చిన్న న్యాయాధిపతులు, యెఫ్తా

6. ోలా

10 1. అబీమెలెకు తరువాత దోదొ మనుమడును, పూవా కుమారుడైన ోలా యిస్రాయేలీయులను శత్రు వుల నుండి రక్షించెను. అతడు యిస్సాఖారు తెగవాడు. ఎఫ్రాయీము పర్వతసీమలో షామీరు నగరమున వసించెడివాడు.

2. ోలా ఇరువది మూడేండ్లు యిస్రా యేలునకు న్యాయాధిపతిగా పనిచేసి మరణానంత రము షామీరుననే భూస్థాపితము చేయబడెను.

7. యాయీరు

3. అటుపిమ్మట గిలాదునకు చెందిన యాయీరు న్యాయాధిపతియై ఇరువది రెండేండ్లు తీర్పుతీర్చెను.

4. అతని ముప్పదిమంది కుమారులు, ముప్పది గాడిదపిల్లలనెక్కి తిరిగెడివారు. వారికి ముప్పది పట్టణములుండెడివి. నేికి గిలాదు సీమయందు ఆ పట్టణములకు యాయీరు పట్టణములనియే పేరు.

5. యాయీరు మృతిచెంది కామోనున పూడ్చివేయ బడెను.

8. యెఫ్తా – అమ్మోనీయుల పీడ

6. యిస్రాయేలీయులు మరల దుష్టకార్యములు చేసిరి. వారు బాలు, అష్టారోతు దేవతలను, అరాము, సీదోను, మోవాబు, అమ్మోను, ఫిలిస్తీయ దేశముల దేవతలను పూజించిరి. యావేను పూర్తిగా విస్మరించిరి.

7. ప్రభువు ఉగ్రుడై యిస్రాయేలీయులను ఫిలిస్తీయు లకు, అమ్మోనీయులకు అప్పగించెను.

8. వారు నాడు   మొదలుకొని పదునెనిమిది యేండ్లపాటు యోర్దానుకు ఆవలి ప్రక్క అమోరీయుల దేశమగు గిలాదున వసించు యిస్రాయేలీయులనందరిని నేలబ్టెి కాలరాచిరి.

9-10. పై పెచ్చు అమ్మోనీయులు యోర్దాను దాివచ్చి యూదా, బెన్యామీను, ఎఫ్రాయీము మండలములపై పడజొచ్చిరి. కనుక యిస్రాయేలీయులు మిగుల ఏడ్చి యావేకు మొరప్టిె ”ప్రభూ! నీకు అపరాధము చేసి తిమి. మా దేవుడవైన నిన్నువిడనాడి బాలుదేవతలను పూజించితిమి” అనిరి.

11-12. యావే వారితో ”ఐగుప్తీయులు, అమోరీయులు, అమ్మోనీయులు, ఫిలిస్తీ యులు, సీదోనీయులు, అమాలెకీయులు, మిద్యానీ యులు మిమ్ము పీడింపగా నేను మిమ్ము కాపాడలేదా?

13. అయినను మీరు నన్ను విడనాడి అన్యదైవము లను సేవించిరి. కనుక నేను మిమ్ము రక్షింపను.

14. పొండు, మీరెన్నుకొనిన ఆ దైవముల యెదుటనే మొర పెట్టుకొనుడు. వారు మిమ్ము ఈ యిడుమలనుండి కాపాడగలరేమో చూతము” అనెను.

15. కాని యిస్రా యేలీయులు ”ప్రభూ! మేము అపరాధము చేసినమాట నిజమే. మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు శిక్షింపుము. కాని నేడు ఈ ఆపదనుండి మాత్రము కాపాడుము” అని విన్నవించుకొనిరి.

16. యావేను సేవించవలెనని యిస్రాయేలీయులు తమ మధ్యనుండి అన్యదైవము లను విడనాడగా, వారికి కలిగిన ఆపదనుచూచి యావే కడుపు తరుకుకొని పోయెను.

17. అపుడు అమ్మోనీయులు ప్రోగైవచ్చి గిలాదున శిబిరము పన్నిరి. యిస్రాయేలీయులు కూడ గుమి గూడి వచ్చి మిస్ఫా చెంత గుడారులెత్తిరి.
18. గిలాదు పెద్దలు ”అమ్మోనీయులతో పోరాడగలవాడే గిలాదు నంతికి నాయకుడగును” అని నిశ్చయించుకొనిరి.

Previous                                                                                                                                                                                                     Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము