42 1.      కాని ఇతరులకు జడిసి ఈ క్రింది

                              విషయములలో పాపము చేయుదురేమో

                              జాగ్రత్త!

                              మీరు ఈ క్రింది విషయములను గూర్చి

                              సిగ్గుపడకుడు:

2.           మహోన్నతుని ధర్మశాస్త్రనిబంధనముల గూర్చియు

               భక్తిహీనులనుగూడ సద్భావముతో

               చూచుట గూర్చియు,

3.           తోడి ప్రయాణికునితోకాని భాగస్వామితోగాని

               లెక్కలు సరిచూచుకొనుట గూర్చియు,

               వారసత్వముగా వచ్చిన ఆస్తిని

               పంచుకొనుటను గూర్చియు,

4.           సరియైన కొలమానములు,

               పడికట్టురాళ్ళు వాడుటను గూర్చియు,

               పెద్దదోచిన్నదో వ్యాపారము చేయుటను గూర్చియు

5.           వ్యాపారమున లాభము గడించుటను గూర్చియు, చిన్నపిల్లలకు శిక్షణనిచ్చుటను గూర్చియు,

               దుష్టుడైన బానిసను నెత్తురు కారువరకు

               కొట్టుటను గూర్చియు సిగ్గుపడకూడదు.

6.           నీ భార్య నమ్మజాలనిదైనచో,

               అది పదిమంది తిరుగు తావైనచో,

               నీ వస్తువులను దాచి తాళము వేయుము.

7.            నీవు ఇతరులకిచ్చు వస్తువులను తూచి, 

               లెక్కప్టిె ఇమ్ము.

               ఇచ్చిపుచ్చుకొను వానిని పద్దులో

               వ్రాసి ఉంచుకొనుము.

8.           బుద్ధి హీనులను చక్కదిద్దుటయు,

               వేశ్యగామియైన వృద్ధుని మందలించుటకును

               వెనుకాడకుము.

               ఈ అంశములను పాించినచో నీవు

               సంస్కారవంతుడవని రుజువగును.

               ఎల్లరును నిన్ను మెచ్చుకొందురు.

తండ్రి, కుమార్తె

9.           తండ్రి తన కుమార్తెనుగూర్చి ఆందోళన చెందును.

               రేయి అతని కింకి కునుకురాదు.

               ఈ సంగతి కుమార్తెకు తెలియదు.

               కుమార్తె బాలికగా ఉన్నచో ఆమెకు పెండ్లి కాదేమో

               అనియు,

               పెండ్లియైనచో ఆమె సుఖింప జాలదేమో అనియు

               తండ్రి విచారించును. 

10.         పుత్రిక కన్యయైనచో ఎవరైన ఆమెను చెరతురేమో

               అనియు,

               అమె ప్టుినింటనే గర్భవతియగునేమో అనియు

               అతని భయము.

               ఆమెకు పెండ్లియైనచో శీలవతిగానుండదేమో

               అనియు లేదా సంతానము కలుగదేమో అనియు

               అతని చింత.

11.           నీ పుత్రికకు తలబిరుసుతనము ఉన్నచో

               కనిప్టిెయుండుము.

               లేదేని ఆమె నీ శత్రువుల ముందు నీకు

               తల వంపులు తెచ్చును.

               నీవు నగర ప్రజల నోళ్ళలో నానుదువు.

               బహిరంగముగా అవమానము పాలగుదువు.

12.          ఆమె ప్రతి మగవాని ముందు తన అందమును

               ప్రదర్శింపకుండునట్లును,

               స్త్రీలతో ముచ్చట్లు పెట్టుకొనకుండునట్లును

               జాగ్రత్తపడుము.

13.          బట్టలను చిమ్మటలువలె, స్త్రీలు స్త్రీలను

               నాశనము చేయుదురు.

14.          ఆడుదాని మంచితనము కంటె

               మగవాని చెడ్డతనము మేలు.

               స్త్రీలు నిందావమానములను తెత్తురు.

2. దేవుని మహిమ:                

1. ప్రకృతిలో

15.          ఇక దేవుని సృష్టినిగూర్చి వివరింతును.

               నేను కన్నులారాగాంచిన సంగతులు విన్నవింతును

               దేవుని వాక్కువలన విశ్వము ప్టుినది.

               సృష్టిఅంతయు ఆయన ఆజ్ఞను పాించును.

16.          సూర్యుని తేజస్సు ప్రతివస్తువు మీద పడినట్లే

               ప్రతివస్తువును దేవుని మహిమతో

               నిండియుండును.

17.          పరిశుద్ధులైన దూతలకుకూడ

               ప్రభువు సృష్టిరహస్యములనెల్ల వెల్లడి చేయుశక్తిని

               దయచేయలేదు.

               ప్రభువు సృష్టిని భద్రముగా నిర్వర్తించెను.

               ఈ విశ్వమంతయు

               తన మహిమతో నిండియుండున్నట్లు చేసెను.        

18.          ఆయన సముద్రగర్భమును,

               మనుష్య హృదయమును పరిశీలించును.

               ఆ రెండి మర్మములను గ్రహించును.

               తెలియవలసినదంతయు

               మహోన్నతునికి తెలియును.

               ఆయన కాలగతులనెల్ల ఎరుగును.

19.          భూత భవిష్యత్తులను ఆయన పరిశీలించును.

               నిగూఢ రహస్యములుకూడ

               ఆయనకు తేటతెల్లమగును.

20.        నరులు ఆలోచించు ఆలోచనలన్నియు,

               పలికెడి పలుకులన్నియు ఆయనెరుగును.

21.          ప్రభువు తాను విజ్ఞానముతో చేసిన

               మహాకార్యములన్నికిని

               ఒక క్రమపద్ధతిని నిర్ణయించెను.

               ఆయన అనాదినుండి అనంతమువరకు

               వర్థిల్లును.

               ఆయన చేసిన సృష్టికి మనమేమి చేర్పజాలము.

               దానినుండి మనమేమి తొలగింపజాలము.

               మన సలహాతో ఆయనకు అవసరములేదు. 

22.        ఆయన సృజించిన వస్తువులన్ని కింకి కన్పించు

               చిన్ననలుసు వరకును  సౌందర్యశోభితములే.

23.        అవియన్నియు శాశ్వతముగా నిలుచును.

               వానిలో ప్రతిదానికి నిర్ణీతమైన ఉద్దేశము కలదు.

24.         వస్తువులన్నియు పరస్పర భిన్నములైన

               ద్వంద్వములుగా గోచరించును.

               ఆయన కలిగించిన వానిలో

               ఏదియు అసంపూర్ణము కాదు.

25.        ప్రతివస్తువును మరియొక వస్తువు శోభను

               ఇనుమడింపజేయును.

               ఆయన మహిమను పరిపూర్ణముగా

               గ్రహించువారెవరు!