యిస్రాయేలు తన పాపమును ఒప్పుకొనుట

106 1.    మీరెల్లపుడు ప్రభువును స్తుతింపుడు.

                              ప్రభువు మంచివాడు కనుక

                              ఆయనకు వందనములు అర్పింపుడు.

               ఆయన కృప కలకాలము నిలుచును.

2.           ప్రభువు మహాకార్యములను

               ఎవ్వడు ఉగ్గడింపగలడు?

               ఆయనను యుక్తరీతిని ఎవ్వడు సన్నుతింపగలడు?

3.           న్యాయమును పాించువారు,

               సదా నీతిని అనుసరించువారు ధన్యులు.

4.           ప్రభూ! నీవు నీ ప్రజలను అనుగ్రహించునపుడు

               నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము.

               నీ ప్రజలతోపాటు నన్నును రక్షింపుము.

5.           నేను నీవు ఎన్నుకొనిన ప్రజలవృద్ధిని

               కన్నులార చూతునుగాక!

               నీ జనుల సంతోషమున పాలుపొందుదునుగాక!

               నీకు చెందియున్నందులకుగాను గర్వింతునుగాక!

6.           మా పితరులవలె మేమును పాపము చేసితిమి. మేము దుష్టులమును, దుర్మార్గులమునైతిమి.

7.            ఐగుప్తున మా పితరులు

               నీ అద్భుతకార్యములను ఎన్నడును గ్రహింపరైరి.

               వారు నీ మహాప్రేమను విస్మరించిరి.

               రెల్లుసముద్రమువద్ద

               మహోన్నతునిమీద తిరుగబడిరి.

8.           కాని తాను వాగ్ధానము చేసినట్లే

               ప్రభువు వారిని రక్షించెను.

               దానిద్వారా ఆయన తన శక్తిని వెల్లడిచేసెను.

9.           ప్రభువు ఆజ్ఞాపింపగనే

               రెల్లు సముద్రము ఎండిపోయెను.

               ఆయన తన ప్రజలను కడలిలో

               పొడినేలమీద నడిపించెను.

10.         తమ్ము ద్వేషించు వారినుండి వారిని కాపాడెను.

               విరోధులనుండి వారిని రక్షించెను.

11.           వారి శత్రువులు నీళ్ళలో మునిగిచచ్చిరి.

               ఒక్కడును తప్పించుకోజాలడయ్యెను.

12.          అపుడు ప్రజలు ప్రభువు వాగ్ధానములను నమ్మిరి.

               ఆయనను స్తుతించి కీర్తించిరి.

13.          కాని ఆ జనులు ప్రభువు కార్యములను

               వెంటనే మరచిపోయిరి.

               ఆయన సలహాకొరకు వేచియుండరైరి.

14.          ఎడారిలో వారు తమ వాంఛకు లొంగిపోయిరి. అరణ్యములో ప్రభువును పరీక్షకు గురిచేసిరి.

15.          ప్రభువు వారి కోరికను తీర్చెను.

               కాని వారు ఘోరవ్యాధివాత పడునట్లు చేసెను.

16.          జనులు శిబిరమున మోషే మీదను

               ప్రభువు పవిత్రసేవకుడైన

               అహరోను మీదను అసూయపడిరి.

17.          అప్పుడు భూమి నోరువిప్పి

               దాతానును మ్రింగివేసెను.

               అబీరాము బృందమును పూడ్చివేసెను.

18.          అగ్ని వారి గుంపుమీదికి దిగివచ్చెను.

               దాని జ్వాలలు ఆ దుష్టులనెల్ల మసిచేసెను.

19.          ఆ జనులు హోరేబువద్ద దూడను చేసిరి.

               పోతపోసిన విగ్రహమును ఆరాధించిరి.

20.        ప్రభువు తేజస్సును

               గడ్డిమేయు ఎద్దుబొమ్మకు మారకము వేసిరి.

21.          ఐగుప్తున మహాకార్యములు చేసి

               తమను రక్షించిన దేవుని విస్మరించిరి.

22.         ఆయన ఐగుప్తున అి్ట అద్భుతకార్యములు చేసెను

               రెల్లుసముద్రమువద్ద అి్ట భీకరకార్యములను చేసెను

23.         ప్రభువు ఆ ప్రజలను నాశనము చేయనెంచెను. కాని తాను ఎన్నుకొనిన సేవకుడగు

               మోషే అతనికి అడ్డుపడి,

               అతని కోపమును చల్లార్చి వారిని కాపాడెను.

24.         వారు ప్రభువు వాగ్ధానములను నమ్మరైరి.

               కనుక, రమ్యమైన దేశమును

               స్వాధీనము చేసికొన నిరాకరించిరి.

25.         ప్రభువు మాట వినక, తమ గుడారములోనే

               కూర్చుండి గొణగనారంభించిరి.

26-27. వారు ఎడారిలోనే చత్తురని,

               వారి సంతానము అన్యజాతుల నడుమ

               చెల్లాచెదరై పరదేశీయులలో కలిసిపోవుదురనియు

               ప్రభువు నిశితముగా మందలించెను.

28.        అటుతరువాత ఆ ప్రజలు పెయోరువద్ద

               బాలుదేవత ఆరాధనములో పాల్గొనిరి.

               మృతదేవతలకు అర్పించిన

               నైవేద్యములను ఆరగించిరి.

29.        వారు తమ దుష్కార్యములద్వారా

               ప్రభువు కోపము రెచ్చగ్టొి

               అంటురోగము వాతబడిరి.

30.        అప్పుడు ఫీనెహాసు లేచి శిక్ష జరిపింపగ

               ఆ అంటువ్యాధి సమసిపోయెను.

31           ఈ కార్యమువలన అతడు తరతరములవరకును

               పుణ్యపురుషుడుగా గణుతికెక్కెను.

32.         మెరిబా జలములవద్ద ప్రజలు

               ప్రభువునకు కోపము ప్టుించిరి.

               వారివలన మోషేకును తిప్పలు వచ్చెను.

33.         వారు మోషేను విసిగింపగా

               అతడు దురుసుగా మ్లాడెను.

34.         ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా వారు

               అన్యజాతి జనులను నాశనము చేయరైరి.

35.         అన్యజనులతో సహవాసముచేసి,

               వారి దుష్టచర్యలను అనుకరించిరి.

36.        ఆ ప్రజలు అన్యజనుల విగ్రహములను

               పూజించి వలలో చిక్కుకొనిరి.

37.         తమ పుత్రులను, పుత్రికలను

               దయ్యములకు బలి ఇచ్చిరి.

38.        వారు నిర్దోషులైన తమ బిడ్డలను చంపి

               కనాను విగ్రహములకు బలి యిచ్చిరి.

               కనుక ఆ శిశువుల నెత్తురువలన

               దేశము అపవిత్రమయ్యెను.

39.        వారు తమ చెయిదములవలన అపవిత్రులైరి. వారు తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.

40.        కనుక ప్రభువు తన ప్రజలమీద కోపపడెను.

               తాను ఎన్నుకొనిన జనులను అసహ్యించుకొనెను.

41.          ఆయన వారిని అన్యజాతులకు అప్పగించెను.

               వారిని ద్వేషించువారే వారికి పాలకులైరి.

42.         శత్రువులు వారిని పీడించి నేలబ్టెి కాలరాచిరి.

43.         ప్రభువు చాలసార్లు తన ప్రజలను

               శత్రువులనుండి విడిపించెను.

               కాని వారు దేవునిమీద తిరుగుబాటు చేయుటకే

               నిశ్చయించుకొని పాపములో కూరుకొనిపోయిరి.

44.         అయినను ప్రభువు వారి బాధలను

               అర్థము చేసికొనెను.

               ఆ ప్రజలు తనకు మొరపెట్టగా

               వారి వేడికోలును ఆలకించెను.

45.         ఆయన వారి మేలెంచి

               తన నిబంధనమును జ్ఞప్తికి తెచ్చుకొనెను.

               మహాకృప కలవాడు కనుక

               వారిమీద దయచూపెను.

46.        వారిని బందీలనుగా కొనిపోయినవారు

               వారిమీద జాలి చూపునట్లు చేసెను.

47.         మా దేవుడవైన ప్రభూ! నీవు మమ్ము రక్షింపుము. అన్యజాతులనుండి మమ్ము విడిపింపుము.

               అప్పుడు మేము సగర్వముగా

               నీకు వందనములు అర్పించి

               నీ పవిత్రనామమును సన్నుతింతుము.

48.        అనాదికాలమునుండియు అనంతమువరకును

               యిస్రాయేలు దేవునకు స్తుతికలుగునుగాక!

               ఇచట ఎల్లరును ‘ఆమెన్‌’ అని పలుకవలయును.

               మీరెల్లరు ప్రభువును స్తుతింపుడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము