రాజ్య విభజనము
షెకెము వద్ద సమావేశము
12 1. రెహబాము షెకెమునకు వెళ్ళెను. యిస్రా యేలీయులందరు అతనికి ప్టాభిషేకము చేయుటకై అచట ప్రోగయిరి.
2. నెబాతు కుమారుడు యరోబాము సొలోమోనుచెంతనుండి పారిపోయి ఐగుప్తున వసించు చుండెనుగదా! అతడు ఈ వార్తలువిని ఐగుప్తునుండి తిరిగివచ్చెను.
3-4. యిస్రాయేలీయులు రెహబాముతో ”నీ తండ్రి సొలోమోను మా నెత్తిన పెద్దభారము మోపెను. నీవు ఈ బరువును తొలగింతువేని మేము నీకు దాసులమైయుందుము” అనిరి.
5. రెహబాము ప్రజలతో ”మూడు దినములయిన తరువాత నన్ను కలిసికొండు” అని చెప్పగా వారందరు వెడలిపోయిరి.
6. అంతట రెహబాము తన తండ్రి సొలోమోను నకు కొలువుచేసిన వృద్ధులను పిలిపించి ఈ ప్రజలకేమి సమాధానము ఈయవలెనో చెప్పుడనెను.
7. వారు అతనితో ”నీవు ఈ జనులకు సేవచేయకోరెదవేని ఇపుడు వీరికి ప్రీతికలుగునట్లు మ్లాడుము. ఆ మీదట వీరు జీవితాంతము నీకు బానిసలైయుందురు” అని చెప్పిరి.
8. కాని రెహబాము ఆ వృద్ధుల ఆలోచ నను త్రోసిపుచ్చి తనతోపెరిగి తనకు కొలువు చేయు చున్న యువకులను ఉపదేశమడిగెను.
9. ”ఈ ప్రజలు తమ బరువును తొలగింపుమని అడుగు చున్నారు, నేను వీరికేమి బదులు ఈయవలయునో తెలియచెప్పుడు” అనెను.
10. వారతనిని చూచి ”నీవు ఈ ప్రజలతో ‘మా తండ్రి నడుముకంటె నా చికెన వ్రేలు లావుగలది.
11. మా తండ్రి మీపై పెద్దబరువు మోపినచో నేనంతకంటె పెద్దబరువునే మోపెదను. అతడు మిమ్ము చండ్రకోలలతో క్టొించినచో నేను మిమ్ము కొరడాలతో బాధించెదను’ అని చెప్పుము” అని పలికిరి.
12. మూడురోజులైనపిమ్మట రెహబాము కోరి నట్లే యిస్రాయేలీయులందరు అతనివద్దకు వచ్చిరి.
13. రెహబాము పెద్దలఉపదేశము త్రోసిపుచ్చి ప్రజలను నొప్పించే విధముగా మ్లాడెను.
14. అతడు తన మిత్రులైన యువకుల మాటలువిని ప్రజలతో ”మా తండ్రి మీపై పెద్దబరువును మోపినచో నేనంత కంటె పెద్దబరువునే మోపెదను. అతడు మిమ్ము చండ్ర కోలలతో క్టొించినచో నేను మిమ్ము కొరడాలతో బాధించెదను” అనెను.
15. ఈ రీతిగా రెహబాము ప్రజల మనవిని త్రోసిపుచ్చుట యావే నిర్ణయించిన కార్యము. ప్రభువు షిలో నివాసియగు అహీయా ముఖ మున యరోబామునకు చేసిన వాగ్ధానమును నెరవేర్చు టకే ఇట్లు జరిగెను.
16. రెహబాము తమ మనవిని విననందున ప్రజలు
”మనకు దావీదు సొత్తులో పాలులేదు,
యిషాయి కుమారుని వారసమున పొత్తులేదు,
మన నివాసములకు మనము
వెడలిపోవుదము రండు.
ఇక దావీదు వంశీయులు
వారి తిప్పలు వారు పడుదురుగాక!”
అని పలికి వెడలిపోయిరి.
17. రెహబాము యూదా రాజ్యములోని యిస్రాయేలీయులకు రాజయ్యెను.
18. అతడు వ్టెిచాకిరి చేయువారికి పర్యవేక్షకుడుగా నున్న అదోరామును తిరుగుబాటుదారులమీదికి పంపెను గాని వారతనిని రాళ్ళతో క్టొిచంపిరి. రెహబాము గబగబ రథమెక్కి యెరూషలేమునకు పారి పోవలసివచ్చెను. 19. అప్పినుండి యిస్రాయేలీ యులు దావీదు వంశీయుల ఏలుబడిలో లేరు.
రాజ్యవిభజన
20. యిస్రాయేలీయులు యరోబాము ఐగుప్తు నుండి తిరిగివచ్చెనని విని అతనిని తమ సమావేశము నకు పిలిపించి రాజుగా అభిషేకించిరి. యూదాతెగ మాత్రమే దావీదువంశీయులకు లొంగియుండెను.
21. రెహబాము యెరూషలేమునకు మరలివచ్చి యూదా, బెన్యామీను తెగలనుండి నూటఎనుబది వేల మంది వీరులను ప్రోగుచేసికొని యిస్రాయేలీయుల మీదికి దాడివెడలెను.
22-24. కాని ప్రభువు తన ప్రవక్తయైన షెమయాతో ”నీవు వెళ్ళి సొలోమోను కుమారుడు, యూదా రాజునగు రెహబాముతోను, యూదా బెన్యామీను తెగలకుచెందిన యిస్రాయేలీ యులతోను, ‘మీ సోదరులైన యిస్రాయేలీయుల మీదికి యుద్ధమునకు పోవలదు. ఇది నేను నిర్ణ యించిన కార్యము కనుక మీరందరు వెనుకకు మరలి పొండు’ అని చెప్పుము” అని పలికెను. యూదీయు లందరు ప్రభువు మాట పాించి వెనుదిరిగిపోయిరి.
మత విభజన
25. యరోబాము ఎఫ్రాయీము మండలమున నున్న షెకెము అను పట్టణమును క్టించి, అచట కొన్నాళ్ళు నివసించెను. తరువాత అతడు పెనూవేలు పట్టణమును నిర్మించెను.
26-27. అతడు తనలో తాను ”ఈ ప్రజలు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి అచట ప్రభువునకు బలులర్పింతురేని వారు యూదారాజయిన రెహబామునే రాజుగా అంగీకరించి నన్ను చంపివేయవచ్చును” అనుకొనెను.
28. ఇట్లు తలపోసి అతడు రెండు బంగారు కోడెదూడలను చేయించెను. తన ప్రజలతో ”మీరు యెరూషలేమునకు వెళ్ళుట ఇక చాలింపుడు. మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చిన దైవములు వీరే, చూడుడు” అనెను!.
29. అతడు ఒక బంగారుదూడను బేతేలునను, మరి యొకదానిని దానునందును నెలకొల్పెను.
30. ఇట్లు చేయుట ప్రజలకు పాపకారణమయ్యెను. వారు ఆ దైవములను ఆరాధించుటకు బేతేలునకు, దానునకు వెళ్ళెడివారు.
31. యరోబాము ఉన్నతస్థలములపై మందిరములనుకూడ నిర్మించెను. లేవీతెగకు చెందని సామాన్యకుటుంబమునుండియే ఆ మందిరములకు యాజకులను నియమించెను.
32. యరోబాము యూదామండలమునవలె యిస్రాయేలు సీమలోకూడ ఎనిమిదవనెల పదునైదవ దినమున ఒక పండుగను నెలకొల్పెను. అతడు బేతేలున తాను నెలకొల్పిన బంగారు దూడలకు బలులు అర్పించెను. ఉన్నతస్థలములో యాజకులుగా తాను నియమించిన వారినే బేతేలున కూడ యాజకులనుగా చేసెను.
33. అతడు తనకు తానుగా నియమించుకొనిన ఎనిమిదవనెల పదునైదవ దినమున బేతేలునకువెళ్ళి పండుగజరిపి బలిపీఠముపై బలులను అర్పించెను. మరియు యిస్రాయేలువారికి ఒక పండుగను నిర్ణయించి, ధూపము వేయుటకై తానే బలిపీఠము నెక్కెను.