15 1. కొంతకాలమైన తరువాత గోధుమ పంట కాలమున సంసోను భార్యను చూడబోయెను. ఆమె కొరకు ఒకమేకపిల్లను బహుమానముగా కొనిపోయెను. అతడు ”నా భార్యగదికి వెళ్ళెదను” అనెను. కాని ఆమె తండ్రి సంసోనునకు అడ్డుపడి, 2. ”నీకు ఆ యువతిపై అయిష్టము కలిగినదనుకొని ఆమెను నీ స్నేహితునికిచ్చి పెండ్లిచేసితిని. అయినను ఆ బాలికకంటె ఆమె చెల్లెలు అందగత్తె. ఆ పిల్లకు బదులుగా ఈ పిల్లను నీకిత్తుము” అనెను.

3. సంసోను ”ఈ ఫిలిస్తీయుల పీచమణచి తీర వలయును. వీరింతపనిచేసిరి. ఇక నేనేమి చేసినను తప్పుగాదు” అనుకొనెను.

4. అతడు పొలమునకు వెళ్ళి మూడువందల గుంటనక్కలను పట్టుకొనెను. రెండేసి గుంటనక్కల తోకలను ఒకదానితోనొకి ముడివేసి ప్రతిముడిలోను ఒక కొరవిని దోపెను.

5. ఆ కొరవులకు నిప్పింంచి గుంటనక్కలను ఫిలిస్తీ యుల పొలములమీదికితోలెను. పొలములలో కోతకు వచ్చిన పంట, కోసి కట్టలుక్టిన పంట, ద్రాక్షతోటలు, ఓలివుతోటలు అన్ని నిప్పంటుకొని కాలిపోయెను.

6. ఫిలిస్తీయులు ఆ అపకారము చేసినది ఎవరా యని విచారింపగా సంసోనని తెలిసిపోయెను. సంసోను తిమ్నాతు పౌరుని కుమార్తెను పెండ్లియాడెననియు, తండ్రి వధువును మరల సంసోను స్నేహితునికిచ్చి పెండ్లిచేసెననియు, అందులకే అతడు ఈ పనిచేసి ననియు వినిరి. వారు సంసోను భార్యను ఆమె ప్టుినిం వారిని నిలువునకాల్చి చంపిరి.

7. ఆ సంగతివిని సంసోను వారితో ”మీరంతి పాడుపనికి తలపడితిరి గనుక మీపై పగతీర్చుకొనితీరెదను” అనెను. 8. అతడు ఫిలిస్తీయుల మీదబడి చిక్కినవారిని చిక్కినట్లు చీల్చి చెండాడెను. అటుపిమ్మట ఏతాము కొండగుహకు వెడలిపోయి అచట వసించెను.

గాడిద దవడ ఎముక

9. అపుడు ఫిలిస్తీయులు యూదా మీదికి దండెత్తి వచ్చి లేహినగరమును ముట్టడించిరి.

10. యూదీయులు ఫిలిస్తీయులను చూచి ”మీరు మాపై ఇట్లు దాడిచేయనేల?” అని అడిగిరి. వారు ”మేము సంసోనును పట్టుకొనవచ్చితిమి. అతడు మాకుచేసిన కీడుకు ప్రతీకారము చేసితీరెదము” అనిరి.

11. అపుడు మూడువేలమంది యూదీయులు ఏతాము కొండస్థావరమునకు వెళ్ళి సంసోనుతో ”ఫిలిస్తీయులు మన ఏలికలని నీకు తెలియదా? నీవు మాకెంతి ముప్పు తెచ్చిప్టిెతివి” అని అనిరి. అతడు వారితో ”ఫిలిస్తీయులు నాకు ద్రోహము తలప్టిెరి కనుక నేను వారికి శాస్తిచేసితిని” అనెను.

12. యూదీయులు అతనితో ”మేము నిన్ను పట్టుకొని పోయి ఫిలిస్తీయులకు అప్పగించెదము” అని పలికిరి. సంసోను ”మీరు నన్ను చంపము అని ప్రమాణము చేయుడు” అనెను.

13. యూదీయులు అతనితో ”మేము నిన్ను చంపదలచుకోలేదు. నిన్ను బంధించి ఫిలిస్తీయుల చేతికి అప్పగించెదము” అని పలికిరి. అంతట యూదీయులు అతనిని రెండు క్రొత్తత్రాళ్ళతో బంధించి కొండగుహ నుండి వెలుపలికికొనివచ్చిరి.

14. సంసోను లేహి పట్టణమునకు రాగానే ఫిలిస్తీయులు అతనిని చూచి పొంగిపోయి వెఱ్ఱికేకలు వేసిరి. అంతట యావే ఆత్మ సంసోనును ఆవహింపగా అతని బంధములన్నియు నిప్పంటుకొనిన నార త్రాళ్ళ వలె నయ్యెను. త్రాికట్టులన్నియు సడలిపోయెను.

15. అచ్చట పచ్చిపచ్చిగానున్న గాడిద దవడ ఎముక యొకి సంసోను కంటబడెను. అతడు చేయిచాచి ఆ ఎముక నందుకొని దానితో ఫిలిస్తీయులను వేయిమందిని చంపెను.

16. అతడు

”గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీయులను

గాడిదలను క్టొినట్లుగా క్టొితిని,

గాడిద దవడ ఎముకతో వేయిమందిని

పడగ్టొితిని” అనెను.

17. ఆ మాటలతో సంసోను చేతిలోని దవడ ఎముకను విసరిపారవేసెను. కనుకనే ఆ తావునకు రామత్‌లేహి1 అని పేరువచ్చెను.

18. అపుడు సంసోను దప్పికగొని యావేకు మొరపెట్టెను. ”ప్రభూ! నీ దాసునికి ఈ మహావిజయము ప్రసాదించినవాడవు నీవే. నేనిపుడు దప్పికతో చావవలసినదేనా? సున్నతి సంస్కారములేని ఈ ఫిలిస్తీయుల చేతికి చిక్కవలసిన దేనా?” అని వేడుకొనెను.

19. ఆ వేడుకోలువిని యావే నేలను బ్రద్దలుచేసి గోయి ఏర్పడునట్లు చేసెను. నేడు లేహి పట్టణమున ఉన్న గొయ్యి అదియే. ఆ గోతి నుండి నీళ్ళుపైకి ఉబికివచ్చెను. సంసోను నీళ్ళు త్రాగి సేదదీర్చుకొనెను. అతనికి మరల సత్తువకలిగెను.    కనుకనే ఆ ఊటకు ఎన్‌హక్కోరె2 అని పేరు వచ్చెను. లేహి చెంత నేికిని ఆ చెలమను చూడవచ్చును.

20. ఫిలిస్తీయుల కాలమున సంసోను ఇరువది ఏండ్లపాటు యిస్రాయేలీయులకు న్యాయాధిపతిగా నుండెను.

Previous                                                                                                                                                                                                   Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము