ఉపోద్ఘాతం:

పేరు: ఈ గ్రంథం పేరు ”అపోస్తలుల కార్యములు” లేదా ”అపోస్తలుల చర్యలు”గా మనకు తెలుసు. ‘అపోస్తలుల కార్యములు’ అనే పేరు జుబీశిరీ ళితీ శినీలి జుచీళిరీశిజిలిరీ ఆంగ్ల శీర్షికకు  తెలుగు అనువాదం.

కాలం: క్రీ.శ. 80-90.

రచయిత: గ్రంథకర్త ప్రస్తావన గ్రంథంలో తెలుపక పోయినప్పటికీ లూకాయేననడానికి ఆధారాలున్నాయి. దానికి తోడు లూకాయే ఈ విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేశాడు (1:1; లూకా 1:1-4).

చారిత్రక నేపథ్యం: అపోస్తలుల కార్యముల గ్రంథం క్రీ.శ. 2వ శతాబ్దం నుండియే వెలుగులోనికి వచ్చింది. క్రీస్తు మూలాన పాలస్తీనాలో ఊహించని విప్లవం జరిగింది. ‘క్రైస్తవత్వం’  (క్రైస్తవ మతం) విరివిగా వ్యాప్తి చెందింది. క్రైస్తవత్వానికి లింగ, వర్ణ,  వర్గ, పాలకులు పాలితులన్న భేదాలు లేకుండా అందరూ ఆకర్షితులయ్యారు (1:8; 6:5; 8:5; 8:2-3; 11:9). క్రీస్తు శిష్యులు, పౌలు ప్రపంచ నలుమూలల ప్రయాణాలు చేసి బోధలు చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. పాలకులు క్రైస్తవులను అనేక హింసలకు గురిచేశారు.  అట్టి పరిస్థితుల్లో క్రైస్తవుల  విశ్వాసాన్ని దృఢపరచి, మనోధైర్యం నింపడానికి ఈ గ్రంథం తోడ్పడిందనడంలో సందేహం లేదు.

ముఖ్యాంశాలు: క్రీస్తు ప్రభువు అప్పగించిన రక్షణ ప్రణాళికకు కార్యరూపం ఇచ్చారు అపోస్తలులు. ఈ కార్యాల సమగ్ర   సంకలనమే  ”అపోస్తలుల కార్యములు”  గ్రంథం.  ఈ  గ్రంథంలో   క్రింది  వేదాంతాంశాలను  చూస్తాం: 1) చరిత్రలో  దేవుని  ప్రణాళిక కొనసాగింపు (2:17-21;13:47; 15:16-18). 2) క్రీస్తు సువార్త సందేశం – ప్రేషిత కార్యం. వ్యతిరేకత మధ్య గూడ ప్రేషితకార్యం ముందడుగు (14:22; 2:7-8, 13; 12:2; 10:9-16). 3) దైవజనులలో ఇతరులను (అన్యులను) చేర్చుకోవడం (14:1;19:20; 20:21). 4. శ్రీసభ జీవితం, నిర్మాణం, పిష్టత (2:42-47; 4:32-37).

క్రీస్తు చిత్రీకరణ: ఈ గ్రంథంలో కేంద్ర బిందువు క్రీస్తు. పరిశుద్ధాత్మ, అపోస్తలులు, పౌలు, విశ్వాసులు క్రీస్తుకు సాక్ష్యమిచ్చారు (2:22-36; 10:34-43). ఈ క్రీస్తునే ప్రవక్తలందరు ప్రవచించారు, ఆయనకు సాక్ష్యమిచ్చారు (10:43). క్రీస్తు నామం తప్ప మరొక నామం లేదు (4:12).

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము