నెహెమ్యా మీద కుట్రలు, ప్రాకారము పూర్తియగుట

6 1. సన్బల్లటు, తోబియా, గేషెము, ఇంక ఇతర శత్రువులు మేము ప్రాకారమును క్టి ముగించితి మనియు, దాని బీటలన్నింని పూడ్పించితిమనియు వినిరి. అప్పికింకను మేము ద్వారములకు తలుపులు పెట్టలేదు.

2. సన్బల్లటు, గేషెము ”ఓనో మైదానమున ఒక నిర్ణీత గ్రామమున మనమందరము కలసి కొందము రమ్ము” అని నాకు కబురుప్టిెరి. నాకు కీడుచేయుటకు వారు పన్నినకుట్ర యిది.

3. నేను వారిచెంతకు దూతలనంపి నేనిక్కడ మహత్తరకార్య మునందు నిమగ్నుడనైయున్నాను. కనుక మీ చెంతకు రాజాలను. నేను మీయెద్దకు వచ్చినచో ఇక్కడి పని కుంటు పడిపోవును. మా పనికి అంతరాయము కలిగించుకోవలసిన అవసరమేమి వచ్చినది?” అని బదులిచ్చితిని.

4. వారు నాకు నాలుగు మార్లు అదే సందేశము పంపగా, నేనును అదే విధముగా ప్రత్యుత్తరమిచ్చితిని.

5. ఐదవ మారు సన్బల్లటు జాబునిచ్చి తనసేవకుని పంపెను. ఆ జాబు ముడిచి ముద్రవేసినది కాదు.

6. అందలి సమాచారమిది: ”నీవు, మీ యూదులు రాజుపై తిరుగబడుటకే ఆ ప్రాకారమును క్టించుచున్నారని ఇరుగు పొరుగువారు అనుకొనుచున్నారట. ఇది గేషెము నాకు విన్పించిన వార్త. నీవు రాజు కావలెనని కోరుకొనుచున్నావట.

7. పైగా నీవే యూదాకు రాజువని యెరూషలేమున ప్రచారము చేయుటకుగాను ప్రవక్తలను గూడ నియ మించితివట. ఈ వార్తలు రాజు చెవికెక్కుట తథ్యము. కనుక నీవిటకు వచ్చి ఈ సంగతులెల్ల మాతో చర్చించి పొమ్ము.”

8. నేనతనికి ప్రతివార్త పంపి, ”నీ మాటలు నిజముకావు. వీనినెల్ల నీవే కల్పించితివి”అని చెప్పించితిని.

9. ఈ రీతిగా మమ్ము బెదర గ్టొినచో మేము విసిగిపోయి పని ఆపివేయుదుమని, ఆ మీద ఈ గోడ యిక ముగియదని వారి తలపు. ‘ప్రభూ! నీవు మాత్రము నాకు బలమును ప్రసాదింపుము!’

10. ఇదే సమయమున నేను మహెతబేలు మను మడును దెలాయా కుమారుడునగు షెమయాను చూడబోయితిని. అతడు నిర్బంధింపబడుటచే నన్ను స్వయముగా కలువజాలకుండెను.అతడు నాతో ”మన మిరువురము పారిపోయి దేవాలయ గర్భగృహమున దాగికొని తలుపులు బిగించుకొందము. వారు నిన్ను చంపుటకు ఈ రాత్రియే వత్తురు” అని పలికెను.

11.కాని నేనతనితో ”నావింవాడు పారిపోయి దేవాలయమున దాగికొని ప్రాణములు రక్షించుకొను టయా? నేన్టి పని చేయను” అని చెప్పితిని.

12. అసలు ప్రభువతనిని ఇి్ట ప్రవచనము చెప్పుమని అననేలేదు. అతడు తోబియా సన్బల్లటులయొద్ద డబ్బు పుచ్చుకొని య్టిిి సందేశము విన్పించెనని నేను గ్రహించితిని.

13. వారతనితో కుదుర్చుకొని నన్ను భయప్టిెంచి, నా చేతపాపము చేయింపజూచిరి. ఆ మీదట నా పేరు చెడగ్టొి, నన్ను అవమానపరప వచ్చును గదా! అని వారి పన్నాగము.

14. ప్రభూ! తోబియా, సన్బల్లటులు చేసిన ఈ దుష్కార్యమును జ్ఞప్తియందుంచుకొనుము. వారిని శిక్షింపుము. నన్ను భయపెట్టజూచిన ఆ ప్రవక్తి నోవద్యాను మరియు ఈ  ఇతర ప్రవక్తలను మరచిపోకుము.

15. ఏబది రెండు రోజులు పనిచేసిన తరువాత ఏలూలు నెలలో ఇరువదియైదవనాడు గోడ ముగి సెను.

16. మా శత్రువులు మాచుట్టుపట్లనున్న జాతులు గోడ ముగిసినదని విని చాల అధైర్యపడిరి. ఏలయన వారెల్లరు ప్రభువు మహాత్మ్యము వలననే ఈ పని జరిగినదని తెలిసికొనిరి.

17. ఈ కాలమున యూదా పెద్దలు చాలమంది తోబియాతో ఉత్తరప్రత్యుత్తరములు జరుపుచుండిరి.

18. యూదా పెద్దలు చాలమంది అతని కోపు తీసు కొనిరి. ఎందుకన  అతడు ఆరా కుమారుడగు షెకన్యాకు అల్లుడు. ఇదియునుగాక, తోబియా కుమారుడగు యోహానాను, బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను పెండ్లియాడెను.

19. ఆ పెద్దలు తోబియా చేసిన మంచిపనులెల్ల నా ఎదుట వల్లించెడివారు. నేను పలికిన పలుకులు మరల అతని చెవిలో పడవే సెడివారు. నన్ను బెదిరించుటకొరకు అతడు జాబు తరువాత జాబువ్రాసెడివాడు.

Previous                                                                                                                                                                                                  Next