యెరూషలేమున దావీదు
14 1. తూరు రాజగు హీరాము దావీదు చెంతకు దూతలను పంపి, అతనికి రాజగృహము క్టిపెట్టుటకు దేవదారుకొయ్యలను, వడ్రంగులను, తాపీపని వారిని సరఫరా చేసెను.
2. ప్రభువు తన ప్రజలైన యిస్రా యేలీయులమీద తనను రాజుగా నెలకొల్పెనని, ఆ ప్రజల క్షేమముకొరకై తమ రాజ్యమును వృద్ధిలోనికి తెచ్చుచుండెనని దావీదు అప్పుడు గ్రహించెను.
3. యెరూషలేమున దావీదు చాలమంది స్త్రీలను పెండ్లియాడెను. అతనికి పెక్కుమంది కుమారులు, కుమార్తెలు కలిగిరి.
4-7. ఆ నగరమున అతనికి ప్టుినబిడ్డలు వీరు: షమ్మూవ, షోబాబు, నాతాను, సొలోమోను, ఇభారు, ఎలీషూవ, ఎల్పేలెతు, నోగహు, నెఫెగు, యాఫీయ, ఎలీషామా, బేల్యెదా, ఎలీఫేలెటు.
ఫిలిస్తీయుల మీద విజయములు
8. దావీదు యిస్రాయేలు దేశమంతికిని రాజ య్యెనని విని ఫిలిస్తీయులు అతనిని పట్టుకొనుటకు వచ్చిరి. కనుక దావీదు వారి నెదుర్కొనబోయెను.
9. ఫిలిస్తీయులు రేఫాయీము లోయలో దాడిచేసి దోపిడి ప్రారంభించిరి.
10. దావీదు దేవుని సంప్రదించి ”నన్ను వారి మీద పడుమందువా? నీవు నాకు విజయ మును ప్రసాదింతువా?” అని యడిగెను. ప్రభువు ”పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగింతును” అని చెప్పెను.
11. కనుక దావీదు బాల్పెరాసీము నొద్ద ఫిలిస్తీయుల నెదరించి ఓడించెను. అతడు ”ప్రవాహము వలన కట్టకు గండిపడినట్లు ప్రభువు నావలన శత్రుసైన్యమున గండిపడునట్లు చేసెను” అనెను. కనుకనే ఆ తావుకు ”బాలు పెరాజీము”1 అని పేరు వచ్చెను.
12. అప్పుడు ఫిలిస్తీయులు తమ విగ్రహములను లోయలోనే వదలిప్టిె పారిపోయిరి. దావీదు వానిని తగుల బ్టెించెను.
13. ఫిలిస్తీయులు మరల లోయలో ప్రవేశించి దోపిడి మొదలుప్టిెరి.
14. దావీదు మరల ప్రభువును సంప్రదించెను. యావే ”నీవు వారినిచట ఎదిరింపవలదు. చుట్టును తిరిగిపోయి కంబళిచెట్ల వద్ద వారిని ఎదుర్కొనుము.
15. ఆ చెట్లకొనల మీద అడుగులచప్పుడు వినిపించినప్పుడు నీవు వారిమీద పడుము. నేను నీకు ముందుగా పోయి ఫిలిస్తీయ సైన్యమును కలవరపెట్టెదను” అని చెప్పెను.
16. అతడు ప్రభువు చెప్పినట్లే చేసి ఫిలిస్తీయ సైన్యమును గిబ్యోను నుండి గేజేరు వరకు తరిమి చంపివేసిరి.
17. దావీదు పేరు యెల్లెడల మారుమ్రోగెను. ప్రభువు ప్రతిజాతి అతనికి భయపడునట్లు చేసెను.