59 1.      ప్రభువు హస్తము

                              మిమ్ము రక్షింపలేనిదిగా కురచ కాలేదు.

                              ఆయన మీ మనవిని ఆలింపలేని

                              చెవివాడును కాలేదు.

2.           మీ పాపములు

               మీకును దేవునికిని మధ్య అడ్డముగానున్నవి.

               మీ దోషములవలన

               ఆయన తన మొగమును మరుగుజేసికొని

               మీ వేడుకోలును ఆలింపకున్నాడు.

3.           మీ చేతులు రక్తముచేతను,

               మీ వ్రేళ్ళు దోషముచేతను

               అపవిత్రపరచబడి ఉన్నవి.

               మీ పెదవులు అబద్ధములాడుచున్నవి.

               మీ నాలుకలు చెడు మ్లాడుచున్నవి.

4.           మీరు న్యాయస్థానమున

               నీతినిబ్టి సాక్ష్యము పలుకుటలేదు.

               సత్యమును లెక్కచేయుటలేదు.

               ఎల్లరును కల్లలాడువారే. మీ పన్నాగములతో

               ఇతరులకు హాని చేయుచున్నారు.

5.           మీ కుతంత్రములతో

               విషసర్పమువలె గ్రుడ్లు పెట్టుచున్నారు.

               సాలెపురుగులవలె గూళ్ళు అల్లుచున్నారు.

               ఎవడైనను ఆ గ్రుడ్లలో

               ఒకదానిని తిన్నచో చచ్చును.

               ఒక దానిని పగులగ్టొినచో

               విషసర్పము బయికివచ్చును.

6.           మీ సాలెగూళ్ళవలన ప్రయోజనము లేదు.

               అవి ఎవరికి బట్టలుగా ఉపయోగపడవు.

               మీరు దుష్టకార్యములకు పాల్పడుచున్నారు.

               దౌర్జన్యమునకు పూనుకొనుచున్నారు.

7.            మీరు త్వరితముగా

               దుష్కార్యములకు ఎగబడుచున్నారు.

               త్వరపడి నిర్దోషులను హత్యచేయుచున్నారు.

               పాపపు ఆలోచనలు చేయుచున్నారు.

               మీరు పోయిన తావులందెల్ల

               వినాశమును తెచ్చిపెట్టుచున్నారు.

8.           మీకు శాంతిమార్గము తెలియదు.

               మీరు చేయునవన్నియు అన్యాయపు పనులే.

               మీ మార్గములు వంకరింకరలు.

               వానిలో పయనించువారికి శాంతిలేదు.

పశ్చాత్తాప కీర్తన

9.           ప్రజలిట్లు పలుకుదురు:

               కనుకనే ప్రభువురక్షణము

               మాకు దూరముగానున్నది.

               ఆయన మమ్ము కాపాడుటలేదు.

               మేము వెలుగుకొరకు చూచితిమిగాని,

               అంతయు చీకటే.

               ప్రకాశమును ఆశించితిమిగాని

               తమస్సులో నడువవలసివచ్చినది.

10.         మేము గ్రుడ్డివారివలె

               గోడపట్టుకొని నడుచుచున్నాము.

               అంధులవలె తడుముకొనుచు పోవుచున్నాము.

               మిట్టమధ్యాహ్నము కూడ

               చీకియందువలె పడిపోవుచున్నాము.

               అంధకారలోకములోని మృతులవలె

               కాలుజారి పడిపోవుచున్నాము.

11.           మేము ఎలుగుబింవలె ఆక్రోశించుచున్నాము.

               గువ్వలవలె శోకాలాపము చేయుచున్నాము.

               మేము న్యాయముకొరకు కాచుకొనియున్నాము

               గాని అది మాకు లభించుటలేదు.

               మేము ప్రభువు రక్షణముకొరకు

               ఎదురు చూచుచున్నాము గాని

               అది మాకు దూరమున నున్నది.

12.          ప్రభూ! మేము నీకు ద్రోహముగా

               ఎన్నో పాపములు చేసితిమి.

               మా పాపములు మాకు

               ప్రతికూలముగా సాక్ష్యము పలుకుచున్నవి.

               మా దోషములు మాకు కన్పించుచునే ఉన్నవి.

               మేము వానిని బాగుగా ఎరుగుదుము.

13.          మేము నీ మీద తిరుగబడి నిన్ను విడనాడితిమి.

               నిన్ను వెంబడింపమైతిమి.

               అన్యులను పీడించితిమి, నీనుండి వైదొలగితిమి.

               మా ఆలోచనలలోను,

               మాటలలోను విశ్వసనీయత లేదయ్యెను.

14.          న్యాయము దూరమయ్యెను,

               నీతి దగ్గరకు రాదయ్యెను.

               సత్యము సంతవీధులలో కాలుజారి పడిపోయెను.

               ధర్మమునకు ప్రవేశము లేదయ్యెను.

15.          సత్యము కొరతబడినది.

               చెడును విడనాడువాడు దోచబడుచున్నాడు.

               న్యాయము జరుగుటలేదు.

               అది ఆయనకు అయిష్టము కలిగించెను.

ప్రభువు తన జనులను రక్షించును

               ప్రభువు ఈ సంగతులనెల్ల గమనించెను.

               న్యాయము అడుగంటుటను చూచి కోపించెను.

16.          పీడితులను ఆదుకొను మధ్యవర్తి లేకుండుట

               గాంచి విస్మయము మొందెను.

               కనుక ఆయన పీడితులను కాపాడుటకు

               ఆయన బాహువు ఆయనకు తోడ్పడెను.

               ఆయన నీతియే ఆయనకు ఆధారమయ్యెను.

17.          ఆయన నీతిని కవచముగా తాల్చును.

               రక్షణమును శిరస్త్రాణముగా ధరించును.

               ప్రతిదండనను వస్త్రముగా తాల్చును. 

               న్యాయమును చక్కబెట్టవలెనను ఆసక్తిని

               పై వస్త్రముగా ధరించును.

18.          ఆయన శత్రువులను

               వారి క్రియలకు తగినట్లు దండించును.

               విరోధులను కోపముతో శిక్షించును.

19.          తూర్పున ఉన్నవారు

               ఆయనను గాంచి భయపడుదురు.

               పడమరన ఉన్నవారు

               ఆయన ప్రభావము చూచి వెరగొందుదురు.

               ఆయన ఉద్ధ ృతితో పారు నదివలె వచ్చును.

               బలమైన వాయువువలె ఏతెంచును.

20.        కాని ”అతడు సియోను పౌరులయొద్దకును,

               పాపమునుండి వైదొలగిన యాకోబుసంతతి

               వద్దకును రక్షకుడుగా వేంచేయును.

దైవోక్తి

21. ప్రభువు తనప్రజలతో నిబంధనము చేసి కొనును. ఆయన వారికి తనశక్తిని, ఉపదేశమును దయచేయును. అవి వారిని వారి కుమారులను, కుమార్తెలను ఏనాడును విడనాడవు. ఇవి ప్రభువు పలుకులు.