తూరుమీద శోకగీతము

27 1. ప్రభువు వాణి నాతో ఇట్లనెను: 2. ”నర పుత్రుడా! తూరుమీద శోకగీతము వినిపింపుము.

3. సముద్రపురేవుల మీద నెలకొనియుండి పెక్కు ద్వీప ములతో వర్తకముచేయు తూరుతో ఇట్లు చెప్పుము: యావే ప్రభువు వాక్కిది:

               తూరు!

               నీవు నీ మహా సౌందర్యమునకు గర్వపడితివి.

4.           నీవు సముద్రమున నెలకొనియుింవి.

               నిన్ను నిర్మించినవారు

               నిన్ను సుందరమైన నావవలె క్టిరి.

5.           వారు నీ పలకలను చేయుటకు

               సేనీరు కొండనుండి తమాలములు తెచ్చిరి.

               నీ స్తంభములను చేయుటకు 

               లెబానోను కొండనుండి దేవదారులు తెచ్చిరి.

6.           బాషాను సింధూరములతో నీ తెడ్లను చేసిరి.

               కిత్తీము దేవదారులతో నీ ఉపరిభాగమును

               చేసి దానిని దంతముతో పొదిగిరి.

7.            నీ తెరచాపలను బ్టుాలు వేసిన

               ఐగుప్తు నారవస్త్రములతో చేసిరి.

               వానిని దూరమునుండియే గుర్తింపవచ్చును.

               నీ పై కప్పును ఎలీషా ద్వీపమున

               తయారైన ముదురు కెంపువన్నె

               వస్త్రములతో తయారుచేసిరి.

8.           నీకు తెడ్లువేయువారు సీదోను,

               అర్వదు నగరముల నుండి వచ్చిరి.

               నేర్పరులైన నీ ప్రజలే నీ నావికులు.       

9.           గెబాలున తర్ఫీదు పొందినవారు నీ వడ్రంగులు

               నావలలో సముద్రయానము చేయు

               నావికులెల్లరు నీ సరుకులు కొనెడివారు.

10. పారశీకము, లూదు, పూతు దేశీయులు నీ సైన్యమునచేరిరి. వారు తమ డాళ్ళను, శిరస్త్రాణము లను నీశిబిరములలో వ్రేలాడ గ్టిరి. వారు నీకు కీర్తిని తెచ్చిప్టిెరి.

11. అర్వదు సైనికులు నీ ప్రాకారములకును, గమదు సైనికులు నీ బురుజులకును కావలికాసిరి. వారు తమ డాళ్ళను నీ గోడలపై వ్రేలాడగ్టిరి. వారు నిన్ను సుందరముగా తీర్చిదిద్దిరి.

12. నీవు తర్షీషుతో వర్తకము చేసి అచి వెండి, ఇనుము, తగరము, సీసములకు నీ వస్తుసముదాయ మును మారకము చేసితివి.

13. నీవు యావాను, తుబాలు, మెషెకు దేశములతో వర్తకము చేసితివి. నీ సరకులతో బానిసలను, కంచు పరికరములను కొనితెచ్చుకొింవి.

14. నీ వస్తువులతో బేత్తోగర్మా నుండి గుఱ్ఱములను, యుద్ధాశ్వములను, కంచరగాడి దలను కొనితెచ్చుకొింవి.

15. దెదాను ప్రజలు నీతో వర్తకము చేసిరి. తీర ద్వీపములందలి ప్రజలు నీకు ఏనుగు దంతమును, విలువైన కోవిదారు మ్రానునిచ్చి, నీ సరకులు పుచ్చుకొనిరి.

16. సిరియా ప్రజలు నీ నుండి పలురకములైన సరకులను తీసుకొని వానికి బదులుగా నీకు పచ్చలు, ఊదావన్నె బట్టలు, బ్టుాలు వేసిన ఉడుపులు, నారబట్టలు, పగడాలు, మాణిక్యాలు ఇచ్చిరి.

17. యూదా యిస్రాయేలు ప్రజలు గోధుమలు, తేనె, ఓలివుతైలము, గుగ్గిలము, అత్తిపండ్లు, సుగంధ ద్రవ్యములిచ్చి నీ వస్తువులను కొనిరి.

18. దమస్కు ప్రజలు పలురకములైన నీ సరకులకు గాను హెల్బోను ద్రాక్షరసము, తెల్లని ఉన్నినిచ్చిరి.

19. వారు నీ వస్తువు లకు గాను పోతపోసితీసిన ఇనుము, కసిందమూలిక, సుగంధపు చెరకు నిచ్చిరి.

20. దెదాను ప్రజలు నీ సరకులకు, జీనులకు వేయు వస్త్రములిచ్చిరి.

21. అరేబియా ప్రజలు, కేదారు రాజులు నీ వస్తువుల కొరకు గొఱ్ఱెపిల్లలు, పొట్టేళ్ళు, మేకలు ఇచ్చిరి.

22. షేబా, రామా వర్తకులు నీతో వర్తకముచేసి నీ సరకుల కొరకు బంగారము, రత్నములు, మేలైన సుగంధ ద్రవ్యములను ఇచ్చిరి.

23. హారాను, కన్నె, ఏదెను నగరములు, షెబా వర్తకులు, అష్షూరు, కల్మాదు నగరములు నీతో వర్తకముచేసిరి. 24. ఆ నగరముల ప్రజలు నీకు విలువగల దుస్తులును, ముదురు కెంపు రంగు వస్త్రములును, బ్టుాలు వేసిన ఉడుపులును, పలు రంగుల తివాచీలును, గ్టిగా అల్లిన త్రాళ్ళును, నూలు దారములును అమ్మిరి.

25. నీ సరకులను పెద్దపెద్ద తర్షీషు ఓడలలో కొనిపోయెడివారు.

               నీవు నిండుగా సామానులు  నింపిన

               సముద్రములోని ఓడవిందానవు.

26.        నీకు తెడ్లు వేయువారు

               నిన్ను సాగరములలోనికి నడిపించిరి.

               తూర్పుగాలి నిన్ను సాగరమధ్యమున బ్రద్దలు చేసెను.   

27.         విలువగల నీ సరకులును, నావికులును,

               నీ వడ్రంగులును, వర్తకులును, సైనికులెల్లరును

               నీవు ధ్వంసముకాగా,

               నీతోపాటు సముద్రమున మునిగిరి.

28.        నీట మునుగు నావికుల ఆర్తనాదములు

               సముద్రతీరమున ప్రతిధ్వనించెను.

29.        ప్రతి నావలోని నావికులును, తెడ్లువేయువారును

               తమ ఓడలను విడనాడి ఒడ్డుచేరిరి. 

30. వారు నీకొరకు

               ఘోరసంతాపముతో విలపించుచు

               తలపై దుమ్మెత్తి పోసికొందురు.

               బూడిదలోపడి పొర్లాడుదురు.

31.          నీవు మునిగినందుకు తలలు గొరిగించుకొని, గోనె తాల్చి విచారముతో విలపింతురు.

32. వారు నిన్ను గూర్చి విలాపగీతమును

               ఇట్లు       ఆలాపింతురు.

               తూరునకు సాి నగరమేది?

               నీటమునిగి నిశ్శబ్దముగానున్న పట్టణమా!

               నీకు సమమైన పట్టణమేది?

33.         నీ సరకులు సముద్రమున ప్రయాణము చేయునపుడు

               ఎల్లరి అక్కరలు తీర్చెడివి.

               విలువగల నీ వస్తువుల వలన

               రాజులు ధనవంతులైరి.

34.         కాని నీవిపుడు సముద్రమున బ్రద్దలైతివి.

               సాగరగర్భమున మునిగితివి.

               నీ సరకులు నీ నావికులు ఎల్లరును

               నీతోపాటు జలనిధిలో కలిసిపోయిరి.

35.        నీ దుర్గతిని గాంచి తీరవాసులెల్లరును భీతిల్లిరి.

               వారి రాజులు వెరగొందిరి.

               వారి మొగములు పాలిపోయెను.

36.        నీవు భీకరముగా అంతమొందితివి.

               శాశ్వతముగా కనుమరుగైతివి.

               లోకములోని వర్తకులెల్లరు నిన్ను గాంచి భీతిల్లిరి.”