యిస్రాయేలీయులపట్ల ప్రభువు ఆదరము
2 1. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను.
2. ”నీవు వెళ్ళి యెరూషలేమునకు ఇట్లు
ప్రకింపుము: ప్రభువు వాక్కు ఇది.
నీవు యువతివిగా ఉన్నపుడు
నాపట్లచూపిన అనురాగమును,
నా వధువువైనపుడు నాపట్ల చూపిన ప్రేమను
నేను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను.
నీవు పైరువేయని తావగు ఎడారిగుండ
నన్ను అనుసరించివచ్చితివి.
3. యిస్రాయేలీయులు నాకు పవిత్రప్రజలు. నాకు ముట్టవలసిన పంటలో
ప్రథమఫలముల వింవారు.
వారికి కీడుచేయువారిని
నేను శిక్షించి కష్టాలపాలు చేసితిని.”
యిస్రాయేలు పితరుల పాపములు
4. యాకోబు వంశజులారా! యిస్రాయేలు తెగలారా!
ప్రభువు పలుకులాలింపుడు.
5. ప్రభువు వాక్కు ఇది:
”నాలో ఏమి నేరము చూచి
మీ పితరులు నన్ను త్యజించిరి?
వారు వ్యర్థమైన విగ్రహములను కొలిచి
తామును నిరర్థకులైపోయిరి.
6. ‘నేను వారిని ఐగుప్తునుండి
నడిపించుకొని వచ్చితిని.
వారిని ఎడారిగుండ తోడుకొనివచ్చితిని.
ఇసుక గోతులుగల
మరుభూమిగుండ నడిపించితిని.
అది ఎవరును వసింపని, ఎవరును పయనింపని
భయంకరమైన తావు, ఎండి మలమలమాడు నేల.
అయినను ఆ ప్రజలు నన్ను ప్టించుకోరైరి.
7. నేను వారిని సారవంతమైన నేలకు గొనివచ్చితిని.
వారు దానిలో పండినపంటను, దానిలో లభించు
ప్రశస్తవస్తువులను అనుభవింపవచ్చును.
కాని వారు ఆ నేలమీద కాలు మోపగనే,
దానిని నాశనము చేసిరి.
నా దేశమును ఆపవిత్రము చేసిరి.
8. యాజకులు నన్ను ప్టించుకోరైరి.
ధర్మశాస్త్రమును బోధింపవలసిన
యాజకులు నన్ను తలంచరైరి.
‘ప్రభువు ఎక్కడ ఉన్నాడు?’ అని అడిగి,
పాలకులు నా మీద తిరుగబడిరి.
ప్రవక్తలు బాలుదేవత పేరుమీద
ప్రవచనములు చెప్పిరి.
శక్తిచాలని బొమ్మలనుపూజించిరి.
ప్రభువు తన ప్రజలమీద వ్యాజ్యము తెచ్చుట
9. కనుక నేను నా ప్రజలమీద వ్యాజ్యము తెచ్చెదను. వారి సంతతిమీద నేరము తెచ్చెదను.
ఇది ప్రభుడనైన నా వాక్కు.
10. మీరు పడమరన
కిత్తీము ద్వీపము వరకును పొండు.
తూర్పున కెదారు దేశము వరకును
మీ దూతలను పంపుడు.
ఇి్ట కార్యము పూర్వము
ఎప్పుడైనా జరిగినదేమో పరిశీలించిచూడుడు.
11. తాము కొలుచు దైవములు
నిజముగా దైవములు కాకున్నను,
ఏ జాతికూడ వారిని విడనాడలేదు.
కాని నా ప్రజలు తమకు కీర్తితెచ్చిన
నన్ను విడనాడి తమక్టిె మేలుచేయజాలని
బొమ్మలను కొలిచిరి.
12. ఆకాశమా! నీవు ఈ చెయిదమును గాంచి
వెరగొందుము. భీతితో కంపించుము.
ఇది ప్రభువు వాక్కు.
13. నా ప్రజలు రెండు నేరములు చేసిరి.
వారు జీవజలముల బుగ్గనైన
నన్ను పరిత్యజించిరి, నెఱ్ఱెవిచ్చుటచే
నీరు నిలువని రాతితొట్లను తొలిపించుకొనిరి.
యిస్రాయేలీయుల పాపములకు శిక్ష
14. యిస్రాయేలీయులు దాసులా?
ఇంట ప్టుినవాడు దాసుడా? కాడుకదా!
అతడు ఎలా దోపుడుసొమ్ము అయ్యెను?
మరి వారి శత్రువులు వారిని
ఈ రీతిగా కొల్లగొట్టనేల?
15. విరోధులు వారినిచూచి
సింహములవలె గర్జించిరి.
వారి దేశమును ఎడారి గావించిరి.
వారి నగరములను పాడుజేసి
నిర్మానుష్యము గావించిరి.
16. నోపు, తహపనేసు ప్రజలు
వారి పుఱ్ఱెలను పగులగ్టొిరి.
17. కాని ఈ అనర్థములను మీరే కొనితెచ్చుకొింరి.
నేను మిమ్ము మార్గము వెంట నడిపించుచున్నను మీరు మీ ప్రభుడను, దేవుడనైన నన్ను విడనాడితిరి
18. మీరు ఐగుప్తునకు వెళ్ళి
నైలునది నీళ్ళు త్రాగుటవలన లాభమేమి?
అస్సిరియాకు వెళ్ళి
యూఫ్రీసు నీళ్ళు త్రాగుటవలన ఫలితమేమి?
19. మీ పాపమే మిమ్ము శిక్షించును.
నన్ను విడనాడుటవలన
మీరు చీవాట్లు తెచ్చుకొందురు.
మీరు మీ ప్రభుడను, దేవుడనైన
నన్ను పరిత్యజించుటవలన,
నన్ను నిర్లక్ష్యము చేయుటవలన ఎి్టకీడును,
ఎి్టశ్రమయు తెచ్చుకొందురో ఊహింపుడు.
సైన్యములకు అధిపతియు
ప్రభుడనైన నా వాక్కిది.
ప్రభువును సేవించుటకు
యిస్రాయేలు ఇష్టపడుటలేదు
20. మీరు పూర్వమునుండే
నా అధికారమును ధిక్కరించి,
మేము నీకు సేవలు చేయమని పలికితిరి.
ప్రతి ఎత్తయిన కొండమీద
ప్రతిపచ్చని చెట్టుక్రింద మీరు వ్యభిచరించితిరి.
21. మంచివిత్తనమునుండి మొలకెత్తిన
శ్రేష్టమైన ద్రాక్షతీగగా నేను మిమ్ము నాితిని.
కాని మీరిపుడు నిష్ప్రయోజకమైన
భ్రష్టజాతి ద్రాక్షలుగా మారిపోతిరి.
22. మీరెన్ని క్షాళనపదార్థములతో కడుగుకొనినను
ఎన్ని క్షారములతో తోముకొనినను
మీ దోషపుమరకలు నాకు కన్పించుచునే ఉండును
ఇది ప్రభుడనైన నా వాక్కు.
23. మీరు, మేము అపవిత్రులము కాలేదనుచున్నారు.
మేము బాలు దేవతను కొలువలేదు
అని పలుకుచున్నారు.
కాని మీరు లోయలో
ఎట్లు ప్రవర్తించితిరో చూడుడు.
మీరేమి చేసితిరో గమనింపుడు.
మీరు ఎదకు వచ్చిన అడవి ఒంటె వింవారు.
24. అడవి గాడిద ఎదకుపోయి అటునిటు పరుగెత్తును
ఎడారిలో అటునిటు పరుగిడి
గాలిని వాసనచూచును.
ఋతు సమయము వచ్చినపుడు
దానిని ఎవడాపగలడు?
మగగాడిద దానికొరకు వెదకనక్కరలేదు.
ఋతుకాలమున
అది దానికి సులభముగానే దొరకును.
25. మీరు మీ కాలిచెప్పులు అరగిపోవువరకును
మీ గొంతు దప్పికతో ఎండిపోవువరకును
అన్యదైవముల వెంటబడి తిరుగనేల?
కాని మీరు, మేమిపుడు వెనుకకు తిరిగిరాలేము.
మేము అన్యదైవములను వలచితిమి.
కనుక వారివెంట పోకతప్పదు
అని పలుకుచున్నారు.”
యిస్రాయేలీయులకు శిక్ష తప్పదు
26. ప్రభువు ఇట్లు అనుచున్నాడు:
”దొంగ పట్టుపడినపుడు అవమానము పాలగును.
యిస్రాయేలీయులకును ఇి్ట గతియేపట్టును.
వారి ప్రజలు, రాజులు, అధిపతులు, యాజకులు,
ప్రవక్తలు తలవంపులు తెచ్చుకొందురు.
27. మీరు కొయ్యదిమ్మెను
‘మా తండ్రి’ అని పిలుచుచున్నారు.
రాతిని ‘మా తల్లి’ అని పిలుచుచున్నారు.
మీరు నాతట్టు ముఖము త్రిప్పుకొనక
వీపునే త్రిప్పుకొని
నా నుండి వైదొలగుచున్నారేగాని,
నా చెంతకు వచ్చుటలేదు.
కాని మీకు ఆపద వచ్చినపుడు మాత్రము
‘లెమ్ము, నీవు వచ్చి మమ్ము ఆదుకోవలెను’
అని ప్రాధేయపడుచున్నారు.
28. మీరు స్వయముగా చేసికొనిన ఆ దేవతలేరి?
వారినివచ్చి మీ ఆపదలో మిమ్ము రక్షింపుమనుడు.
యూదా దేశమా! నీకెన్ని నగరములున్నవో
అందరు దైవములు ఉన్నారుకదా!
29. మీరు నాపై ఎి్ట వ్యాజ్యము తెచ్చెదరు?
మీరు నామీద తిరుగుబాటు చేయనేల?
ఇది ప్రభుడనైన నా వాక్కు.
30. నేను మిమ్ము దండించినను ఫలితము దక్కలేదు.
మీరు నా శిక్షను అంగీకరింపలేదు.
మీరు గర్జించుసింహమువలె
మీ ప్రవక్తలను వధించితిరి.
31. యిస్రాయేలీయులారా! నా పలుకులాలింపుడు.
నేను మీపట్ల నివాసయోగ్యముకాని ఎడారివలెను,
చీకిప్రదేశమువలెను మెలగితినా? మరి మీరు
‘మేము మా ఇష్టము వచ్చినట్లు చేయుదుము.
మేము మరల నీ చెంతకురాము’ అని పలుకనేల?
32. యువతి తన ఆభరణములను మరచిపోవునా?
వధువు తన వివాహవస్త్రములను విస్మరించునా?
కాని నా ప్రజలు మాత్రము
లెక్కింప అలవిగానన్నినాళ్ళ వరకును
నన్ను విస్మరించిరి.
33. మీకు మీ ప్రేమికుల వెంటబడుట
బాగుగా తెలియును.
వేశ్యలుకూడ మీ నుండి
కామకలాపములు నేర్చుకోవచ్చును.
34. మీ బట్టలమీద పేదలు దీనులునైన
వారి నెత్తురుమరకలు కనిపించుచున్నవి.
అవి దోపుడుకాండ్రను
చంపుటవలననైన మరకలుగావు.
35. అయినను మీరు, ‘మేము నిర్దోషులము.
ప్రభువు కోపము నిక్కముగా
మా నుండి తొలగిపోయినది’
అని అనుకొనుచున్నారు.
మీరు ‘మేము పాపము చేసితిమి’
అని ఒప్పుకొనుటలేదు.
కనుక నేను మిమ్ము దండింతును.
36. మీరు ఇంతతేలికగా దైవములను మార్చుకోనేల? మీరు అస్సిరియాను నమ్మి ఆశాభంగము
తెచ్చుకొన్నట్లు ఐగుప్తును నమ్ముట వలన
మీకు నిరాశతప్పదు.
37. అక్కడనుండి కూడా
చేతులు నెత్తినపెట్టుకొని తిరిగివత్తురు.
ప్రభుడనైన నేను
మీరు నమ్మినవారిని తిరస్కరించితిని.
కనుక ఆ దేశీయులవలన మీకు లాభము కలుగదు”