1 1. యోతాము, ఆహాసు, హిజ్కియా యూదాకు రాజులుగానున్న కాలమున, మోరెషెత్‌ పురవాసి  అయిన మీకాకు ప్రభువు ఈ సందేశమును దర్శనమున తెలియజేసెను. ప్రభువు సమరియా, యెరూషలేము లను గూర్చి ఈ సంగతులనెల్ల తెలియపరచెను.

యిస్రాయేలునకు శిక్ష

సమరియా, యెరూషలేముల గూర్చి విలాపము

2.           సమస్తజాతి ప్రజలారా!

               ఈ విషయమును ఆలింపుడు.

               భూమిపై వసించు సమస్త జనులారా!

               ఈ సంగతి వినుడు.

               ప్రభువు మీకు ప్రతికూలముగా

               సాక్ష్యమీయనున్నాడు.

               ఆయన తన పవిత్రమందిరమునుండి

               మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.

3.           ఇదిగో!

               ప్రభువు తన పవిత్రనివాసమునుండి

               కదలివచ్చుచున్నాడు. ఆయన క్రిందికి దిగివచ్చి

               పర్వతములపై నడచును.

4. ఆయన పాదముల క్రింద కొండలు

               నిప్పుసోకిన మైనమువలె కరిగి,

               పర్వతము మీదినుండి

               పారెడు నీళ్ళవలె క్రింది లోయలోనికి పారును.

5.           యాకోబు సంతతి పాపముచేసి

               దేవునిపై తిరుగబడిరి.

               కావున ఇదంతయు జరుగును.

               యిస్రాయేలీయుల పాపములకు కారకులెవరు?

               సమరియా కాదా!

               యూదాలో ఉన్నతస్థలములుఎక్కడివి?

               యెరూషలేములోనివికావా!

6.           కావున ప్రభువిట్లు చెప్పుచున్నాడు:

               ‘నేను సమరియాను పొలములోని

               రాళ్ళకుప్పనుగా చేయుదును.

               ద్రాక్షలు నాటెడు తావునుగా చేయుదును.

               దాని పునాదులు బయల్పడునట్లు

               దాని కట్టుడురాళ్ళను పెరికివేసి

               లోయలో పడవేయుదును.

7.            సమరియాయందలి విగ్రహములను

               పగులగొట్టుదురు.

               దాని విగ్రహములకిచ్చిన కానుకలు

               నిప్పుపాలగును.

               అది పెట్టుకొనిన చెక్కుడుప్రతిమలు

               ముక్కలు ముక్కలగును.

               వేశ్యలకిచ్చిన కానుకలతో

               సమరియా వీనినెల్ల ప్రోగుజేసెను.

               కావున విరోధులిపుడు వీనిని కొనిపోయి

               వేశ్య జీతముగానే వానిని మరల ఇత్తురు.

8.           మీకా ఇట్లనెను:

               ఈ కారణముచే నేను దిగులుతో విలపింతును.

               ఏమియులేకుండా, దిగంబరుడనై తిరుగుదును.

               నక్కవలె అరతును, నిప్పుకోడివలె మూల్గుదును.      

9.           సమరియా గాయములు మానవు.

               యూదాకును ఇి్ట దుర్గతియే పట్టును.

               నా ప్రజలు వసించు యెరూషలేము

               గుమ్మములనే వినాశనము తాకెను.

నిమ్న ప్రదేశ పట్టణములను గూర్చిన విలాపము

10.         గాతులోని విరోధులకు

               మన పరాజయమును ఎరిగింపకుడు

               అచట ఎంతమాత్రమును ఏడ్వవలదు

               బేత్లెయాఫ్రలో నేను ధూళిలోపడి పొర్లితిని.

11. షాఫీరు పౌరులారా!

               మీరు దిగంబరులై సిగ్గుతో ప్రవాసమునకు పొండు.

               జానాను పౌరులారా!

               మీరు నగరమునుండి బయికిరావలదు.

               మీరు బేతేజెలు ప్రజల విలాపమును ఆలించునపుడు

               మీకు అచట ఆశ్రయము దొరకదని గ్రహింపుడు.   

12.          ప్రభువు వినాశనమును

               యెరూషలేము గుమ్మములోనికి కొనివచ్చెను.

               కనుక మారోతు ప్రజలకిక ఆశలేదు.

13.          లాకీషు ప్రజలారా!

               మీ రథములకు పోరు గుఱ్ఱములను కట్టుడు.

               మీరు యిస్రాలీయులవలెనే పాపముచేసితిరి.

               యెరూషలేమునుగూడ

               పాపమునకు పురికొల్పితిరి.

14.          యూదావాసులారా!

               మీరు మోరెషెత్‌-గాతుకు వీడ్కోలు చెప్పుడు.

               యిస్రాయేలు రాజులకు

               అక్సీబునుండి సాయము లభింపదు.

15.          మారేషా వాసులారా!

               ప్రభువు మిమ్ము శత్రువుపాలుచేయగా

               ఆయన మీ నగరమును స్వాధీనము చేసికొనును.

               యిస్రాయేలు నాయకులు వెడలిపోయి

               అదుల్లాము గుహలో దాగుకొందురు.

16.          యూదా ప్రజలారా!

               మీకు ప్రీతిపాత్రులైన బిడ్డలకొరకు

               దుఃఖించుచు తల గొరిగించుకొనుడు.

               మీ బిడ్డలను ప్రవాసమునకు కొనిపోవుదురు

               కాన మీరు రాబందువలె తలలు బోడిచేసికొనుడు.

Previous                                                                                                                                                                                                      Next