గుడారపు పనిచేయు పనివాండ్రు

1-2. ప్రభువు మోషేతో ”నేను యూదాతెగకు చెందిన హూరు మనుమడును, ఊరి కుమారుడగు బేసలేలును ఎన్నుకొింని.

3. నేను అతనిని దైవాత్మతో నింపితిని. కనుక అతనికి సుందరమైన వస్తువులను చేయునేర్పు, సామర్థ్యము, తెలివితేటలు లభించును. 

4.అతడు సుందరమైన వస్తువుల నమూనాలను తయారు చేసికొని వానిని బంగారముతో, వెండితో, ఇత్తడితో రూపొందింపగలడు.

5. రత్నములను సానప్టిె బంగారమున పొదుగగలడు. కొయ్యపై బొమ్మలు చెక్కగలడు. ఈ రీతిగా సుందర వస్తువు లన్నిని తయారుచేయగలడు.

6. దానుతెగకు చెందిన అహీసామాకు కుమారుడగు ఒహోలియాబు బేసలేలు నకు తోడైయుండును. మిగిలిన పనివాండ్రకందరికి నా జ్ఞానమును ప్రసాదించితిని. కనుక నేను నీకు ఆజ్ఞాపించిన వస్తువులన్నిని వారు సిద్ధముచేయగలరు.

7. సమావేశపుగుడారము, నిబంధనమందసము – దానిమీది కరుణాపీఠము, గుడారపు ఉపకరణములు, 8. బల్ల-దాని ఉపకరణములు, బంగారపు దీపస్తంభము – దాని ఉపకరణములు, ధూపపీఠము, 9. దహన బలులు అర్పించు బలిపీఠము –  దాని ఉపకరణములు, 10. ప్రక్షాళనపు గంగాళము-దాని పీట, యాజకుడగు అహరోను, అతని కుమారులు యాజకపరిచర్య చేయునపుడు ధరించవలసిన వస్త్రములు -యాజకుడైన అహరోనుయొక్క అమూల్య పరిశుద్ధ వస్త్రములు, అతని కుమారుల వస్త్రములు, 11. అభిషేక తైలము, పరిశుద్ధ స్థలమున వాడు పరిమళపు సాంబ్రాణి మొదలగు వస్తువులన్నిని వారు తయారుచేయుదురు. నేను నిన్ను ఆజ్ఞాపించిన పద్ధతిలోనే వారు ఈ వస్తువు లన్నింని తయారుచేయవలెను” అనెను.

విశ్రాంతిదినము

12. ప్రభువు మోషేతో ”యిస్రాయేలీయులను ఇట్లు ఆజ్ఞాపింపుము.

13. ‘మీరు నేను నియమించిన విశ్రాంతిదినమును పాింపవలయును. ప్రభుడనైన నేను మిమ్ము నా ప్రజలుగా చేసికొింని అనుటకు ఈ విశ్రాంతిదినము నాకును, మీకును మీ తరతర ముల వారికిని మధ్య గుర్తుగా నుండును.

14. కనుక మీరు విశ్రాంతిదినమును పాింపవలయును. అది మీకు పవిత్రమైనది. దానిని పవిత్రముగా ఎంచని వారందరికి మరణశిక్ష విధింపవలయును. విశ్రాంతి దినమున పనిచేయువారిని సమాజమునుండి వెలి వేయవలయును.

15. మీరు ఆరురోజులు పని చేసికొనవచ్చును. కాని ఏడవరోజు విశ్రాంతిదినము. అది ప్రభువునకు పవిత్రమైనది. ఆ దినమున పనిచేయు వాడు మరణమునకు పాత్రుడగును.

16. యిస్రాయేలీ యులు తరతరములవరకు విశ్రాంతిదినమును నిత్యనియమముగా పాింపవలెను.

17. నాకును యిస్రాయేలీయులకును మధ్య ఈ విశ్రాంతిదినము శాశ్వతచిహ్నముగా ఉండును. ప్రభుడనైన నేను ఆరురోజులలో భూమ్యాకాశములను సృజించి ఏడవ నాడు పనిచాలించి విశ్రమించితిని” అని చెప్పెను.

18. ఈ రీతిగా ప్రభువు సీనాయికొండమీద మోషేతో సంభాషించుట చాలించిన పిదప అతనికి రెండు నిబంధనపలకలను ఇచ్చెను. అవి ప్రభువు స్వయముగా తనవ్రేలితో వ్రాసి యిచ్చిన రాతిపలకలు.

Previous                                                                                                                                                                                              Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము