ఐగుప్తీయులను బాధించిన స్వల్పప్రాణులుయిస్రాయేలీయులకు భోజనమైన పూరేడుపిట్టలు

16 1.       కాబ్టి ఆ శత్రుజాతి కక్షుద్రప్రాణుల వలన

                              తగినవిధముగా పీడింపబడెను.

               ఆ ప్రాణులు గుంపులు గుంపులుగా వచ్చి

               వారిని బాధించెను.

2.           శత్రువుల క్టి శిక్ష ప్రాప్తింపగా ప్రభూ!

               నీవు నీ ప్రజల మీద కరుణజూపితివి.

               వారు ఆకలితీర భుజించుటకు రుచికరమై,

               అరుదుగా దొరకు పూరేడు పిట్టలనొసగితివి.

3.           ఆ విగ్రహారాధకులు నాడు ఆకలిగొనియున్నను,

               తమ పాలబడిన అసహ్యప్రాణులను గాంచి

               ఏవగింపుజెంది వానిని భుజింపనొల్లరైరి.

               నీ ప్రజలు కొద్దికాలము మాత్రమే ఆకలికి గురియై

               అటుపిమ్మట ప్రశస్తాహారమును భుజించిరి.

4.           నీ భక్తులను పీడించినవారికి ఘోరమైన

               ఆకిబాధ అవసరమే.

               దానివలన నీ ప్రజలు తమ శత్రువులక్టిె బాధ వాిల్లెనో తెలిసికొనిరి.

ఐగుప్తీయులకు మిడుతలదండు, యిస్రాయేలీయులకు కంచుసర్పము

5.           భయంకరములైన ఘోరసర్పములు

               నీ ప్రజలకు హాని చేసి తమ విషపుకోరలతో

               వారిని నాశనము చేయుచుండగా,

               నీవు దీర్ఘ కోపముతో వారిని హతము చేయలేదు.

6.           ఆ ప్రజలను హెచ్చరించుటకుగాను

               స్వల్పకాలము మాత్రమే వారిని విపత్తునకు గురిచేసి

               అటుపిమ్మట ఒక రక్షణచిహ్నమునొసగితివి.

               వారు ధర్మశాస్త్రమును పాింపవలెనని

               తెలుపుటకే దానిని ఒసగితివి.

7.            ఆ చిహ్నమువైపు చూచిన వాడెల్లబ్రతికెను.

               కాని తాను చూచిన ప్రతిమవలన గాదు.

               నరులెల్లరిని రక్షించు నీ వలననే

               అతడు రక్షణము పొందెను.

8.           ప్రజలను సకలఆపదలనుండి కాపాడువాడవు నీవే

               అని ఈ క్రియద్వారా నీవు మా శత్రువులకు

               తెలియజేసితివి.

9.           మిడుతలు, విషపు ఈగలు కరవగా

               మా శత్రువులు చచ్చిరి.

               ఆ చావునుండి వారిని కాపాడుట దుర్లభమయ్యెను.

               అి్ట కక్షుద్రప్రాణులద్వారా చచ్చుట

               వారికి తగియేయున్నది.

10. కాని విషసర్పముల కోరలు గూడ

               నీ తనయులను నాశనము చేయలేదు.

               నీవే కరుణతో వారినాదరించి కాపాడితివి.

11.           ఆ ప్రజలు సర్పములు కరవగా

               శీఘ్రమే విషము విరిగి బ్రతికిరి.

               వారు నీ ఆజ్ఞలను జ్ఞప్తికి తెచ్చుకొనుటకే

               నీవు ఆ ఉపద్రవమును తెచ్చిప్టిెతివి.

               లేదేని వారు నిన్ను విస్మరించి

               నీ కరుణను కోల్పోయెడివారే.

12.          మూలికలుగాని, మందుకట్టులు గాని

               వారి జబ్బును నయము చేయలేదు.

               ప్రభూ! ఎల్లరి వ్యాధిని నయము చేయు

               నీ వాక్కే వారికి ఆరోగ్యము దయచేసెను.

13.          జీవము మీదను, మరణముమీదను

               నీకు అధికారము కలదు.

               నీవు నరుని మృత్యుద్వారము చెంతకు

               కొనిపోయెదవు.

               అచినుండి మరల వెనుకకు గొనివత్తువు.

14.          నరుడు దుష్టబుద్ధితో మరియొక  నరుని

               వధింపవచ్చును,

               కాని అతడు చచ్చినవానిని బ్రతికింపలేడు.

               పాతాళమున చిక్కిన వానిని

               మరల బయికి కొనిరాలేడు.

వడగండ్లవాన, మన్నా

15.          ఎవడును నిన్ను తప్పించుకోజాలడు.

16.          నిన్నంగీకరింపని దుష్టులను

               నీవు మహాబలముతో శిక్షించితివి.

               ఘోరమైన వడగండ్లవాన వారిని వెన్నాడెను.

               పిడుగుల అగ్ని వారిని దహించివేసెను.

17.          ఆశ్చర్యకరమైన సంగతి యేమనగా,

               అన్నిని చల్లార్చు నీిలోనే

               అగ్ని ఉధృతముగా మండెను.

               పుణ్యపురుషులను రక్షించుటకు

               ప్రకృతిశక్తులు కూడ పోరాడును.

18.          ఒక పర్యాయము ఆ నిప్పు చల్లారిపోయి

               దుష్టశిక్షణకై పంపబడిన మృగములను

               సంహరింపదయ్యెను.

               ఈ చర్యద్వారా దైవశిక్ష తమను వెన్నాడుచున్నదని

               ఆ దుష్టులు గుర్తించిరి.

19.          కాని మరియొక పర్యాయము చుట్టును

               జలములావరించియున్నను,

               ఆ అగ్ని మామూలు నిప్పుకంటెను

               ఉజ్జ్వలముగా మండి 

               దుష్టుల పంట పొలములను కాల్చివేసెను.

20. కాని నీ ప్రజలక్టిె విపత్తు వాిల్లలేదు.

               నీవు వారికి దేవదూతల ఆహారమును ఒసగితివి.

               వార్టిెశ్రమ చేయకున్నను నీవు వారికి

               ఆకాశము నుండి సిద్ధాన్నము నొసగితివి.

               అది అన్నిరుచులు కలిగి

               అందరి అభిరుచులకు సరిపోయెను.

21.          నీ ప్రజలనిన నీకిష్టమని

               ఆ భోజనము రుజువుచేసెను.

               ఆ ఆహారము ప్రతి నరుని రుచికనుగుణముగా

               మారిపోయి ప్రతివాని కోరికెను తీర్చెను.

22-23. ఆ భోజనము మామూలుగా మంచువలె

               కరగునదైనను ఇప్పుడు

               నిప్పునకుగూడ కరగదయ్యెను.

               జోరుగా వానకురిసి వడగండ్లు పడునపుడుకూడ

               శత్రువుల పంటపొలములను కాల్చివేసిన అగ్ని,

               ఇపుడు తన శక్తిని తాను మరచిపోయి

               నీ తనయులకు భోజనసదుపాయమును

               కలిగించెనని ఈ సంఘటనల వలన

               నీ ప్రజలు గ్రహింపగలిగిరి.

24. సృష్టి తనను కలిగించిన నీకు

               విధేయమైయుండి

               తన శక్తిని కూడగట్టుకొని దుర్మార్గులను

               శిక్షించుటకు పూనుకొనును.

               కాని నిన్ను నమ్మిన సజ్జనులయెడల

               శాంతము వహించి వారికి మేలుచేయును.

25. ఈ రీతిగా సృష్టి బహురీతులమారి

               అక్కరలోనున్నవారిని నీవు నెనరుతో

               ఆదుకొందువని రుజువు చేయుచున్నది.

26. ప్రభూ! ఈ సంఘటన వలన పొలములో పండిన

               పంటలు తమను పోషింపజాలవనియు,

               నిన్ను నమ్మినవారిని నీ వాక్కే పోషించుననియు

               నీ అనుంగు పిల్లలు గుర్తింతురు.

27. అగ్నిగూడ నాశనము చేయలేని ఆ ఆహారము,

               సూర్యుని ప్రథమ కిరణముల వేడిమి

               సోకినంతనే కరగిపోయెను.

28. మేము ప్రొద్దు పొడవక మునుపే మేల్కొని

               నీకు వందనములర్పింపవలెననియు

               వేకువనే నీకు ప్రార్థన చేయవలెననియు

               దీనిని బ్టియే విశదమగుచున్నది.

29.        కృతజ్ఞతలేని నరుని ఆశలు

               పొగమంచువలె కరగిపోవును.

               వాడక వదలి వేసిన నీివలె ఇంకిపోవును.