కోరా, దాతాను, అబీరాములు మోషే మీద తిరుగబడుట

16 1. లేవీ తెగకు చెందినవాడును, కోహాతునికి మనుమడును, ఈస్హారు కుమారుడునగు కోరా, 2. రూబేనుతెగవారైన ఎలీయాబు కుమారులగు దాతాను, అబీరాములు, పేలేతు కుమారుడగు ఓను యోచించు కుని రెండువందలయేబది మంది పేరుమోసిన యిస్రా యేలీయుల సమాజపెద్దలతో మోషేకు ఎదురుగాలేచి 3. మోషే అహరోనులకు వ్యతిరేకముగా జతక్టి, ”మీ గొప్పలు మా ఎదుట చెల్లవు. యిస్రాయేలు సమాజమంతయు పరిశుద్ధమైనదేకదా! ఈ ప్రజ లందరు ప్రభువునకు చెందినవారేకదా! మరి ప్రభువు ప్రజలకు మీరు మాత్రమే పెద్దలు కానేల?” అని అడిగిరి.

4. ఆ మాటలువిని మోషే నేలమీద బోరగిలబడి దేవునికి మనవి చేసెను.

5. అతడు కోరాను, అతని అనుచరులను చూచి ”ప్రభువు తనకు చెందిన వారెవరో, పవిత్రులెవరో రేపు ప్రొద్దున నిర్ణయించును. ఆయన తనకు చెందినవారినే తన చెంతకు రానిచ్చును.

6-7. రేపు నీవును, నీ అనుచరులును మీ ధూప పాత్రములను నిప్పులతో నింపి, సాంబ్రాణివేసి యావే సన్నిధిని ధూపమువేయుడి. పవిత్రులైనవారిని ప్రభువే ఎన్నుకొనును. లేవీయులారా! మీ ఆగడములు మా యెదుట చెల్లవు” అనెను.

8. మరియు మోషే కోరాతో ”లేవీ కుమారులారా! నామాటలు వినుడు.

9. యిస్రాయేలు సమాజము నుండి ప్రభువు మిమ్ము తన సేవకు ఎన్నుకొనెను. మీరు ఆయన ఎదుికివచ్చి ఆయన గుడారమున పరిచర్యచేయుచున్నారు. ప్రభువు సమాజమునకు ఊడిగము చేయుచున్నారు. ఇది ఎంతిభాగ్యమో ఊహించితిరా?

10. ప్రభువు నిన్ను నీ అనుచరులైన లేవీయులను తనచెంతకు రానిచ్చుట చాలదా? మీరు ఇపుడు యాజకత్వమునకు కూడ అఱ్ఱులు చాపవలెనా?

11. దీనికై నీవును, నీతో జతక్టినవారు ప్రభువునకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఏపాివాడు? అతనికి విరోధముగా మీరు గొణగనేల?” అనెను.

12. మోషే ఎలీయాబు కుమారులు దాతానును అబీరాముని పిలువనంపెను. కాని వారు ”మేము రాము, 13. నీవు మమ్ము పాలుతేనెలుజాలువారు ఆ ఐగుప్తుదేశము నుండి తరలించుకొనివచ్చినది ఈ నిర్జనప్రదేశమున చంపివేయుటకే కదా? పైగా మా మీద పెత్తనముకూడా చేసెదవా?

14. నిశ్చయముగా నీవు మమ్ము పాలుతేనెలుజాలువారు నేలకు కొని రాలేదు. మాకు పొలములు, ద్రాక్షతోటలు పంచి ఈయలేదు. ఈ ప్రజలు అంత గ్రుడ్డివారనుకొింవా యేమి? మేము నీయొద్దకురాము” అనిరి.

15. ఆ మాటలకు మోషే ఉగ్రుడై ”ప్రభూ! నీవు వీరి సమర్పణ ములను అంగీకరింపవలదు. నేను వీరికి ఎి్ట అప కారమును చేయలేదు. తుదకు వీరి గాడిదనైనను తీసికొని ఎరుగను” అనెను.

శిక్ష

16. మోషే కోరాతో ”రేపు నీవు నీ అనుచరు లును, అహరోనును ప్రభువుసన్నిధికి రండు.

17. మీ రెండువందల యేబదిమందిలో ప్రతివాడు తన ధూపకలశములను సాంబ్రాణితో నింపి ప్రభువు ఎదుికి కొనిరావలెను. అట్లే నీవు, అహరోను మీ యిరువురి కలశములను కొనిరండు” అని చెప్పెను.

18. ఆ రీతిగనే ప్రతివాడును సాంబ్రాణి నిండిన తన ధూపకలశముతో నిబంధనపుగుడారము ఎదుట ప్రోగయ్యెను. మోషే అహరోనులు కూడ వచ్చిరి.

19. కోరా ఆ జనులనందరిని మోషే అహరోనులకు వ్యతిరేకముగా గుంపుగా చేర్చి సమావేశపు గుడారము ద్వారమువద్ద నిలుపగా, ప్రభువు సాన్నిధ్యపుప్రకాశము ఒక్కసారిగా వారి ఎదుట ప్రత్యక్షమయ్యెను.

20-21. ప్రభువు మోషే అహరోనులతో మాట లాడెను. ”మీరు ఈ ప్రజలకు దూరముగా నిలువుడు. నేను వారినందరిని ఒక్కక్షణములో నాశనము చేసెదను” అనెను.

22. కాని మోషే అహరోనులు నేలపై బోరగిలబడి ”దేవా! నీవు జీవులన్నికి ప్రాణము ఇచ్చువాడవు. ఒక్కని పాపము కొరకు ఈ సమాజము నంతిని శిక్షింతువా!”అనిరి.

23-24. ప్రభువు, మోషేతో ”కోరా, దాతాను, అబీరాముల గుడారముల నుండి అవతలకు పోవలెనని ఈ ప్రజలను ఆజ్ఞా పింపుము” అనెను.

25. మోషే నేలమీదనుండి పైకిలేచి దాతాను, అబీరాముల వద్దకు వెళ్ళెను. ప్రజానాయకులును వారి వెంట వెళ్ళిరి.

26. అతడు ప్రజలతో ”మీరు ఈ దుర్మార్గుల గుడారములకు దూరముగా ఉండుడు. వారి వస్తువులు వేనిని ముట్టుకోవలదు. లేదేని మీరును వారి పాపములవలన బుగ్గియైపోవుదురు” అనెను.

27. కనుక ప్రజలు కోరా, దాతాను, అబీరాముల గుడారములనుండి దూరముగా తొలగిరి.

28. దాతాను, అబీరాములు తమ గుడారముల ముందట నిలబడియుండిరి. వారి భార్యలు, పుత్రులు, పసిబిడ్డలు అక్కడనే నిలిచియుండిరి.

29. అప్పుడు మోషే ప్రజలతో ”ఈ కార్యములన్నిని ప్రభువు నాచేత చేయించెనేగాని నేను స్వయముగా ఏమియు చేయలేదని మీకిప్పుడే తేటతెల్లమగును. వీరు నరు లందరివలెనే సహజమైనచావు చచ్చినచో ప్రభువు నన్ను పెద్దగా నియమింపలేదనుకొనుడు.

30. కాని ప్రభువు ఇపుడొక అద్భుతకార్యము చేసినచో, భూమి నోరువిప్పి వీరిని, వీరికి చెందినవారిని మ్రింగివేసినయెడల, వీరందరు జీవముతోనే పాతాళలోకము చేరుకొని నచో, వీరు ప్రభువును పరిత్యజించిరని తెలిసికొనుడు” అనెను.

31. మోషే ఈ రీతిగా మ్లాడి ముగించెనో లేదో దాతాను, అబీరాముల కాళ్ళక్రింది నేల బ్రద్ద లయ్యెను.

32. భూమి నోరుతెరిచి వారిని, వారి కుటుంబములను మ్రింగివేసెను. కోరాను, అతని అనుచరులను వారి వస్తువులను కబళించివేసెను.

33. వారును, వారివస్తువులును పాతాళమునకు చేరుకొనెను. భూమి వారిని మ్రింగివేసెను. ఇకవారు ఎవరి కంటనుపడలేదు.

34. అక్కడ గుమిగూడియున్న యిస్రాయేలీయులందరు ఆ మింలో కలసి పోవు చున్న వారి ఏడ్పులువిని భూమి తమను గూడ మ్రింగి వేయునేమోయని భయపడిపారిపోయిరి.

35. అప్పుడు ప్రభువు సన్నిధినుండి ఒక మంట దిగివచ్చి ధూపము అర్పింపవచ్చిన ఆ రెండువందలయేబది మందిని గూడ కాల్చిబూడిద చేసెను.

ధూపకలశములు

36-37. ప్రభువు మోషేతో ”యాజకుడగు అహరోను కుమారుడు ఎలియెజెరును పిలిచి, ధూప కలశములను బుగ్గినుండి వెలికిదీయుమని చెప్పుము. ఈ ధూపకలశములు పవిత్రములైనవి. ఆ బుగ్గిని దూరముగా చల్లుము.

38. వీనిని ప్రభువు ఎదుికి కొనివచ్చినందున పవిత్రములైనవి. కనుక వీనిని రేకులుగా సాగగ్టొి బలిపీఠమును కప్పునట్లు వానిని బిగగొట్టుము. అది యిస్రాయేలీయులకు ఒక హెచ్చరిక సూచికముగా నుండగలదు” అని చెప్పెను.

39. యాజకుడగు ఎలియెజెరు, అగ్గిలో బుగ్గి యైన వారు కొనివచ్చిన ఆ కంచుకలశములను వెలికిదీసి వాిని రేకులుగా సాగగ్టొి బలిపీఠమును కప్పుచు బిగగొట్టెను.

40. అహరోను వంశీయులు తప్ప అన్యులు ప్రభువు సాన్నిధ్యమున ధూపము సమర్పింపరాదనుటకు ఇది హెచ్చరిక అయ్యెను. ఎవరైనను ఇి్ట కార్యమునకు తలపడెదరేని వారును కోరా వలెను, అతని అనుచరులవలెను సర్వనాశన మగుదురు. మోషే ద్వారా ప్రభువు ఎలియెజెరును ఆజ్ఞాపించిన రీతిగనే ఇది అంతయు జరిగెను.

అహరోను మనవి

41. ఆ మరునాడు యిస్రాయేలు సమాజమంతా మోషే, అహరోనుల మీద గొణిగి ”మీ వలన ప్రభువు ప్రజలకు ఇంతి ముప్పువాిల్లినదిగదా!” అనెను.

42. ఈ రీతిగా ప్రజలు మోషే, అహరోనులమీద తిరుగబడగా వారిరువురును సమావేశపు గుడారము వైపు చూచిరి. అపుడు మేఘము గుడారమును క్రమ్ముకొనగా, ప్రభు సాన్నిధ్యపు ప్రకాశము ప్రత్యక్ష మయ్యెను. 43. మోషే, అహరోనులు సాన్నిధ్యపు గుడారము ఎదుటకు వచ్చిరి.

44-45. ప్రభువు మోషేతో ”మీరు ఈ ప్రజల నడుమ నుండి ప్రక్కకు తొలగుడు. వీరిని నేను ఉన్న వారినున్నట్లుగా క్షణములో నాశనము చేసెదను” అనెను. వెంటనే మోషే, అహరోనులు నేలపై బోరగిల బడిరి.

46. మోషే అహరోనుతో ”నీ ధూపకలశమును బలిపీఠముమీది నిప్పుకణికలతో నింపి సాంబ్రాణి వేయుము. నీవు త్వరత్వరగా ప్రజల యొద్దకు వెళ్ళి వారికొరకు ప్రాయశ్చిత్తము చేయుము. ప్రభువు కోపము ప్రజ్వరిల్లినది. అంటురోగము ప్రారంభమైనది” అనెను.

47. అహరోను మోషే ఆజ్ఞాపించినట్లే ధూప కలశము గైకొని గబగబ ప్రజల యొద్దకు వెళ్ళెను. కాని అప్పికే ప్రజలకు అంటురోగము సోకి యుండెను. అతడు ధూపమున సాంబ్రాణి వేసి ప్రజల పాపమునకు ప్రాయశ్చిత్తము చేసెను.

48. అహరోను చనిపోయినవారికి బ్రతికియున్నవారికి నడుమ నిలువబడగా అంటురోగము ఆగిపోయెను. 49. కోరా తిరుగుబాటువలన చచ్చినవారుకాక ఈ తెగులు వలన మడిసినవారు 14,700 మంది.

50. ఈ విధముగా అంటురోగము సమసి పోయినపిదప అహరోను సాన్నిధ్యపుగుడారము ద్వారమునొద్దనున్న మోషేను తిరిగి కలసికొనెను.

Previous                                                                                                                                                                                                   Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము