ఉపోద్ఘాతము:

పేరు: పూర్వనిబంధన గ్రంథములలోకెల్ల ఇది చిన్న గ్రంథము. ఓబద్యా అనగా ”ప్రభుసేవకుడు” అని అర్థము.  మరొక సంప్రదాయం ప్రకారము ఓబద్యా అనగా ”యావేను ఆరాధించువాడు” అని కూడా చెప్పబడును.  ఇతని గురించిన విషయములు పరిమితమైయున్నవి.

కాలము: క్రీ.పూ. 587లో యెరుషలేము విధ్వంసము నుండి క్రీ.పూ 312లో ఎదోము విధ్వంసము వరకు గల మధ్యకాలము. 

రచయిత:   ఓబద్యా.

చారిత్రక నేపథ్యము: యాకోబు సంతతివారైన యిస్రాయేలీయులు, ఏసావు సంతతి వారైన ఎదోమీయులు నిత్యము పరస్పరము వ్యతిరేకత కలిగియుండిరి. యెరూషలేమును కొల్లగొట్టుటకు మరియు యూదామీద దాడికి వచ్చిన విరోధులకు ఎదోమీయులు  తోడ్పడేవారు. వారితో కలిసి వీరును యూదాను కొల్లగొట్ట యత్నించెడివారు. ఈ రెండు వంశాల మధ్య చాలాకాలంగా వున్న వివాదాలే ఈ గ్రంథమునకు ప్రధాన నేపథ్యము. యాకోబు ఏసావు జ్యేష్ఠత్వాన్ని మోసముతో లాగేసుకున్న నాినుండి వీరిద్దరి మధ్య ద్వేషాలు రగులుతూనే ఉండేవి (ఆది. 25:22-27; సంఖ్యా. 20:14-21; 2 సమూ. 8:13,14).

ముఖ్యాంశములు: ఎదోమీయులు తమ సహోదరులైన యిస్రాయేలీయుల పతనమును కాంక్షించిరి గాన, వారు దైవతీర్పును తప్పించుకోలేరనేది  ప్రధానాంశముగా చూస్తాము. రానున్నకాలములో దేవుని ప్రజలు ఏదోముతో సహా ఇతర దేశాలన్నింని స్వాధీనము చేసుకొని పరిపాలిస్తారని ఓబద్యా ప్రవచనము వివరిస్తుంది (వ.21). నెబుకద్నెజరు చేసిన దేవాలయ విధ్వంసము గూర్చి వ.10-14లో ఓబద్యా వివరిస్తాడు.

క్రీస్తుకు అన్వయము: ఈ గ్రంథములో క్రీస్తు అన్వయానికి సంబంధించిన మూడు దృశ్య ప్రస్తావనలు చూడగలము. 1. దేశాలకు న్యాయ తీర్పుతీర్చువాడు (వచనాలు:15-16); 2. యిస్రాయేలీయుల రక్షకుడు (వచనాలు: 17-20); 3. దేశమును విముక్తి చేయువాడు (వ.21). యూదాకు పునరావాసం లభిస్తుందని ఓబద్యా చెప్పిన ప్రవచనం క్రీస్తు ద్వారా విమోచనమునకు అన్వయము.

 

Previous                                                                                                                                                                                                    Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము