్పగలము? నిర్దోషులమని ఎట్లు ఋజువు చేసికొనగలము? దేవుడే మా పాపములను కనిపెట్టెను. ఇదిగో! మేము మాతో పాటు గిన్నెగలవాడును ఏలినవారి బానిసలమయ్యె దము” అనెను.

17. దానికి యోసేపు ”కలలోనైనా నేనటువిం పనిని తలపెట్టను. గిన్నె గలవాడు నాకు బానిసగును. మిగిలిన మీరందరు ఏ దిగులు లేకుండ మీ తండ్రి దగ్గరకెళ్ళవచ్చును.” అనెను.

యూదా మనవి

18. యూదా అతని దగ్గరకెళ్ళి ”ప్రభూ! నా మనవిని చిత్తగింపుడు. ఏలినవారితో ఒక్కమాట చెప్పు కొననిండు. ఈ దాసునిపై కోపపడకుడు. మీరు ఫరో ప్రభువు వింవారు.

19. ఏలినవారు ‘మీకు తండ్రి ఉన్నాడా? తమ్ముడున్నాడా?’ అని తమ దాసులను అడిగితిరి.

20. ‘కాికి కాళ్ళుచాచిన తండ్రి ఉన్నాడు. ఆయనకు ముసలితనమున ప్టుిన కొడుకున్నాడు. వాడుచిన్నవాడు. అతని సోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడొక్కడే మిగిలెను. వాడన్నచో తండ్రికెంతో గారాబము’ అని మేము చెప్పితిమి.

21. తరువాత ఏలినవారు ‘నేనతనిని చూడవల యును. నా దగ్గరకు అతనిని తీసికొనిరండు’ అని చెప్పితిరి.

22. అంతట మేము ‘ఆ చిన్నవాడు తండ్రిని వదలిరాలేడు. వాడు కంటబడనిచో తండ్రికి ప్రాణ ములు నిలువవు’ అని చెప్పితిమి.

23. కాని మీరు ‘మీ తమ్ముడు మీతోపాటు ఇక్కడికి రానిచో మీరు మీ ముఖము నాకు చూపవలదు’ అంిరి.

24. మేము తిరిగివెళ్ళి మీ దాసుడైన మా తండ్రికి ఏలినవారు చెప్పిన మాటలన్నియు చెప్పితిమి.

25. ఆ పిమ్మట ‘మరలవెళ్ళి ఆహార పదార్థములు కొనితీసికొనిరండు’ అని మా తండ్రి చెప్పెను.

26. ‘మేమక్కడికి వెళ్ళ లేము. తమ్ముడు లేకుండ మేమాయన ఛాయలకే పోరాదు. తమ్ముడు మా వెంట వచ్చినచో వెళ్ళెదము’ అని అంిమి.

27. దానికి మీదాసుడైన మా తండ్రి ‘మీకు తెలియని దేమున్నది? నా భార్య ఇద్దరు కుమారులను కనెను.

28. వారిలో ఒకడు నన్నొదలిపోయెను. ఏదో మృగము నిశ్చయముగా వానిని కండతుండెములు చేసియుండునని అనుకొింని. వాడు ఈనాివరకు కనబడలేదు.

29. ఉన్న ఈ ఒక్క కుమారునికూడ మీరు నాకు దూరము చేయుదురా? వానికి ఏ హాని యైన కలిగిన ముదుసలినై, తలనెరసియున్న నేను దిగులుతో కుళ్ళి కుళ్ళి చావవలసినదే’ అని అనెను.

30. ఇప్పుడు మాత్రము ఈ చిన్నవాడు లేకుండ నేను మా తండ్రి దగ్గరకు వెళ్ళినచో మా తండ్రి ప్రాణ మితనితో ముడిపడియున్నది కనుక, జరగబోవునది ఒక్కియే.

31. తమ్ముడు మా వెంటరాలేదని తెలిసిన వెంటనే మా తండ్రి మరణించును. మీ దాసులమైన మేమే ముదుసలియై తలనెరసియున్న మీ దాసుడైన మా తండ్రి దిగులుతో కుళ్ళికుళ్ళి చనిపోవుటకు కారణమగుదుము.

32. ప్రభూ! మా తమ్మునికై మా తండ్రికి పూచీ ఇచ్చినది మీ దాసుడనైన నేనే. ‘నేను తమ్ముని తిరిగి తీసికొనిరానిచో బ్రతికినన్నాళ్ళు ఆ పాపము నా నెత్తికి చుట్టుకొనును’ అని మా తండ్రితో చెప్పితిని.

33. మా తమ్మునకు బదులుగా నేను ఏలిన వారి బానిసనగుదును. సోదరులతోపాటు అతనిని వెళ్ళనిండు.

34. తమ్ముడు లేకుండ తండ్రి దగ్గరకు ఏ మొగము పెట్టుకొనివెళ్ళెదను? నా తండ్రికి దాపురించు విపత్తును నేను చూడజాలను” అనెను.

Previous                                                                                                                                                                                               Next                                                                                       

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము