ఎదోమునకు శిక్ష
34 1. సకలజాతి జనులారా!
ఇటు దగ్గరికి వచ్చి వినుడు.
సమస్త ప్రజలారా! ఆలింపుడు.
భూమియు, దానిలోని వారందరును వినుడు.
లోకమును, దానిలోని వారెల్లరును ఆలింపుడు.
2. ప్రభువు నిఖిలజాతులమీదను కోపించెను.
వారి సైన్యములమీద ఆగ్రహముచెందెను.
ఆయన వారిని నాశనము చేసి వధింపనెంచెను.
3. శత్రువుల శవములను
ఖననముచేయక బయట పారవేయుదురు.
వారి పీనుగుల నుండి దుర్గంధము వెలువడును. కొండలమీద వారి నెత్తురులు ఏరులుగా పారును.
4. సూర్యచంద్ర నక్షత్రములు నాశనమగును.
ఆకాశమును లిఖితప్రతినివలె చుట్ట చుట్టుదురు. వాి సైన్యమంత ద్రాక్షదళములవలెను,
అంజూరపు ఆకులవలెను రాలిపోవును.
5. ప్రభువు ఆకాశమున
తన ఖడ్గమును సిద్ధము చేసికొనెను.
అది ఎదోముమీదికి దిగివచ్చును.
ప్రభువు తాను నాశనముచేయగోరిన
ప్రజలను వధించును.
6. ఎదోమీయుల నెత్తురును, క్రొవ్వును
ప్రభువు ఖడ్గమునకు అంటుకొనును.
ఆ దృశ్యము పొట్టేళ్ళను, మేకలను బలి ఈయగా,
వాని నెత్తురును, క్రొవ్వును
కత్తికి అంటుకొని ఉన్నట్లుగా ఉండును.
ప్రభువు బోస్రానగరమున బలినర్పించును.
ఎదోమున మహాసంహారము జరిపించును.
7. జాతులు ఎడ్లవలె కూలును.
ప్రజలను కోడెలవలె వధింతురు.
నేల నెత్తురులో నానును.
భూమి క్రొవ్వుచే కప్పబడును.
8. ఇది ప్రభువు శత్రువులను శిక్షించుకాలము.
సియోను రక్షకుడు
తన విరోధులమీద పగతీర్చుకొనుకాలము.
9. ఎదోము నదులు కీలుగా మారిపోవును.
అందలి భూమి గంధకమగును.
ఆ దేశమంతయు కీలువలెమండును.
10. ఎదోము రేయింబవళ్ళును కాలును.
దాని పొగ నిరంతరమును పైకి లేచుచుండును.
అది తరతరములవరకు
మరుభూమిగా ఉండిపోవును.
దాని గుండ ఎవడును ప్రయాణము చేయడు.
11. ముండ్లపందులును,
గూడబాతులును అచట వసించును.
గుడ్లగూబలును, కాకులును అచట తిరుగాడును. ప్రభువు ఆ నేలను చిందరవందరచేసి
శూన్యము చేయును.
12. అచట రాజులు రాజ్యము చేయరు,
నాయకులు అంతరింతురు.
13. అచి ప్రాసాదములలో ముండ్లపొదలెదుగును.
అచి కోటలలో గచ్చచెట్లు పెరుగును.
నక్కలకును, నిప్పుకోళ్ళకును
ఆ తావు వాసస్థలమగును.
14. అచట అడవిపిల్లులు
దుమ్ములగొండ్లతో కలిసితిరుగును.
ఎడారిమేకలు ఒండొింని కలిసికొనును.
అడవిపిట్ట విశ్రాంతిస్థలమును వెదకుకొనును.
15. కౌజులు గూళ్ళుక్టి, గుడ్లుప్టిె,
పిల్లలనుచేసి వానిని సంరక్షించుకొనును.
రాబందులు ఒకదానితరువాత
ఒకి వచ్చిచేరును.
16. ప్రభువు గ్రంథమును తిరుగవేసిచూడుడు.
ఈ ప్రాణులలో ఒక్కీ తప్పిపోదు.
ప్రతిప్రాణియు
తన జంటప్రాణితో కూడియుండును.
ప్రభువే ఈ నియమము చేసెను.
ఆయన స్వయముగా వానిని జతపరచెను.
17. ప్రభువు వన్యప్రాణులకు
ఆ భూమిని పంచియిచ్చును.
వానిలో ప్రతి దానికి
ఆయన ఈ భూమిలో భాగమిచ్చును.
ఆ ప్రాణులు ఆ భూమిని స్వాధీనము చేసికొని
కలకాలమచట వసించును.