విజ్ఞానమునకు స్తుతిగీతము

విజ్ఞానము నరునికందనిది

28 1.    వెండిని త్రవ్వుటకు గనులు కలవు.

                              సువర్ణమును శుద్ధిచేయుటకు

                              కుంపి గలదు.

2.           జనులు భూమినిత్రవ్వి ఇనుమును తీయుదురు.

               రాళ్ళను కరిగించి రాగిని తయారు చేయుదురు.

3.           నరులు అంధకారమయమైన

               భూగర్భములో ప్రవేశించి అచట

               చీకిలో ఖనిజము త్రవ్వి తీయుదురు.

4.           జనసంచారమునకు దూరముగా,

               కాలూనుటకైన వీలులేని గోతులలోనికి దిగి

               త్రాికి వ్రేలాడుచు గనులు త్రవ్వుదురు.

5.           భూమిమీద పంటలుపండునుకాని

               నరులు ఆ భూమి గర్భమునే చీల్చి

               చిందరవందర చేయుదురు.

6.           భూగర్భములోని  రాళ్ళలో మణులు ఉండును.

               అందలి మ్టి బంగారముతో నిండియుండును.

7.            డేగలకు ఆ గనుల లోనికి పోవుమార్గము

               తెలియదు.

               రాబందులకు అచికి వెళ్ళు త్రోవతెలియదు.

8.           దర్పముగల వన్యమృగములు అచికి

               పోజాలవు. సింహము  అచికి  వెళ్ళజాలదు.

9.           నరులు కఠినశిలలను గూడ త్రవ్వుదురు.

               కొండపాదులను కుళ్ళగించి వేయుదురు.

10.         జనులు కొండలలో సొరంగములు త్రవ్వి

               విలువగల మణులను వెలికితీయుదురు.

11.           నదులను వాని జన్మస్థానము వరకును

               పరిశీలించి చూచి,

               భూమిలో దాగియున్న వస్తువులను

               వెలుపలికి కొనివత్తురు.

12.          కాని విజ్ఞానమెచట కన్పించును?

               వివేకము ఎందు చూపట్టును?

13.          విజ్ఞానమును చేరుమార్గము జనులకు తెలియదు

               అది నరలోకమున దొరుకునది కాదు.

14.          అగాధమును అడుగగా విజ్ఞానము

               ‘నా యొద్ద లేదు’ అనును.

               సముద్రము నడుగగా అదియును అి్టది

               ‘నా యొద్ద లేదు’ అనును.

15.          విజ్ఞానమును బంగారముతో కొనలేము.

               వెండిని తూచియిచ్చి సంపాదింపలేము.

16.          మేలిమి బంగారముగాని,

               గోమేధిక నీలమణులుగాని

               దాని వెలతో సరితూగజాలవు.

17.          అది సువర్ణముకంటెను,

               స్ఫికముకంటెను మేలైనది

               స్వర్ణపాత్రమును దానితో మారకము వేయజాలము

18.          పగడములను, స్ఫికములను దానితో

               సరిపోల్చజాలము.

               దానితో పోల్చినచో ముత్తెములు

               ఎందుకు పనికిరావు

19.          శ్రేష్ఠమైన పుష్యరాగము దానికి సాిరాదు.

               పుటము వేసిన బంగారము దానికి సమముకాదు

20.        కాని విజ్ఞానమెచట కన్పించును?

               వివేకము ఎందు చూపట్టును?

21.          జీవించియున్న ప్రాణి ఏదియు

               విజ్ఞానమును కాంచజాలదు.

               ఆకసమున ఎగురు పకక్షులుగూడ

               దానిని చూడజాలవు.

22.         మృత్యువును, వినాశమునుగూడ

               ‘మేము విజ్ఞానమును గూర్చి వదంతిని మాత్రమే

               వినియుింమి’ అని చెప్పును.

23.         దేవునికి మాత్రమే దాని మార్గము తెలియును.

               అది దొరకు తావును ఆయన మాత్రమే ఎరుగును

24.         ఆయన నేల నాలుగుచెరగులను పరిశీలించును

               మింక్రిందనున్న వస్తువులనెల్ల అవలోకించును.

25.         ప్రభువు వాయువునకు బలమును

               దయచేసినపుడు జలరాశికి

               పరిమాణమును విధించినపుడు,

26.        వానలు కురియుటకు నియమములు

               చేసినపుడు, ఉరుములకు మెరపులకు

               మార్గములు నియమించినపుడు,

27.         విజ్ఞానమును కూడ పరికించి చూచెను.

               ఆయన దానిని పరీక్షించిచూచి

               తన సమ్మతిని తెలిపెను.

28.        ప్రభువు నరునితో ఇట్లనెను:

               ‘దేవునికి భయపడుటయే విజ్ఞానము,

               దుష్కార్యములను విడనాడుటయే వివేకము.’ ”