ప్రజలు భూమిపై వ్యాపించుట

1. నోవా కుమారులు షేము, హాము, యాఫెతుల వంశవృత్తాంతము ఇది. జలప్రళయము తరువాత ఆ ముగ్గురికి కుమారులు ప్టుిరి.

2. యాఫెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.

3. గోమెరు కుమారులు: అష్కనసు, రీఫతు, తోగర్మా.

4. యావాను కుమారులు: ఎలీషా, తర్షీషు, క్టిీము, దాడోనీము.

5. వీరినుండి ద్వీపనివాసులు తమతమ భాషల ప్రకారము, తమతమ కుటుంబముల ప్రకారము, తమతమ జాతుల ప్రకారము వేరై ఆయా దేశములలో స్థిరపడిరి.

6. హాము కుమారులు: కూషు, మిస్రాయీము, పూతు, కనాను.

7. వీరిలో కూషుకు సెబా, హవీలా, సబ్తా, రామా, సబ్తకా అను కుమారులుకలిగిరి. వారిలో రామాకు షేబా, దెదాను అను కుమారులు ప్టుిరి.

8. కూషుకు నిమ్రోదు పుట్టెను. నిమ్రోదు భూలోకములో మహావీరుడుగా ప్రసిద్ధిగాంచెను.

9. అతడు దేవుని దయవలన బలిమిగల వేటకాడయ్యెను. కావున ”దేవుడు నిన్ను నిమ్రోదువలె గొప్ప వేటగానిని చేయుగాక” అను లోకోక్తి వ్యాపించెను.

10. మొట్టమొదట షీనారు దేశమందున్న బాబెలు, యెరెకు, అక్కదు అను పట్టణములతో అతని రాజ్యము ప్రారంభమయ్యెను.

11. నిమ్రోదు ఆ దేశమునుండి బబులోనియాకు వలసపోయెను. అతడు నీనెవె, రహోబోతీరు, కాలహు, రెసెను అను పట్టణములను నిర్మించెను.

12. రెసెను- నీనెవె, కాలహు అనువాని నడుమనున్న మహానగరము.

13. మిస్రాయీము నుండి లూదీయులు, అనామీయులు,  లెహాబీయులు, నఫ్తూహీయులు, పత్రూసీయులు, కస్లూహీయులు, కఫ్తోరీయులు అను జాతుల వారు  ప్టుిరి.

14.  ఫిలిస్తీ యులు  ఈ కఫ్తోరీయుల సంతతి వారే.

15. కనాను పెద్దకొడుకు సీదోను.

16. అతనికి ఇంకను హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు,  గిర్గాషీయులు, 17. హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీ యులు ప్టుిరి.

18. తరువాత కనానీయులు విస్తరిల్లిరి.

19. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారు వైపున గాజావరకు, సొదొమ, గొమొఱ్ఱా, అద్మా, సెబోయీముల వైపున లాషా వరకు వ్యాపించి యుండెను.

20. వీరందరు హాము కుమారులు. వీరు ఆయా కుటుంబములవారుగా, భాషలవారుగా, దేశములవారుగా, జాతులవారుగా విడివడిపోయిరి.

21. ఏబెరు కుమారులకు మూలపురుషుడును మరియు  యాఫెతు పెద్దన్నయగు షేమునకు గూడ కుమారులు ప్టుిరి.

22. షేముకు ఏలాము, అస్సూరు, అర్ఫక్షదు, లూదు, అరాము అను కుమారులు ప్టుిరి.

23. అరాము కుమారులు ఊసు, హూలు, గెతెరు, మాషు.

24. అర్ఫక్షదు కుమారుడు షేలా. షేలా కుమారుడు ఏబెరు.

25. ఏబెరుకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాని పేరు పెలెగు. అతని కాలముననే భూమండలము దేశదేశములుగా విభక్తమయ్యెను, గావున అతనికి ఆ పేరు వచ్చినది. పెలెగు తమ్ముని పేరు యోక్తాను.

26. యోక్తానుకు ఆల్మోదాదు, షెలపు, హసర్మ వేతు, యెరహు,

27. హదోరాము, ఊసాలు, దిక్లా, 28. ఓబలు, అబీమాయేలు, షేబా, ఓఫీరు, హవీలా, యోబాబు అను కుమారులు జన్మించిరి.

29. వీరందరు యోక్తాను కుమారులు.

30. మేషా నుండి సేఫరుకు వెళ్ళు త్రోవలోనున్న తూర్పు కొండలలో వారు నివసించిరి.

31. ఆయా వంశముల వారుగా, భాషలవారుగా, దేశములవారుగా, జాతుల వారుగా విడిపోయిన వీరందరును షేము కుమారులే. 

32. వారివారి వంశముల ప్రకారముగా జాతులు జాతులుగా విడిపోయిన నోవా కుమారుల కుటుంబ ములు  ఇవే. జలప్రళయము తరువాత ఈ వంశములు ప్రత్యేక జాతులుగా రూపొందినవి.

Previous                                                                                                                                                                                                 Next                                                                      

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము