మోషే యిస్రాయేలు తెగలను దీవించుట

33 1. దైవభక్తుడైన మోషే తాను చనిపోక ముందు యిస్రాయేలు ప్రజలను ఇట్లు దీవించెను:

2. ”ప్రభువు సీనాయి నుండి వచ్చెను.

               ఆయన సేయీరు కొండమీద

               సూర్యునివలె ఉదయించెను.

               పారాను కొండమీద ప్రకాశించెను.

               ఆయన వేవేల పరిశుద్ధ

               సమూహములనుండి వచ్చెను.

               ఆయన కుడివైపున నిప్పుమంటలు మెరసెను.

3. ప్రభువు తన ప్రజలను ప్రేమించును.

               తన వారిని రక్షించును.

               మనము ఆయన పాదములచెంతకేగుదము.

               ఆయన ఆజ్ఞలకు బద్ధులమగుదుము.

4. మోషే మనకు ధర్మశాస్త్రమును ఇచ్చెను.

               యిస్రాయేలు ప్రభువుప్రజ అయ్యెను.

5. యిస్రాయేలు తెగలు

               వారి నాయకులు సమావేశముకాగా,

               ప్రభువు వారికి రాజయ్యెను.

6. ”రూబేను తెగవారు

               కొద్దిమందియే అయినను

               వారెన్నికిని నశింపకుందురుగాక!”

7. యూదా తెగను గూర్చి మోషే ఇట్లుపలికెను:

               ”ప్రభూ! వారి వేడికోలును ఆలింపుము.

               వారిని ఇతర తెగలతో చేర్పుము.

               నీవు వారి పక్షమున పోరాడుము.

               శత్రువుల నుండి వారిని కాపాడుము.”

8. లేవీ తెగను గూర్చి అతడిట్లు పలికెను:

               ప్రభూ! నీ తుమ్మీము, నీ ఉరీము

               నీ భక్తుడును, మస్సా మెరిబా జలములవద్ద 

               నీచే పరీక్షింపబడిన లేవికి ఇమ్ము.

9. వారు తమ తల్లిదండ్రులకంటె, సోదరులకంటె,

               బిడ్డలకంటె నిన్నధికముగా ప్రేమించిరి.

               వారు నీ యాజ్ఞలను పాించిరి.

               నీ ధర్మశాస్త్రమునకు విధేయులైరి.

10. వారు నీ ఆజ్ఞలు యిస్రాయేలునకు బోధింతురు.

               నీ సాన్నిధ్యమున ధూపము వేయుదురు.

               నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పింతురు.

11. ప్రభూ! నీవు వారిని దీవింపుము.

               వారి కైంకర్యములను అంగీకరింపుము.

               వారి శత్రువులను తునుమాడి,

               వారు మరల తలయెత్తకుండునట్లు చేయుము.”

12. బెన్యామీను తెగను గూర్చి అతడిట్లు పలికెను:

               ”ప్రభువు ఈ తెగవారిని ప్రేమించును.

               దినదినము వారిని సంరక్షించును.

               తాను వారినడుమ నెలకొనియుండును.”

13. యోసేపు తెగను గూర్చి అతడిట్లు పలికెను:

               ”ప్రభువు వానలతో, భూగర్భజలములతో

               వారి పొలములను దీవించుగాక!

14. అన్ని ఋతువులందును వారి పొలములు

               సూర్యరశ్మిసోకి సమృద్ధిగా పండునుగాక!

15. పురాతనములైన వారి కొండలు

               పండ్లతో నిండియుండునుగాక!

16. వారి పొలములు చక్కగా పండునుగాక!

               పొదలో కనిపించిన దేవుడు

               వారిని దీవించునుగాక!

               సోదరులకు యోసేపు నాయకుడయ్యెను గనుక,

               అతని తెగకు ఈ దీవెనలన్నియు లభించుగాక!

17. యోసేపుతెగ వృషభమువలె బలమైనది.

               వారి బలము

               అడవిఎద్దు కొమ్ముల బలమువింది.

               ఆ కొమ్ములతో వారు శత్రువులనుకుమ్మి,

               దిగంతములకు న్టెివేయుదురు.

               ఎఫ్రాయీము తెగలోని

               పదివేలమందిజనులు,

               మనష్షేతెగలోని వేయిమందిప్రజలు

               అి్ట బలవంతులు.”

18. సెబూలూను తెగను గూర్చి అతడిట్లు పలికెను:

               ”సెబూలూను తెగవారు

               సముద్రవ్యాపారముతో వృద్ధిచెందుదురుగాక!

               యిస్సాఖారు సంపద

               ఇంిపట్టుననే పెంపుచెందునుగాక!

19. వారి పర్వతముమీద

               ప్రజలు ప్రార్థనకు ప్రోగగుదురు.

               వారచట నీతిబలులర్పింతురు.

               వారి సంపదలు సముద్రమునుండియు

               దాని అంచుననున్న

               ఇసుకదిబ్బలనుండియు లభించును.”

20. గాదు తెగను గూర్చి అతడిట్లు పలికెను:

               ”వారి మండలమును సువిశాలముచేసిన

               ప్రభువు స్తుతింపబడునుగాక!

               వారు సింహమువలె పొంచియుండి,

               శత్రువుల చేతులనో, తలలనో పెరికివేయుదురు.

21. ఆ తెగవారికి మంచిభూములు లభించినవి.

               వారికి నాయకుల భాగము దక్కినది.

               వారు ప్రభువు న్యాయమును,

               విధులను పాించిరి

               కనుక ఆయన ప్రజకు నాయకులైరి.”

22. దాను తెగను గూర్చి అతడిట్లు పలికెను:

               దానుతెగ సింగపుకొదమవలె

               బాషాను నుండి కుప్పించి దుముకును.

23. నఫ్తాలి తెగను గూర్చి అతడిట్లు పలికెను:

               ”ప్రభువు వారిని సమృద్ధిగా దీవించెను.

               సముద్రము మరియు దక్షిణమువరకు

               వారి ప్రాంతము వ్యాపించినది.”

24. ఆషేరు తెగను గూర్చి అతడిట్లు పలికెను:

               ”అన్ని తెగలకంటెను

               ఆషేరు అధికముగా దీవెనలందెను.

               సోదరులలో ఆ తెగవారు అగ్రగణ్యులు.

               వారి పొలమున 

               ఓలివుతోటలు పెంపుచెందును.

25. వారి పట్టణములు ఇనుప కవాటములతోను,

               ఇత్తడి కవాటములతోను సురక్షితములగునుగాక!

               కలకాలము వారు భద్రముగా జీవింతురుగాక!”

26. యిస్రాయేలూ వినుము!

               మీ దేవునివిం దేవుడు మరియొకడులేడు.

               ఆయన వైభవముతో ఆకసమున స్వారిచేయును. మేఘములపై ఎక్కివచ్చి మిమ్ము రక్షించును.

27. పురాతనుడైన ప్రభువు మీకు రక్షణము.

               ప్రాచీనములైన ఆయన బాహువులు మీకురక్ష.

               ఆయన మీ శత్రువులనెల్ల తరిమివేసెను.

               వారిని నాశనము చేయుడని మీతో చెప్పెను.

28. కనుక యాకోబు సంతతి

               సురక్షితముగా జీవించును.

               వారి పొలమున ధాన్యము,

               ద్రాక్షసారాయము కొల్లలుగా లభించును.

               అచట సమృద్ధిగా వానలు కురియును.

29. యిస్రాయేలూ! మీరెంత ధన్యాత్ములు!

               మీవలె విజయము పొందినవారెవరు?

               ప్రభువు మీకు రక్షణమునిచ్చు డాలు,

               మీకు విజయము ప్రసాదించు ఖడ్గము,

               మీ శత్రువులువచ్చి,

               మిమ్ము కపటముగా శరణువేడగ

               మీరు వారి ఉన్నతస్థలములను

               త్రొక్కుదురు.”

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము