ధన్యత్వము

14 1. ఏనాడును తప్పుగా మ్లాడని

               నరుడు ధన్యుడు.

               అతడు తాను పొరపాటు చేసితినేమో

               అని భయపడనక్కరలేదు.

2.           తన అంతరాత్మ తనను నిందింపనివాడును, 

               నమ్మకముతో జీవించువాడునగు

               నరుడు  ధన్యుడు.

ధనమును సద్వినియోగము చేసికోవలెను

3.           పిసినిగొట్టునకు సిరిసంపదలు తగవు.

               లోభికి సంపదతో ఏమి ప్రయోజనము?

4.           తాను అనుభవింపక సొమ్ము కూడబెట్టువాడు

               ఇతరుల కొరకే కూడబెట్టుచున్నాడు.

               అతని సొత్తుతో ఇతరులు

               హాయిగా బ్రతుకుదురు.

5.           తన కొరకు తాను ఖర్చు పెట్టుకొననివాడు

               ఇతరుల కొరకు ఖర్చుపెట్టడు.

               అతడు తన సొత్తును తానే అనుభవింపడు.

6.           తన కొరకు తాను ఖర్చు చేసికొననివానికంటె

               నికృష్టుడు లేడు.

               నీచబుద్ధికి తగిన శిక్షయే కలదు.

7.            లోభి మంచిని చేసినను

               యాదృచ్ఛికముగనే చేయును

               కాలక్రమమున అతని పిసినిగొట్టుతనము

               బయటపడును.

8.           పిసినారి అయిన నరుడు దుష్టుడు,

               అక్కరలో ఉన్నవారిని ఆదుకొనడు.

9.           పేరాశకలవాడు తనకు

               ఉన్నదానితో తృప్తిచెందడు.

               దురాశవలన అతని హృదయము

               కుదించుకొని పోవును.

10.         లోభి కడుపునిండ తినుటకు ఇష్టపడడు,

               కనుక చాలినంత భోజనము సిద్ధము చేసికొనడు.

11.           కుమారా! నీవు నీ స్థితికి

               తగినట్లుగా చూచుకొనుము. 

               ప్రభువునకు మేలికానుకలు అర్పింపుము.

12.          మృత్యువు నీ కొరకు వేచియుండదు.

               నీవేనాడు పాతాళము చేరుదువో నీకే తెలియదు.

13.          కనుక నీవు చనిపోక పూర్వమే

               నీ స్నేహితులపట్ల దయచూపుము.

               నీ శక్తికొలది వారికి ఈయగలిగినది ఇమ్ము. 

14.          ప్రతిదినము నీవు అనుభవింపగల్గినది

               అనుభవింపుము.

               ఉచితములైన నీ వంతు

               సుఖములను విడనాడకుము.

15.          నీ సొత్తును ఇతరులకు వదలనేల?

               నీవు కష్టపడి కూడబ్టెినది

               అన్యులు పంచుకోనేల?

16.          కనుక ఇచ్చిపుచ్చుకొనుచు,

               సుఖములను అనుభవింపుము.

               పాతాళలోకమున సుఖించుటకు 

               వీలుపడదుకదా!

17.          ప్రాణులెల్ల జీర్ణవస్త్రమువలె శిథిలమైపోవును.

               పురాతన నియమము ప్రకారము

               జీవకోికి మృత్యువుతప్పదు.

18.          గుబురుగా ఎదిగిన చెట్టుమీది ఆకులు కొన్ని పండి

               రాలిపోవుచుండగ మరికొన్ని చిగుర్చుచుండును

               అట్లే తరతరముల నరజాతికి సంభవించును.

               కొందరు చనిపోవుచుండగా

               మరికొందరు పుట్టుచుందురు.

19.          నరుడు సాధించిన ప్రతి కార్యము నశించును.

               ఆ కార్యముతోపాటు దానిని

               సాధించిన నరుడును గతించును.

జ్ఞాని ఆనందము

20.        విజ్ఞానమును మననము చేసికొనుచు

               చక్కగా ఆలోచించువాడు ధన్యుడు.

21.          విజ్ఞానమును అధ్యయనము చేయువాడు,

               దాని రహస్యముల నెరుగువాడు ధన్యుడు.         

22.        వేటగాడు మృగముకొరకు గాలించునట్లుగ

               అది పోవు త్రోవప్రక్కన  పొంచియుండునట్లుగా,

               నీవును విజ్ఞానమును వెదకుము.

23.         విజ్ఞానమను గృహపు గవాక్షమునుండి

               లోపలికి తొంగిచూడుము,

               దాని తలుపునొద్ద చెవియొగ్గి వినుము.

24.         విజ్ఞానమను ఇంి ప్రక్కనే

               నీ గుడారముపన్నుకొని

               దాని చేరువలోనే వసింపుము.

25.        దానిచెంత శిబిరము పన్నుకొనుటఅనగా

               శ్రేష్ఠమైన తావున వసించుటయే.

26.        నీ బిడ్డలను విజ్ఞానవృక్షపు నీడలో వసింపనిమ్ము.

               నీవు దాని క్రొమ్మల క్రింద కాపురము చేయుచు

27. ఎండను తప్పించుకొనుము.

               తేజోమయమైన

               ఆ చెట్టుసన్నిధిలో సచేయుము.