పాలకులు

10 1.       విజ్ఞతగల పాలకుడు తన ప్రజలకు

                              శిక్షణనిచ్చును.

                              అతని పరిపాలన క్రమబద్ధముగా ఉండును.

2.           పాలకుడ్టెివాడో ఉద్యోగులు కూడ

               అి్ట వారగుదురు.

               ప్రజలుకూడ అతని వింవారే  అగుదురు.

3.           విద్యారహితుడైన రాజు ప్రజలను పాడుచేయును.

               పాలకులు విజ్ఞులైనచో ప్రభుత్వము బాగుపడును.

4.           ప్రభువే లోకమును పరిపాలించును,

               అతడు తగినకాలమున తగినవానిని

               పాలకుని చేయును.

5.           ఆ పాలకుని విజయము ప్రభువు చేతిలోనుండును

               ఏ అధికారి కీర్తియైనను

               ప్రభువు మీదనే ఆధారపడి యుండును.

అహంకారము తగదు

6.           తోడి నరుడు చేసెడి

               ప్రతి తప్పిదమునకు కోపపడకుము.

               దురహంకారముతో అమర్యాదగా

               ప్రవర్తింపకుము.

7.            దేవుడు, నరుడు కూడ

               గర్వమును ఏవగించుకొందురు.

               ఆ ఇరువురు కూడ

               అన్యాయమును అసహ్యించుకొందురు.

8.           అన్యాయము, అహంకారము,

               సంపదలవలన రాజ్యములు కూలి,

               జాతినుండి జాతికి మారుచుండును.

9.           దుమ్మును, బూడిదయైన నరులు

               ఏమి చూచుకొని గర్వపడవలెను?

               మనము బ్రతికియుండగనే

               మన శరీరము క్రుళ్ళిపోవును.

10.         నరుని దీర్ఘవ్యాధి వైద్యుని చీకాకుపెట్టును,

               నేడు బ్రతికియున్న రాజుకూడ

               రేపు చచ్చిశవమగును.

11.           నరుడు చచ్చినపిదప అతనికి దక్కునది

               పురుగులు, ఈగలు మాత్రమే.

12.          సృష్టికర్తయైన ప్రభువును విడనాడుట

               గర్వమునకు తొలిమెట్టు,

               వాని హృదయము వాని సృష్టికర్తను విడనాడును.

13.          పాపముతో గర్వము ప్రారంభమగును,

               గర్వితులుగానే మనుగడ సాగించువారు

               మహాదుష్టులగుదురు.

               ప్రభువు అి్ట వారిని తీవ్రశిక్షకు గురిచేసి

               సర్వనాశనము చేయును.

14.          ప్రభువు రాజులను సింహాసనము నుండి 

               కూలద్రోసి, వినయాత్ములను గద్దెనెక్కించెను.

15.          అన్యజాతులను సమూలముగా పెరికివేసి,

               వారి స్థానమున వినమ్రులను పాదుకొల్పెను.

16.          రాజ్యములను నాశనము చేసి

               వానిని అడపొడ కానరాకుండ చేసెను.

17.          అతడు కొన్ని రాజ్యములనెంతగా

               నాశనము చేసెననగా,

               నేడు నేలమీద వాని పేరుకూడ విన్పింపదు.

18.          దేవుడు నరులు కోపింపవలెనని కోరుకొనడు. కనుక నరులు ఉగ్రులగుట తగదు.

గౌరవార్హులు

19.          ప్రాణులలో గౌరవార్హులు ఎవరు? నరులు.

               ఆ నరులలో గౌరవార్హులు ఎవరు? 

               దైవభీతి కలవారు.

               ఇక నిందార్హులు ఎవరు? నరులు.

               ఆ నరులలో నిందార్హులెవరు?

               దైవాజ్ఞలు మీరువారు.

20.        అనుచరులు తమ నాయకుని గౌరవింతురు.

               దైవభీతి కలవారిని దేవుడు గౌరవించును.

21.          దైవభీతి విజయమునకు తొలిమెట్టు.

               కాని గర్వము, మూర్ఖత్వము

               అపజయమునకు  సోపానములు.

22.        ధనవంతులు, సుప్రసిద్ధులు, దరిద్రులెల్లరు కూడ 

               దైవభీతియే తమ గొప్ప అని తలంపవలెను.

23. జ్ఞానియైన పేదవానిని చిన్నచూపు చూడరాదు.

               దుష్టుని గౌరవింపరాదు.

24.         పాలకులు, న్యాయాధిపతులు,

               సుప్రసిద్ధులు గౌరవింపదగినవారే.

               కాని వారెవరు దైవభీతి కలవారి కంటె

               ఎక్కువవారు కారు.

25.        తెలివిగల సేవకుని స్వేచ్ఛాపరులైన

               పౌరులు సేవింతురు.

               తాము తెలివికలవారేని వారికి

               అది తప్పుగా చూపట్టదు.

వినయము, ఆత్మగౌరవము

26.        నీవు పనిచేయునపుడు

               నీ నైపుణ్యము ప్రదర్శింపనక్కరలేదు.

               ఇక్కట్టులలోనున్నపుడు డాంబికము పనికిరాదు.

27.         ప్రగల్భములు పలుకుచు ఆకితో చచ్చుటకంటె

               కష్టపడిపనిచేసి నిండుగా

               తిండి సంపాదించుకొనుట మేలు.

28.        కుమారా! ఆత్మాభిమానమును,

               వినయమును కలిగియుండుము.

               నీకు తగినట్లుగానే నిన్ను నీవు గౌరవించుకొనుము

29.        తనను తాను నిందించుకొనుట వలన

               ప్రయోజనము లేదు.

               ఆత్మగౌరవము లేనివానిని ఇతరులు గౌరవింతురా?

30.        పేదలైనా తెలివికల వారిని గౌరవింపవచ్చును.

               ధనికులను వారి సంపదలనుచూచి  

               సన్మానింతురు.

31.          పేదవానిగనే గౌరవింపబడినచో

               అతడు ధనికుడైనపుడు

               ఇంకను గౌరవము పొందునుకదా!

               ధనికునిగానున్నప్పుడే అవమానము కలిగినచో

               అతడు దరిద్రుడైనపుడు ఇంకను అవమానమును పొందునుకదా!