యిస్రాయేలునకు దీవెన

44 1.”అయినను నా సేవకుడవైన యాకోబూ! వినుము. నేనెన్నుకొనిన యిస్రాయేలూ! ఆలింపుము.

2.           ప్రభువిట్లు నుడువుచున్నాడు.

               నేను నిన్ను కలిగించితిని.

               నీవు గర్భమున పడినప్పినుండియు

               నీకు రూపమును ఇచ్చితిని. నిన్ను ఆదుకొింని.

               నా సేవకుడవైన యాకోబూ!

               నీవు భయపడకుము. యెషూరూనూ6!

               నేను నిన్ను ఎన్నుకొింని.

3.           నేను దాహముగొనిన నేలమీద

               నీళ్ళు కుమ్మరింతును.

               ఎండిననేలమీద ఏరులు పారింతును.

               నీ బిడ్డల మీదికి నా ఆత్మను కుమ్మరింతును.

               నీ వంశజులమీద నా దీవెనలను వర్షింతును.

4.           వారు నీరుప్టిెన గడ్డివలె ఎదుగుదురు.

               పారు ఏరులచెంత

               నిరవంజి చెట్లవలె పెరుగుదురు.

5.           ఒకడు నేను

               ప్రభువునకు చెందినవాడనని చెప్పును,

               ఇంకొకడు నేను

               యిస్రాయేలు పక్షము వాడనని పలుకును.

               మరియొకడు

               తన చేతిపై ప్రభువు పేరు వ్రాసికొనును.

               యిస్రాయేలు అను పేరును

               తన నామమునకు చేర్చుకొనును.”

ఏకైక దేవుడు

6.           యిస్రాయేలు రాజును, వారి విమోచకుడును,

               సైన్యములకధిపతియైన ప్రభువు

               ఇట్లు అనుచున్నాడు:

               ”మొదివాడను, కడపి వాడను నేనే.

               నేను తప్ప ఏ దేవుడును లేడు.

7.            నేనుచేసిన కార్యములను

               ఇతరులెవరైన చేయగలిగిరా?

               కాలము మొదనుండి చివరివరకును

               జరుగు కార్యములను

               ఎవరైనా ముందుగా ఎరిగింపగలిగిరా?

8.           జనులారా! మీరు భయపడకుడు, వెరవకుడు.

               ఆదినుండి నేివరకును జరుగు సంగతులనెల్ల

               నేను ముందుగా ఎరిగించియుింని.

               మీరు నాకు సాకక్షులు.

               నేనుగాక దేవుడెవడున్నాడు?

               నేను తప్ప, ఆశ్రయింపదగిన

               దేవుడెవడును లేడు. ఉన్నట్లు నేనెరుగను”

విగ్రహారాధనను అపహసించుట

9. విగ్రహములను చేయువారు నిరర్థకులు. వారంతగా మెచ్చుకొను ఆ విగ్రహములు నిష్ప్రయోజ నమైనవి. వారే అందుకు సాకక్షులు. వారు గ్రహించి, తెలుసుకొనువారు కారు గనుక సిగ్గుపడరు.

10. ఏలయనగ, నిష్ప్రయోజనమైన పోతవిగ్రహమును చేసి, దానిని దేవునిగా రుజువు చేయువాడు ఎవడు?

11. దానిని వందించువారును సిగ్గు చెందుదురు. ఆ విగ్రహములను చేయువారు నరమాత్రులేకదా. వారినిచటకి రానిండు, తీర్పునకు తట్టుకోగలరేమో చూతము! వారు తప్పక భయముతో కంపించి సిగ్గు పడుదురు.

12. కమ్మరి లోహపుముక్కను అగ్నిలో కాల్చి సమ్మెటతో బాదును. అతడు తనబలమైన చేతులతో దానిని సుత్తెతో మోదిమోది అలసిపోవును. ఆకలిగొని దప్పికచెందును.

13. వడ్రంగి కొయ్యను కొలతవేయును. సున్న ముతో దానిమీద రూపము గీయును. తన పని ముట్లతో ఆ రూపమును కోయును. దానిని చెక్కి సుందరమైన నరాకృతిని తయారుచేయును. ఆ బొమ్మను మందిరమున స్థాపింపనెంచును.

14. అతడు బొమ్మనుచేయుటకు దేవదారుచెట్టును నరుకవచ్చును. లేదా అడవినుండి సింధూరమునో, తమాలమునో కొనివచ్చి వాడవచ్చును. లేదా స్వయముగా ఏదో ఒక చెట్టునునాి అది వానకు పెరుగువరకును వేచి యుండవచ్చును.

15. ఆ చెట్టు అతనికి వంటచెరకుగా ఉపయోగపడును. దానితో అతడు చలికాచుకొనును. రొట్టెకాల్చుకొనును. కాని ఆ చెట్టుకొయ్యతోనే అతడు విగ్రహమును చేసి ఆరాధించును.

16. అతడు ఆ చెట్టు కొయ్యలో కొంతభాగముతో నిప్పు తయారు చేయును. దానిమీద మాంసము వండుకొని ఆరగించును. ఆ నిప్పుతో చలికాచుకొని ”నా యెదుట అగ్గి యున్నది, ఆహా, నాకు వెచ్చగానున్నది” అని తలంచును.

17. మిగిలిన భాగముతో బొమ్మను జేసి దానికి సాగిలపడి నమస్కారము చేసి, ”నీవే నాకు దేవుడవు, నన్ను రక్షింపుము” అని ప్రార్థన చేయును.

18. అి్ట జనులకు ఏమియు తెలియదు. ఏమియు అర్థము కాదు. వారి కన్నులు గ్రుడ్డివి కనుక ఏమియు చూడజాలవు. వారి హృదయములు మూయ బడి ఉన్నవి. కనుక ఏమియు గ్రహింపజాలవు.

19. విగ్రహములను చేయువాడు ఆలోచింపడు. ”నేను కొంత కొయ్యనుకాల్చి నిప్పుచేసితిని. ఆ నిప్పుమీద రొట్టెకాల్చుకొని మాంసము వండుకొని భుజించితిని. మిగిలినకొయ్యతో ఈ విగ్రహమును చేసితిని. కనుక నేను వ్టి కొయ్యముక్కను ఆరాధించుచున్నాను” అని ఆలోచించునంతి వివేకమైనా అతనికి లేదు.

20. అతడు బూడిదను తిన్నట్లగును. అతని పిచ్చి తలంపులే అతనిని తప్పుత్రోవ ప్టించెను. అతనికిక సద్గతిలేదు. ”తన చేతిలోనున్న బొమ్మ దేవుడు కానే కాదు” అని అంగీకరింపడు.

దైవోక్తి

21.          యాకోబూ!

               నీవు ఈ సంగతులెల్ల గుర్తుంచుకొనుము.

               యిస్రాయేలూ!

               నీవు నా సేవకుడవని జ్ఞప్తియందుంచుకొనుము.

               నేను నీకు రూపమునిచ్చితిని, నీవు నా సేవకుడవు.

               యిస్రాయేలూ! నేను నిన్ను విస్మరింపను.     

22.        నేను నీ తప్పిదములను

               మబ్బువలె ఎగురగ్టొితిని.

               నీ పాపములను

               మంచుతెరవలె చెదరగ్టొితిని.

               నీవు నా చెంతకు మరలిరమ్ము.

ఆనందగీతము

23.        ప్రభువే ఈ చెయిదమును చేసెను.

               కనుక ఆకసమా! సంతోషముతో కేకలిడుము.

               భూమియందలి అగాధస్థలములారా!

               ఆనంద నాదముచేయుడు.

               కొండలారా! అడవిలోని చెట్టులారా!

               సంతసముతో అరువుడు.

               ప్రభువు యాకోబును విమోచించెను.

               యిస్రాయేలును రక్షించి

               తన మహిమను ప్రదర్శించెను.

ప్రభువు మాహాత్మ్యము

24.         నిన్ను విమోచించి,

               గర్భమున పడినప్పినుండియు,

               నీకు రూపమునొసగిన

               ప్రభువు ఇట్లనుచున్నాడు:

               ”సకలమును చేసిన ప్రభువును నేనే.

               నాయంతట నేనే

               ఆకాశమును విశాలముగా విప్పితిని,

               నాయంతట నేనే

               భూమి రూపొందునట్లు చేసితిని.

25.        నేను సోదె చెప్పువారిని భంగపరతును.

               జ్యోతిష్కులను వెఱ్ఱివారిని చేయుదును.

               జ్ఞానుల వచనములు వమ్ము జేయుదును.

               వారి జ్ఞానము హుళక్కి అని నిరూపింతును.

26.        కాని నా సేవకుల ప్రవచనములను బలపరతును.

               నా దూతల ప్రణాళికలను

               విజయవంతము చేయుదును.

               నేను యెరూషలేమును గూర్చి

               ‘అచట జనులు మరలవసింతురు’

               అని చెప్పుదును.

               యూదా నగరములను గూర్చి

               ‘వానిని మరల నిర్మింతురు’

               అని ఆజ్ఞ ఇచ్చుదును.

               ఆ పురములలోని

               శిథిలగృహములను పునఃనిర్మింతును.

27.         నేను ‘నీవు ఎండిపొమ్ము,

               నేను నీ నదులను ఎండబెట్టుదును’

               అని ప్రవాహముతో చెప్పుదును.   

28.        నేను కోరెషుతో ఇట్లు చెప్పుదును:

               ‘నీవు నేను నియమించిన కాపరివి.

               నా సంకల్పమును నెరవేర్చువాడవు.

               నీవు యెరుషలేమును

               పునర్నిర్మింపవలెనని పలుకుదువు.

               దేవాలయమునకు

               పునాదులెత్తవలెనని నుడువుదువు”.