మొర్దెకయికి ప్రశంసలు
18(10) 1. అహష్వేరోషు రాజు తన సామ్రాజ్య మునందలి ప్రజలనుండియు, సముద్ర తీరములందలి ప్రజలనుండియు పన్నులురాబట్టెను.
2. అతడు చేసిన మహా కార్యములు, అతడు మొర్దెకయికి ఉన్నతాధికా రము నిచ్చిన తీరు మాదీయ పారశీక ప్రభువుల రాజ కార్యముల దస్తావేజులలో లిఖింపబడియేయున్నవి.
3. మొర్దెకయి రాజు తరువాత రెండవస్థానమును ఆక్రమించుకొనెను. యూదులు అతనిని మిగుల గౌరవించి ఆదరాభిమానములతో చూచిరి. అతడు తన జాతిప్రజల శ్రేయస్సునుకోరి, వారి అభివృద్ధి కొరకు కృషిచేసెను.
4. మొర్దెకయి ఇట్లనెను: ”ఇదంతయు ప్రభువు చెయిదము. ఈ సంగతి గూర్చి పూర్వము నేను కనిన కల ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నది.
5. ఆ కలలో కన్పించిన సంగతులన్ని నెరవేరినవి.
6. ఆ స్వప్నమున చిన్న నీిపాయ పెద్దనదిగా మారుటయు, వెలుగును, సూర్యుడును, నీిపొంగును చూప్టినవి. ఆ నది ఎస్తేరే. రాజు ఆమెను పరిణయమాడి రాణినిగా నియమించెను.
7. స్వప్నమునందలి రెండు మహా సర్పములు హామాను, నేను.
8. కలలో కన్పించిన ఆ జాతులు యూదులను నాశనము చేయుటకుగాను ప్రోగైవచ్చినవారు.
9. దేవునికి మొరప్టిెన ఏకైక జాతి మన యిస్రాయేలీయులే. ప్రభువు వారిని రక్షించెను. ఆయన మన ప్రజలను సకలవిపత్తులనుండి కాపాడెను. అన్యజాతులు కనివినియెరుగని అద్భుతకార్యములు ఆ ప్రభువు చేసెను.
10. ఆయన తన ప్రజలకొక్క నిర్ణయమును, అన్యజాతులకు ఇంకొక నిర్ణయమును చేసెను.
11. ఈ రెండు నిర్ణయములను అమలు జరుపు సమయము ఆసన్నమయ్యెను. ఎల్లప్రజలును చూచుచుండగా ప్రభువు తాను చేసిన నిర్ణయములను అమలు జరుపుదినము వచ్చెను.
12. అప్పుడాయన తన ప్రజలను జ్ఞప్తికి తెచ్చుకొని, వారికి న్యాయము జరిగించెను.
13. కనుక వారు అదారు నెలలో పదునాలుగు, పదునైదవ దినములందు ఆరాధనకు సమావేశమై మహోత్సా హముతో పండుగ చేసికొందురు. ఎల్లకాలములందు ఎల్లతరములందు యిస్రాయేలీయులలో ఈ ఆచారము కొనసాగును.”