ఉపోద్ఘాతము:

పేరు: ప్రవాసానంతరము పనిచేసిన ప్రవక్తల పేరు కలిగియున్న గ్రంథములలో హగ్గయి గ్రంథము మొదిది. (తదుపరి: జెకరియ, మలాకి). హగ్గయి పదము ‘హగ్‌’ అనే హీబ్రూ భాష ధాతువునుండి వస్తుంది. ‘హగ్‌’ అనగా ‘పండుగ’ అని అర్థము. ఇతడు మందసప్రతిష్టపండుగ రోజున పుట్టెను కాబి ఈ పేరును నిర్ణయించి వుందురని కొందరి అభిప్రాయము (2:1). ఈ పేరును మరొక పదములో ”ఉల్లాసవంతమైనది” అని కూడా వివరించియున్నారు.

కాలము: క్రీ.పూ. 520.

రచయిత: హగ్గయి. ఇతడి పేరు గ్రంథములో పలుమార్లు కనబడును (1:1,3,12,13; 2:1,10,13,14,20).

చారిత్రక నేపథ్యము: క్రీ.పూ. 538లో పారసీకరాజైన కోరేషు యూదులు యెరూషలేమునకు తిరిగివెళ్ళడానికి అనుమతినిచ్చెను (ఎజ్రా 1:2-4). క్రీ.పూ. 587లో ధ్వంసమైన యెరూషలేము దేవాలయమును తిరిగి నిర్మించడానికి యూదులు ప్రారంభించారు. కాని ఆ పనులను కొంత మంది దుర్భుద్ధులు అడ్డుకున్నారు  (ఎజ్రా 4:23). క్రీ.పూ. 522లో పారసీక రాజు దర్యావేషు దేవాలయ పునర్నిర్మాణానికి ప్రోత్సహించాడు (ఎజ్రా 4:24). ప్రజలలో నిర్లిప్తత వలన ఆ పని ముందుకు సాగలేదు. ఈ పరిస్థితులలో హగ్గయి ప్రవక్త దేవాలయ పునర్నిర్మాణ పనులు త్వరితగతిన సాగించాలని ప్రజలను పురికొల్పెను. ఈ నేపథ్యములో హగ్గయి ప్రవచనములు బహిర్గతమయ్యాయి.

ముఖ్యాంశములు: యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించడానికి యూదులను ఉత్తేజపరచడము హగ్గయి ప్రవక్త గ్రంథములోని ప్రధానాంశము (1:6-11). దేవుడు హగ్గయి ప్రవక్త ద్వారా ఇచ్చిన సందేశమునకు విధేయించుట ద్వారా దేవుని ఆశీర్వాదములు  ప్రజలు పొందుదురు  (2:7-9) అని చెప్పడం హగ్గయి ప్రవచనాల ఉద్దేశ్యము. పునఃనిర్మించిన యూదా రాజ్యానికి సెరుబ్బాబేలు అధిపతిగా పరిపాలిస్తాడని కూడా ముందుగానే చెప్పగలిగాడు (2:21-23). అవిధేయతవల్ల పోగొట్టుకున్న దైవానుగ్రహాన్ని విధేయత ద్వారా నూత్నీకరించుకోవచ్చునని హగ్గయి బోధించాడు.

క్రీస్తుకు అన్వయము: పునఃనిర్మితమైన దేవాలయము పూర్వపు దేవాలయము కంటె వైభవముగా ఉండునని (2:9) హగ్గయి ప్రవచించడము రానున్న క్రీస్తు మహిమను ప్రతిబింబించును. సెరుబ్బాబెలు రానున్న మెస్సియా ముంగుర్తుగా చెప్పటము ప్రాధాన్యతను సంతరించుకొనెను. (2:23). క్రీస్తు వంశావళి ప్టికలో సెరుబ్బాబెలు పేరు సంపాదించెను (మత్త. 1:12; లూకా 3:27).

Home                                                      

Previous                                                                                                                                                                                                  Next