ఉపోద్ఘాతము:

పేరు: యెషయా అనగా ”యావే రక్షించును” అని అర్థము.  ఉజ్జియా రాజు మరణించిన సంవత్సరమున యావే యెషయాను పిలిచెను. (6:1). ఇతను యజాకుడు, వివాహితుడు (8:3). తన మొదికుమారుని పేరు షేయార్యాషూబు, అనగా ”శేషము తిరిగివచ్చును”, రెండవకుమారుని పేరు మహర్‌షాలాల్‌ హష్‌బాజ్‌ అనగా ”త్వరితముగా దోపిడి, శీఘ్రముగా కొల్ల” అని నర్మగర్భితముగ పేర్లు పెట్టెను.

కాలము: యెషయా ప్రవచనకాలము దాదాపు క్రీ.పూ. 742-687 (1:1).

రచయిత : యెషయా గ్రంథము మూడుభాగాలుగా విభజించబడినది. 1-39 అధ్యాయాలను మొది యెషయా అందురు. వీికి మూలకర్త క్రీ.పూ 742 – 687లో ప్రవచించిన యెషయా ప్రవక్తయే. 40-55 అధ్యాయాలను రెండవ యెషయా అందురు. వీికి మూలకర్త బబులోను వలసకాల (క్రీ.పూ 597-538) చివరలో బబులోనులోనే ప్రవచించిన యెషయాయొక్క శిష్యులలోనొకరు.  56-66 అధ్యాయాలను మూడవ యెషయా అంారు. వీికి మూలకర్త బబులోను వలసానంతరము క్రీ.పూ 5వ శతాబ్దములో యెరుషలేములో ప్రవచించిన ఒకానొక ప్రవక్త. తరువాత కాలములో ఈ మూడు భాగాలను   క్రోడీకరించి యెషయా గ్రంథముగా సమకూర్చబడినది. 

చారిత్రక నేపథ్యము: క్రీ.పూ. 8-7 శతాబ్ధములు యిస్రాయేలీయుల చరిత్రలో చాలా విశిష్టమైనవి.  క్రీ.పూ. 740లో ఉజ్జియారాజు మరణానంతరము దాదాపు అర్థశతాబ్దము పాటు యిస్రాయేలీయులు అష్షూరు రాజులదాడులను ఎదుర్కొనిరి. ఆ కాలమున వారు ఇరుగుపొరుగు రాజుల ఒత్తిడులకు గురియైరి. అి్ట పరిస్థితుల్లో రాజు, ప్రజలు యావే దేవుని మీదనే అచంచలమైన విశ్వాసము పెట్టుకోవాలని యెషయా తన ప్రవచనాల ద్వారా బోధించెను.

ముఖ్యాంశములు: ఇమ్మానుయేలు గురుతు, ప్రజల పాపములు, దేవునితీర్పు గురించి ఆరంభ గ్రంథభాగములో నుండును.మిగిలిన భాగములలో యెషయా ఒక విమోచన ప్రవక్తగా, యిస్రాయేలీయుల విమోచనాన్ని ప్రవచించెను.  ప్రవచనాలు సృష్టిఆరంభము నుంచి (42:5) నూతనసృష్టి జరిగే వరకూ కొనసాగును (65:17; 66:22). దేవుని ‘యిస్రాయేలు పరిశుద్ధ దేవుడు’ అని తరచు ఉద్ఘాించెను. ఈ గ్రంథప్రచనములు దేవుడు యిస్రాయేలీయులకేగాక సమస్తజాతులకు రక్షకుడని తెలియజేయును.

క్రీస్తుకు అన్వయము: యెషయా ప్రవచనాలు క్రీస్తు గూర్చి ప్రత్యక్షంగా ప్రస్తావించును.  యెషయా మెస్సయా ప్రవచనాలు చాల ప్రాధాన్యత పొందెను:  క్రీస్తు జననము (7:14; 9:6), క్రీస్తు దైవత్వం (9:6-7), క్రీస్తు పరిచర్య (9:1-2; 42:1-7;  49:1-6 61:1-2); క్రీస్తు బాధామయుడు, మరణం (52:1-53:12); మానవుల దుర్మార్గతపై దేవుని తీర్పు క్రీస్తు ద్వారా చేయబడును. క్రీస్తు ద్వారానే నూతన సృష్టి జరుగును (65:17; 66:22).