ఉపోద్ఘాతము:

పేరు: సమూవేలు మొది గ్రంథము వివరణ చూడుము.

కాలము: దావీదు పరిపాలనాకాలము క్రీ.పూ. 1010-970.

చారిత్రక నేపథ్యము: దావీదు రాజ్యాధికారము చేపట్టు సమయమునకు ఫిలిస్తీయులు యిస్రాయేలు భూభాగములోనికి చొచ్చుకొనివచ్చిరి. యిస్రాయేలు తెగలమధ్య పిష్టమైన సమైక్యతలేక దేశమునందు రాజకీయ స్థిరత్వము కొరవడియుండెను. సౌలు మరణంతో విచారములో మునిగియుండ, చుట్టుప్రక్కల శత్రువులుకూడ కారాలుమిరియాలు నూరుతున్నారు. ఈ నేపథ్యములో దావీదు రాజ్యపాలన చేప్టి దేవుని నిబంధన ప్రకారము ప్రజలందరిని ఒకే ప్రజగా తీర్చిదిద్ధి యావేదేవునిపట్ల భయభక్తులు నిలిపి మతోద్ధరణ, రాజకీయ స్థిరత్వము నెలకొల్పాల్సిన ఆవశ్యకత వున్నది. దేవుని వాగ్ధానము నెరవేరవలసియున్నది.

ముఖ్యాంశములు: దావీదు రాజ్యపరిపాలన చరిత్ర, తద్వారా దావీదు వ్యక్తిత్వము తెలుసుకొనెదము. దేవునియెడల యదార్ధముగా మెలగవలసిన రీతిని తెలుసుకొనగలము. రాజును మలచడంలో దేవుని పాత్రను గుర్తించగలము. గాదు, నాతాను ప్రవక్తల ప్రవచనాలను చూచెదము. ‘దేవునిఆత్మ’ దావీదును ప్రేరేపించడము చూచెదము. పాపము, పాపపు పర్యవసానాలను గుర్తించగలము.

క్రీస్తుకు అన్వయము: క్రీస్తు దావీదు కుమారునిగా గణుతికెక్కెను. దావీదు దేవాలయమునకు స్థలము గాదు ప్రవక్తద్వారా దేవుడు చూపించిన తావున నిర్ధారించుట. దావీదు పాపక్షమాపణ పొందడము  క్రీస్తు క్షమాతత్వాన్ని సూచించును. దేవుడు తానే దావీదునకు ఇల్లు (దావీదు వంశము) కట్టుదునని మాట ఇవ్వడము గుర్తించదగినది (7:7.13).  క్రీస్తే ఆ ఇల్లుగా నిలుచును. క్రీస్తు దావీదుని కుమారుడుగా పిలువబడడము గమనార్హము.

 

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము