ఉపోద్ఘాతము:

పేరు: ఈ గ్రంథము పేరు ‘ఆదికాండము’. హీబ్రూ బైబులులో ఈ గ్రంథమునందలి ఆరంభపదము ‘ఔజూష్ట్రజూఐకజూజూఊక’ ఆధారముగా ‘ఆదికాండము’ అని పిలువబడుచున్నది. ‘ఆది’ అనగా ‘ప్రారంభము’ లేదా ‘మూలకారణము’ అని అర్థము. ”కాండము” అనగా గ్రంథము. పంచకాండములలోని ఐదు గ్రంథముల పేరులలోని రెండవ పదము ”కాండము” ప్రతి గ్రంథము పేరునకు జతపదముగా ఉన్నది.   

కాలము: దాదాపు. క్రీ.పూ. 18వ-17వ శతాబ్దముల కాలవ్యవధి.

రచయిత(లు): మోషే వ్రాసెనని సాంప్రదాయక అభిప్రాయము. ఈ పంచకాండములు (ఆది, నిర్గమ, లేవీయ, సంఖ్యా, ద్వితీయోపదేశ) క్రీ.పూ.6వ శతాబ్దములో బబులోనియా ప్రవాసానంతరము సంకలనము చేయబడెనని పలువురు ఆధునిక పండితుల అభిప్రాయము.

ముఖ్యాంశములు: ఈ గ్రంథమును విషయాంశములను బ్టి రెండు భాగములుగా విభజించవచ్చును. మొది భాగము: 1-11 అధ్యాయాలు – సృష్టికథనము, రక్షణ వాగ్ధానము, మానవజాతి మరియు తదనుగుణముగ పాపవిస్తరణము అను అంశములను సూచించగా, రెండవ భాగము: 12-50 అధ్యాయాలు రక్షణనిబంధన ప్రణాళిక ఆరంభమును, దాని కొనసాగింపును వివరించును.

క్రీస్తుకు అన్వయము: క్రీస్తు ప్రభువును ఈ గ్రంథములోని- తొలి రక్షణ వాగ్ధానము. (3:15);  అబ్రహాము ఒడంబడిక (12:3); ఈసాకు బలియర్పణ (22:1-13); యాకోబు దీవెన (49:9-10) మున్నగు సందర్భములలో గుర్తింపవచ్చును.

Previous                                                                                                                                                                                                Next                                                                             

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము