యాజకుడైన పషూరు యిర్మీయాను బాధించుట

20 1. దేవాలయ ప్రధానాధికారియు ఇమ్మేరు కుమారుడునగు పషూరు అను యాజకుడు యిర్మీయా పలికిన ప్రవచనములను వినెను.

2. అతడు యిర్మీయాను క్టొించి, దేవాలయమునందలి బెన్యామీను మీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.

3. మరుసిరోజు అతడు యిర్మీయాను బొండలో నుండి విడిపించెను. యిర్మీయా అతనితో ఇట్లనెను: ”ప్రభువు నీకు పషూరు అని పేరు పెట్టలేదు. మాగోర్మిసబీబు1 అని పేరు పెట్టెను.

4. ప్రభువిట్లు చెప్పుచున్నాడు. నేను నిన్ను చూచి నీవే భయపడునట్లు చేయుదును. నీ మిత్రులుగూడ నిన్ను చూచి భయ పడుదురు. వారెల్లరును యుద్ధమున శత్రువుల చేతికి చిక్కి చచ్చుట నీవు చూతువు. నేను యూదా ప్రజల నందరిని బబులోనియా రాజునకు అప్పగింతును. అతడు వారిలో కొందరిని తన దేశమునకు బానిస లుగా కొనిపోవును. మరికొందరిని చంపును.

5. నేను శత్రువులు ఈ నగరములోని సిరిసంపదలను, ఆస్తిపాస్తులను, యూదారాజుల నిధులను కొల్లగ్టొి బబులోనియాకు కొనిపోవునట్లు చేయుదును.

6. పషూరూ! శత్రువులు నిన్నును, నీ కుటుంబ సభ్యుల నందరిని బబులోనియాకు బందీలనుగా కొని పోవు దురు. నీవచటనే చత్తువు. అచటనే నిన్ను పాతి పెట్టుదురు. నీవు ఇన్ని కల్లబొల్లి ప్రవచనములు చెప్పి మోసపుచ్చిన నీ ఈ మిత్రులకుగూడ ఇదే గతిపట్టును.”

యిర్మీయా ప్రభువునకు ఫిర్యాదు చేయుట

7.            ప్రభూ!2 నీవు నన్ను చెరిచితివి, నేను చెడితిని.

               నీవు నాకంటె బలవంతుడవై

               నన్ను వశముచేసికొింవి.

               ఎల్లరును నన్ను గేలిచేయుచున్నారు.

               దినమెల్ల నన్నుచూచి నవ్వుచున్నారు.

8.           నేను మ్లాడునపుడెల్ల ”దౌర్జన్యమునకును,

               వినాశమునకును పూనుకొనుచున్నారు”

               అని గొంతెత్తి అరువవలసి వచ్చెను.

               ప్రభూ! నీ సందేశము చెప్పినందుకుగాను

               జనులు నన్ను నిరంతరము

               అవమానించి ఎగతాళి చేయుచున్నారు.

9.           ”నేను ప్రభువును జ్ఞప్తియందుంచుకొనను,

               ఆయన పేరు మీదుగా మ్లాడను”

               అని అనుకొింని,

               కాని నీ వాక్కు నా హృదయములో

               అగ్నివలె మండుచూ

               నా ఎముకలలోనే మూయబడినట్లు ఉన్నది.

               నేను ఆ వాక్కును లోలోపల

               అణచి యుంచుకోవలెనని ప్రయత్నము చేసి చేసి

               విసుగు చెందితిని, దానినిక ఆపుకోజాలను.

10.         ఎల్లెడల భయము ఆవహించియున్నది

               ‘మనము ఇతనిమీద అధికారులకు

               ఫిర్యాదు చేయుదము’ అని యెల్లరును

               గుసగుసలాడుకొనుట నేనువింని.

               నా స్నేహితులు కూడ

               నా పతనముకొరకు కాచుకొనియున్నారు.

               బహుశ ఇతడు మోసమునకు లొంగును.

               అప్పుడు మనమితనిని పట్టుకొని

               పగతీర్చుకొందమని అనుకొనుచున్నారు.

11.           కాని ప్రభూ! బలాఢ్యుడవు, వీరుడవునైన

               నీవు నా పక్షముననున్నావు.

               నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు.

               విజయము సాధింపలేక

               శాశ్వత అవమానమును తెచ్చుకొందురు.

12.          సైన్యములకు అధిపతియైన ప్రభూ!

               నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు. వారి హృదయమును, మనస్సును పరీక్షింతువు.

               నేను నా వ్యాజ్యెమును నీకు అప్పగించితిని.

               కావున నీవు నా విరోధులకు

               ప్రతీకారముచేయగా నేను చూతునుగాక!

13.          ప్రభువును కీర్తించి స్తుతింపుడు.

               ఆయన పీడితులను

               దుష్టుల బారినుండి విడిపించును.

14.          నేను ప్టుినదినము శాపగ్రస్తమగునుగాక!

               మా అమ్మ నన్ను కనినరోజు

               దీవెన బడయకుండునుగాక!

15.          ”నీకు కొడుకు, మగబిడ్డడు పుట్టెను”

               అని వార్త తెచ్చి మా తండ్రిని సంతోషచిత్తునిచేసిన

               నరుడు శాపగ్రస్తుడగునుగాక!

16.          అతడు ఉదయము ఆర్తనాదము వినునుగాక!

               మధ్యాహ్నము యుద్ధనాదమును ఆలించునుగాక!

17.          నా తల్లి గర్భమే నాకు సమాధియైయుండునట్లు

               ఆ జనుడు నేను పుట్టకమునుపే

               నన్ను చంపనందులకు ప్రభువు నిర్దయతో

               నాశనము చేసిన నగరములవలె

               అతడును అధోగతి పాలగునుగాక!

18.          అసలు నేను మాతృగర్భమునుండి

               బయికిరానేల?

               శ్రమను, దుఃఖమును అనుభవించుటకేనా?

               నా బ్రతుకు నగుబాట్లతో ముగియుటకేనా?