శోకగీతము
ప్రధానగాయకునికి
షోషనీయులు అను రాగముమీద పాడదగిన దావీదు కీర్తన
69 1. దేవా! నన్ను రక్షింపుము.
నీళ్ళు నా గొంతు వరకు వచ్చినవి.
2. నేను ఊబిగుంటలో దిగబడిపోవుచున్నాను.
నా పాదములకు గ్టినేల తగులుటలేదు.
నేను లోతైన నీళ్ళలోనికి దిగితిని.
కెరటములు నన్ను ముంచివేయుచున్నవి.
3. అరచి అరచి నేను అలసిపోతిని.
నా గొంతు బొంగురు పోయినది.
నీ సహాయము కొరకు చూచిచూచి
కన్నులు వాచినవి.
4. నిష్కారణముగా నన్ను ద్వేషించువారు
నా తలమీద వెంట్రుకలకంటె
ఎక్కువగనేయున్నారు,
నా విరోధులు
నామీద కొండెములు చెప్పుచున్నారు.
వారు బలవంతులు
కనుక నన్ను చంపజూచుచున్నారు.
నేను అపహరింపని వస్తువును
తిరిగి ఈయమనుచున్నారు.
5. దేవా! నేను చేసిన పిచ్చిపని నీకు తెలియును.
నా తప్పిదములు నీవెరుగనివి కావు.
6. సర్వశక్తిమంతుడవైన ప్రభూ!
నిన్ను నమ్మువారికి నా వలన తలవంపులు
రాకుండునుగాక! యిస్రాయేలుదేవా!
నిన్ను వెదకు వారికి నా వలన
అవమానము కలుగకుండును గాక!
7. నీ కారణముననే
నాకు అవమానము ప్రాప్తించినది.
నీ వలననే నేను నిందను తెచ్చుకొింని.
8. నా సోదరులకు నేను పరాయివాడనైతిని.
నా తోబుట్టువులకు నేను అన్యుడనైతిని.
9. నీ దేవాలయముపట్ల నాకుగల భక్తి
నన్ను దహించివేయుచున్నది.
నిన్ను నిందించువారి నిందలు నామీద పడినవి.
10. నేను ఉపవాసము చేసి వినమ్రుడనుకాగా,
జనులు నన్ను ఆడిపోసికొనిరి.
11. శోకసూచకముగా గోనెతాల్చగా
ప్రజలు నన్ను ఎగతాళి చేసిరి.
12. నగరద్వారము వద్ద గుమికూడినవారు
నన్ను గూర్చి చెప్పుకొనిరి.
త్రాగుబోతులు నా మీద పాటలు క్టిరి.
13. ప్రభూ! నా మట్టుకు నేను నీకు అనుకూలమైన
సమయముననే మనవి చేసికొందును.
నీవు మహాకరుణ కలవాడవు.
రక్షణమును దయచేయుదువు,
నమ్మదగినవాడవు.
కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము.
14. ఈ ఊబిగుంటలో దిగబడనీకుండ
నన్ను కాపాడుము.
నా శత్రువులనుండి నన్ను రక్షింపుము.
లోతైన నీళ్ళనుండి నన్ను కావుము.
15. జలప్రవాహము నన్ను ముంచివేయకుండునుగాక!
అగాధసముద్రము
నన్ను మ్రింగివేయకుండునుగాక!
పాతాళము నన్ను కబళింపకుండునుగాక!
16. నీవు మంచివాడవును కృపామయుడవును
గనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము.
మిగుల జాలికలవాడవు
కనుక నా మొర వినుము.
17. ఈ దాసుని నుండి
నీ మొగమును మరుగు చేసికొనకుము.
నేను ఆపదలో చిక్కితిని
కనుక శీఘ్రమే నాకు ఉత్తరమిమ్ము.
18. నా చెంతకువచ్చి నన్ను రక్షింపుము.
నా విరోధులనుండి నన్ను కాపాడుము.
19. నాకు ఎి్ట నిందలు ప్రాప్తించెనో నీకు తెలియును.
నాకు అగౌరవము, అవమానము వాిల్లెనని
నీవు ఎరుగుదువు.
నా విరోధులనెల్ల నీవు గమనించుచునే ఉన్నావు.
20. పరనిందలు నా హృదయమును ముక్కలు చేసెను.
నేను బలమును కోల్పోయితిని.
నేను సానుభూతిని ఆశించితిని.
కాని అది లభ్యము కాదయ్యెను.
ఓదార్పును అభిలషించితినికాని
అది లభింపదయ్యెను.
21. వారు నాకు భోజనమునకు మారుగా
విషమును ఒసగిరి.
నేను దప్పికగొని యున్నపుడు సిర్కాను ఇచ్చిరి.
22. వారి భోజనపుబల్ల వారికి ఉచ్చు అగునుగాక!
వారి ఉత్సవములే
వారిని నాశనము చేయునుగాక!
23. వారి కన్నులకు మసకలుక్రమ్మి
చూడకుందురుగాక!
వారి నడుములు కదలి
నిరంతరము ఊగులాడునుగాక!
24. నీ రౌద్రమును వారిపై కుమ్మరింపుము.
నీ కోపాగ్ని వారిని తరిమి పట్టుకొనునుగాక!
25. వారి శిబిరములు పాడుపడునుగాక!
వారి గుడారములలో
ఎవడును వసింపకుండునుగాక!
26. నీవు శిక్షించినవానిని వారు హింసించిరి.
నీవు గాయపరచినవాని
బాధలనుగూర్చి వారు ముచ్చ్లాడిరి.
27. నీవు వారి పాపములన్నిని గణించి ఉంచుము.
వారు నీ రక్షణమున
పాలుపొందకుండునట్లు చేయుము.
28. సజీవుల గ్రంథమునుండి
వారి పేరును క్టొివేయుదురుగాక!
నీతిమంతుల జాబితానుండి
వారి పేరు క్టొివేయుదురుగాక!
29. నా మట్టుకు నేను దీనుడను
బాధామయుడనై ఉన్నాను.
ప్రభూ! నీ రక్షణముతో నన్ను ఉద్ధరింపుము.
30. నేను గీతములతో ప్రభువును కీర్తించెదను.
కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించెదను.
31. ఎద్దునుగాని, ఎదిగిన కోడెనుగాని
అర్పించినదాని కంటె ఈ కార్యము ప్రభువునకు
ఎక్కువ ప్రీతికలిగించును.
32. ఈ చెయిదమును చూచి దీనులు సంతసింతురు. దేవునికొల్చు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందురు.
33. ప్రభువు ఆర్తులమొర వినును.
ఆయన చెరలోనున్న
తన ప్రజలను అనాదరము చేయడు.
34. భూమ్యాకాశములును, సముద్రములును,
వానిలోని ప్రాణికోటులును
ప్రభుని స్తుతించునుగాక!
35. దేవుడు సియోనును రక్షించును.
యూదా పట్టణములను పునర్నిర్మించును.
ప్రభునిసేవకులు సియోనున వసించి
భూమిని స్వాధీనము చేసికొందురు.
36. ప్రభువు సేవకుల బిడ్డలు ఆ నేలను
వారసత్వముగా బడయుదురు.
ఆయనను ప్రేమించువారు
ఆ తావున వసింతురు.