19 1. కొంతకాలము గడచిన తరువాత అమ్మోనీయ రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు హానూను రాజయ్యెను.

2. దావీదు, ‘నాహాషు నన్ను అభిమా నముతో చూచినట్లే నేనుకూడ అతని కుమారుడగు హానూనును అభిమానముతో చూచెదను’ అని అను కొని, నాహాషు మృతికి సంతాపము తెలుపుచు హానూను వద్దకు దూతలను పంపెను. వారు అమ్మోనీయుల రాజ్యమును చేరి హానూనును దర్శించి సంతాపమును తెలిపిరి.

3. కాని అమ్మోను నాయకులు వారి రాజుతో ”దావీదు సంతాపసూచకముగా దూతలనంపినది నీ తండ్రిని గౌరవించుటకే అనుకొింవా? అతడు త్వరపడి ఈ దేశమును ఆక్రమించుకొనగోరి వారిని పంపెను” అని చెప్పిరి. 4. హానూను దావీదు దూతల గడ్డములు గొరిగించి వారి దుస్తులను పిరుదుల వరకు కత్తిరించి పంపివేసెను.

5. ఆ దూతలు సిగ్గుతో మ్రగ్గిపోయి తిరిగిరాలేకపోయిరి. దావీదునకు ఆ సంగతి తెలిసెను. అతడు సేవకులనంపి మీరు గడ్డములు పెరుగువరకు యెరికో నగరముననే ఉండి అటు తరువాత తిరిగిరండని  చెప్పించెను.

6. అమ్మోనీయులు దావీదు కోపమును రెచ్చ గ్టొితిమని గ్రహించిరి. కనుక వారు ఆరాము, మాకా, సోబా రాష్ట్రములనుండి రథములను, రథికులను బాడుగకు తెప్పించుకొనుటకై రెండువేల మణుగుల వెండినంపిరి.

7. అటుల వారు బాడుగకు తెచ్చుకొనిన ముప్పదిరెండువేల రథములు, మాకా రాజు సైన్యములు వెడలివచ్చి మేడెబావద్ద విడిదిచేసెను. అమ్మోనీయు లును వారివారి నగరములనుండి వెడలివచ్చి యుద్ధ మునకు సన్నద్ధులైరి.

8. ఈ సంగతివిని దావీదు యోవాబు నాయకత్వమున తన సైన్యమునంతిని పంపెను.

9. అప్పుడు అమ్మోనీయులు, వెడలివచ్చి రబ్బా నగరము ప్రవేశద్వారములచెంత బారులు తీరిరి. వారికి తోడ్పడుటకు వచ్చిన రాజులు మాత్రము వెలుపలి పొలమున మోహరించియుండిరి.

10. యోవాబు ఆ సైన్యములచూచి తాను ముందు వెనుక లందుగూడ పోరు నడపవలెనని గ్రహించెను. కనుక అతడు యిస్రాయేలు సైన్యమున మెరికలవిం బంటులనెన్నుకొని వారిని అరామీయులతో పోరాడ నియమించెను. మిగిలిన సైనికులను అమ్మోనీయులతో పోరాడ నియమించి, వారికి తన తమ్ముడు అబీషయిని నాయకునిగా నియమించెను.

12. అతడు తమ్మునితో ”అరామీయులు నన్ను గెలువ జూతురేని నీవు నాకు సహాయము చేయరమ్ము. అమ్మోనీయులు నిన్ను గెలువ జూతురేని నేను నీకు తోడువత్తును.

13. నీవు ధైర్యముతో నిలువుము. మన ప్రజల కొరకును, మన  దేవుని నగరముల కొరకును పోరాడుదము. ఆ మీదట ప్రభువు తన ఇష్టము వచ్చినట్లు చేయును” అనెను.

14. యోవాబు అతని సైన్యము అరామీయులతో యుద్ధము ప్రారంభింపగా వారతని ఎదుట నిలువ జాలక పారిపోయిరి.

15. అరామీయులు కాలికి బుద్దిచెప్పుట చూచి అమ్మోనీయులుకూడ అబీషయి ఎదుినుండి పారిపోయి పట్టణమున దాగుకొనిరి. యోవాబు యెరూషలేమునకు వెళ్ళిపోయెను.

16. అరామీయులు యిస్రాయేలీయులకు ఓడిపోతిమి గదా అనుకొని యూఫ్రీసు నదికి తూర్పు వైపునున్న అరామీయులనెల్ల పిలిపించుకొనిరి. హదదెసరు యొక్క సైన్యాధిపతియైన షోఫకు  వారికి నాయకుడుగా ఉండెను.

17. ఈ సంగతి విని దావీదు యిస్రాయేలు సైన్యమును ప్రోగుజేసికొనివచ్చి యోర్దాను దాటెను. అరామీయు లకు అభిముఖముగా తన సేనలను బారులుతీర్చి యుద్ధము ప్రారంభించెను.

18. అరామీయులు వెన్నిచ్చిరి. దావీదు, అతని సైన్యము కలిసి ఏడు వేల మంది రథారూఢులను, నలువదివేల మంది పదాతులను సంహరించిరి. వారి నాయకుడైన షోఫకును కూడ వధించిరి.

19. హదదెసెరు, సామంతరాజులు తాము దావీదుతో ఓడిపోయితిమని గ్రహించి, అతనితో సంధిచేసికొని అతనికి లొంగిపోయిరి. అటు తరువాత అరామీయులు అమ్మోనీయులకు మరల సహాయము చేయలేదు.