ఉపోద్ఘాతము:

పేరు: గ్రీకు భాషలోని ‘అరిద్మోయి’ అను పదమునకు తెలుగు అనువాదము – ‘సంఖ్యలు’ లేదా ‘అంకెలు’.  ఈ గ్రంథములో వివరించబడిన సంఖ్యల ప్రాధాన్యతనుబ్టియే (1, 26 అధ్యా.) ఈ గ్రంథమునకు ‘సంఖ్యాకాండము’ అను నామమును ప్టిెరి. అయితే హీబ్రూ బైబులు ఈ గ్రంథానికి ‘బమ్మిద్బారు’ అనే పేరును సూచించింది. ‘బమ్మిద్బారు’ అనగా ‘ఎడారిలో’ అని అర్ధము. ఈ గ్రంథము యిస్రాయేలీయులు కనాను ఆక్రమించుకోడానికి  సీనాయి నుండి మోవాబు మైదానము వరకు ఎడారి మార్గములో వారు పొందిన అనుభవాలను గూర్చి వివరించును.  ఇందులో వంశావళి ప్టికలున్నాయి. (1:20; 3:21; 7:12; 26:5, 57)

రచయిత(లు): మోషే వ్రాసెనని సాంప్రదాయక అభిప్రాయము. ఈ పంచకాండములను (ఆది, నిర్గమ, లేవీయ, సంఖ్యా, ద్వితీయోపదేశ)  క్రీ.పూ. 6వ శతాబ్దములో బబులోనియా ప్రవాసానంతరము సంకలనము చేయబడెనని పలువురు ఆధునిక పండితుల అభిప్రాయము.

చారిత్రక నేపథ్యము: ఈ గ్రంథమును నిర్గమకాండమునకు కొనసాగింపుగా చూడవచ్చు. వాగ్ధత్తభూమి స్వాధీనము కోసము నిర్గమకాండములో మొదలైనయాత్ర, లేవీయకాండములో (సీనాయి పర్వతమువద్ద) ఆగి, తదనంతరం సంఖ్యాకాండములో కొనసాగుతుంది (10:11). కాదేషులో జరిగిన తిరుగుబాటు, యోర్దానునకు పడమరనున్న అమోరీయా రాజులను ఓడించి వారి భూభాగములను యిస్రాయేలు రెండున్నర తెగలకు హక్కుభుక్తము గావించుట మున్నగు విషయములు ఈ గ్రంథమునందు ఉండును.

ముఖ్యాంశములు: జనాభా లెక్కలు, తిరుగుబాటు (కాదేషు), సణుగుడు, సంచాలనము (ఇబిదీఖిలిజీరిదీవీ), కనానుదేశము, విశ్వాసము, దేవుని క్రమశిక్షణా కార్యక్రమము (అధ్యా. 13-14).  దేవుని కోపము (11:1; 11:31-33; 25:1-11; 12:1-12; 14:1-35; 32:11-14); దేవుని క్షమ, ప్రేమ (14:18-20), ఆధ్యాత్మిక, సామాజిక ఆధిపత్యశ్రేణి ఏర్పాటు, ఆయా శ్రేణులలోని వారి బాధ్యతలు మున్నగు అంశములు వివరించబడినవి.

క్రీస్తుకు అన్వయము: ఈ గ్రంథములో పేర్కొనబడిన కంచుసర్పము (21:4-9); దాహము తీర్చిన బండ (20:1-13; 1 కొరి. 10:4); మన్నా (11:4-9); బిలాము ప్రవచనము (24:17); అగ్ని మేఘ స్తంభము (9:15-23); ఎర్రని ఆవు పెయ్య బూడిద (19:1-6) మున్నగు అంశములను నూతన నిబంధన గ్రంథములో ప్రస్తావించబడినవి (1 కొరి 10:5-11; హెబ్రీ 3:16-4:6).

 

Previous                                                                                                                                                                                                Next                                                                                      

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము